katie price
-
ఎందుకు సిగ్గు పడాలి: మోడల్ ఆగ్రహం
లండన్: పదికోట్లు ఇస్తే తన శరీరాన్ని వారికి అప్పగిస్తానని గతంలో చెప్పడంతో ఆమెను అందరూ అసహ్యించుకున్నారు. కానీ అదే మహిళ నేడు తన కుమారుడి కోసం తల్లిగా చేస్తున్న పోరాటాన్ని నెటిజన్లు సహృదయంతో ప్రశంసిస్తున్నారు. మూడో భర్త కీరాన్ హేలర్‌తో కలిసి ఉంటున్న బ్రిటన్ ప్రముఖ మోడల్, సింగర్ కేటీ ప్రైస్ తన జీవితంలో ఏ విషయంలోనూ సిగ్గుపడాల్సిన అంశాలే లేవన్నారు. ఇంకా చెప్పాలంటే.. ఆన్లైన్లో కుమారుడిపై వస్తున్న కామెంట్లను అరికట్టేందుకు వేసిన పిటిషన్ తాను చేసిన పనుల్లో అత్యుత్తమమైనదిగా కేటీ అభిప్రాయపడ్డారు. కుమారుడు హార్వీ (15)ని ఎప్పుడూ ఎందుకు ప్రపంచానికి పరిచయం చేస్తున్నారని కొందరు ఆమెను ప్రశ్నిస్తున్నారు. హార్వీలో ఎన్నో లోపాలున్నాయని, కుమారుడి కారణంగా కేటీ ప్రైస్ ఎన్నో అవమానాలు భరిస్తున్నారని.. ఎంతో సహనంతో వాటిని ఎదుర్కొంటున్నారని మరికొందరు నెటిజన్లు ఆమెపై సానుభూతి చూపిస్తున్నారు. ఈ క్రమంలో హార్వీ గురించి తల్లి టీవీ వ్యాఖ్యాత కేటీ ప్రైస్ స్థానిక మీడియాలో చర్చిస్తూ విమర్శకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.'నా కుమారుడు హార్వీ ప్రాడెర్ విల్లీ సిండ్రోమ్, సెప్టో ఆప్టిక్ డిస్ప్లేసియా, ఆటిజం లాంటి సమస్యలతో బాధపడుతున్నాడు. అందరు తల్లుల్లాగే నేను కూడా హార్వీని టీవీ షోలకు తీసుకెళ్తున్నాను. తల్లిగా నేను చేయాల్సింది అతడికి మద్ధతుగా ఉండి ప్రేమను పంచడమే. పిల్లల లోపాలను మనం ఎత్తిచూపకూడదు. మనం ఎక్కడికి వెళ్తే వారిని కూడా తీసుకెళ్తే ఎంతో రిలాక్స్ అవుతారు. హార్వీని చూసి నేను సిగ్గుపడాల్సిన, ఆవేదన చెందాల్సిన అవసరమే లేదు. వాడి మంచితనం అందరికీ తెలియాలంటే బయటకు తీసుకెళ్లడమే ఉత్తమమని' మోడల్ కేటీ ప్రైస్ వివరించారు. -
పది కోట్లకు శరీరాన్ని అమ్మేస్తా: కేటీ ప్రైస్
లండన్: ‘నా శరీరాన్ని పది కోట్ల రూపాయలకు అమ్మేస్తాను’ అని ఇటీవలనే మూడవ భర్తగా కీరాన్ హేలర్‌ను పెళ్లి చేసుకున్న బ్రిటన్‌కు చెందిన 37 ఏళ్ల గ్లామరస్ మోడల్, ప్రముఖ టీవీ పర్సనాలిటీ కేటీ ప్రైస్ ప్రకటించారు. ‘లూజ్ విమెన్’ అనే టీవీ కార్యక్రమంలో వ్యభిచారంపై జరిగిన ఓ చర్చలో పాల్గొంటూ ఈ ఆఫర్ ఇచ్చారు. ఇలా ప్రకటన చేసినంత మాత్రాన తనను వ్యభిచారిగా భావించరాదని, కానీ పది కోట్ల రూపాయల మొత్తంలో ఆఫర్ వస్తే కచ్చితంగా తన బాడీని అమ్మేందుకు సిద్ధమేనని చెప్పారు. అయితే ఈ విషయంలో తన మూడవ భర్త అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని, అంత మొత్తంలో డబ్బొస్తుందంటే ఆయన మాత్రం ఎందుకు కాదంటారని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆన్లైన్లో ఆమె ఆఫర్ చర్చనీయాంశం అయింది. -
