'నా మాజీ భర్తను ఎప్పటికీ క్షమించను' | Katie Price won't forgive ex-husband | Sakshi
Sakshi News home page

'నా మాజీ భర్తను ఎప్పటికీ క్షమించను'

Published Tue, Dec 8 2015 8:46 AM | Last Updated on Sun, Sep 3 2017 1:42 PM

'నా మాజీ భర్తను ఎప్పటికీ క్షమించను'

'నా మాజీ భర్తను ఎప్పటికీ క్షమించను'

లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ మోడల్ కాతీ ప్రైస్ కోపంతో ఊగిపోతోంది. తన మాజీ భర్త చేసిన తప్పును పదేపదే ఊహించుకుంటూ రగిలిపోతోంది. ఆయన చేసిన ద్రోహం ఎప్పటికి క్షమించరానిదంటూ ఆగ్రహంతో మండిపోతోంది. 2014 మే నెలలో తనను తన భర్త కైరాన్ హేలర్ దారుణంగా మోసం చేశాడని, తన స్నేహితురాలు జేన్ పౌట్నీతో గడుపుతూ తనకు ప్రత్యక్షంగా దొరికిపోయాడని ఆ విషయం తాను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది. అనంతరం ఆమె అతడితో విడిపోయింది.

'నేను ఎప్పటికీ క్షమించను. నేను ఎప్పటికీ మర్చిపోను. ఆ విషయం మీకు త్వరలోనే తెలుస్తుంది' అంటూ కాతీ చెప్పుకొచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ క్రిస్టమస్ కు అతడిని కలుస్తున్నానని, ఈ సందర్భంగా తనకు ఓ బహుమతి కూడా ఇస్తున్నానని, అది తనకు రెండేళ్ల కిందట చేసిన ద్రోహాన్ని గుర్తుచేసేలా ఉంటుందని చెప్పింది. అయితే, ఆ బహుమతి ఏమిటనే విషయం మాత్రం ఇప్పుడే చెప్పనని, అతడికి తెలుస్తుందని చెప్పుకొచ్చింది కాతీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement