పోకేమాన్ ఆడుతూ గుద్దేశాడు | Japanese truck driver playing Pokemon Go kills pedestrian | Sakshi
Sakshi News home page

పోకేమాన్ ఆడుతూ గుద్దేశాడు

Published Thu, Aug 25 2016 11:45 AM | Last Updated on Tue, Sep 18 2018 7:40 PM

పోకేమాన్ ఆడుతూ గుద్దేశాడు - Sakshi

పోకేమాన్ ఆడుతూ గుద్దేశాడు

టోక్యో: పోకేమాన్ వీడియో గేమ్ పిచ్చి ముదిరిపోతోంది. పోకేమాన్ గేమ్ ఆడుతూ జపాన్ లో ఓ ట్రక్కు డ్రైవర్ మహిళ మరణానికి కారకుడయ్యాడు. పోకేమాన్ గేమ్ లో మునిగిపోయి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి తన వాహనంతో ఇద్దరు మహిళలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఓ మహిళ మరణించగా, మరొకరికి గాయాలయ్యాయి. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్టు తుకుషిమా పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు.

మృతురాలి కుటుంబానికి నింటెండో సంస్థ సంతాపం తెలిపింది. వినియోగదారులు పోకేమాన్ వీడియో గేమ్ ఆడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. డ్రైవింగ్ లో ఉన్నప్పుడు గేమ్ ఆడకుండా ఉండేందుకు పాప్-అప్ ను జోడించనున్నట్టు వెల్లడించారు. పోకేమాన్ గేమ్ కారణంగా ప్రమాదాలు పెరుగుతుండం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు పోకేమాన్ ఆడొద్దంటూ హెచ్చరికలు జారీ చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement