
కన్నీటి ద్వారా జికా వ్యాప్తి
వాషింగ్టన్: కళ్లు.. కన్నీళ్లకు రిజర్వాయర్లు అని మనకు తెలుసు. కానీ ఇవే కళ్లు.. జికా వైరస్‌ను కూడా భద్రంగా దాచుకుంటాయి. అయితే కన్నీళ్ల ద్వారా బయటకు వచ్చే ఈ వైరస్.. ఆ తర్వాత విశృంఖలంగా విస్తరిస్తుందని పరిశోధనల్లో తేలింది. కన్నీటి ద్వారా జికా వైరస్ వ్యాపించ గలదని ఎలుకల కన్నీటిపై చేసిన పరిశోధనల్లో అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు.
పెద్దలకు జికా కన్నీటి ద్వారా సోకితే.. వెంటనే కళ్లు ఎర్రబడి.. కాసేపట్లోనే మెదడు పాడైపోతుందని వెల్లడైంది. గర్భంలో ఉన్న చిన్నారులకు జికా సోకితే.. పుట్టిన తర్వాత అంధత్వం వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.