చూస్తారేం.. బెల్ట్ తీయండి..
బస్సు లేటైంది.. అబ్బా.. నడిచివెళ్లాలా అని ఆలోచించాల్సిన పనిలేదు. బెల్ట్ తీయండి.. దాన్ని స్కూటర్‌లా మార్చండి.. ఎంచక్కా కాలేజీకి వెళ్లిపోండి.. ఇది బెల్ట్ స్కూటర్. అవసరమైనప్పుడు స్కూటర్.. అక్కర్లేనప్పుడు బెల్ట్. టూ ఇన్ వన్. దీన్ని హంగేరీకి చెందిన ఆడమ్ హోరోక్ అనే డిజైనర్ తయారుచేశారు. భవిష్యత్తులో రవాణా సాధనాలు కూడా చిన్నవిగా, సౌకర్యవంతంగా మారిపోతాయని దానికి ఉదాహరణే ఈ బెల్ట్ స్కూటర్ అని ఆడమ్ చెబుతున్నారు.