'నా మాజీ భర్తను ఎప్పటికీ క్షమించను'
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ మోడల్ కాతీ ప్రైస్ కోపంతో ఊగిపోతోంది. తన మాజీ భర్త చేసిన తప్పును పదేపదే ఊహించుకుంటూ రగిలిపోతోంది. ఆయన చేసిన ద్రోహం ఎప్పటికి క్షమించరానిదంటూ ఆగ్రహంతో మండిపోతోంది. 2014 మే నెలలో తనను తన భర్త కైరాన్ హేలర్ దారుణంగా మోసం చేశాడని, తన స్నేహితురాలు జేన్ పౌట్నీతో గడుపుతూ తనకు ప్రత్యక్షంగా దొరికిపోయాడని ఆ విషయం తాను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది. అనంతరం ఆమె అతడితో విడిపోయింది. 'నేను ఎప్పటికీ క్షమించను. నేను ఎప్పటికీ మర్చిపోను. ఆ విషయం మీకు త్వరలోనే తెలుస్తుంది' అంటూ కాతీ చెప్పుకొచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ క్రిస్టమస్ కు అతడిని కలుస్తున్నానని, ఈ సందర్భంగా తనకు ఓ బహుమతి కూడా ఇస్తున్నానని, అది తనకు రెండేళ్ల కిందట చేసిన ద్రోహాన్ని గుర్తుచేసేలా ఉంటుందని చెప్పింది. అయితే, ఆ బహుమతి ఏమిటనే విషయం మాత్రం ఇప్పుడే చెప్పనని, అతడికి తెలుస్తుందని చెప్పుకొచ్చింది కాతీ. -
'మా ఆయనంటే వందశాతం నమ్మకం'
లండన్: తన భర్త తప్పు చేసినా అతడిపై ఏ మాత్రం విశ్వాసం సన్నగిల్లలేదని ప్రముఖ హాలీవుడ్ సింగర్, మోడల్ కాతీ ప్రైస్ అంటోంది. అతడు ఎలాంటి పనులు చేసినా చివరికి తన వద్దకే వస్తాడని, తన ఇంటి చుట్టే తిరుగుతాడని, తానంటే అతడికి చెప్పలేనంత ప్రేమ అని చెప్తోంది. 38 సంవత్సరాల కాతీ ప్రైస్ వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైన కైరాన్ హేలర్‌ను 2013లో వివాహం చేసుకుంది. అంతకుముందే ఆమెకు రెండు వివాహాలు అయ్యాయి. పీటర్ ఆండ్రే అనే వ్యక్తిని ఆమె 2005లో వివాహం చేసుకోగా వారి దాంపత్యం 2009కే ముక్కలైంది. అనంతరం అలెక్స్ రైడ్ అనే వ్యక్తిని 2010లో వివాహం చేసుకోగా ఆ బంధం కూడా రెండేళ్లపాటే కొనసాగింది. దీంతో 2013లె ఆయు కైరాన్ హేలర్ ను వివాహం చేసుకుంది. అయితే, అతడు ఇటీవల కాతీ స్నేహితురాలైన జేన్ పాట్నీతో అతడు వివాహేతర సంబంధం పెట్టకొని రెడ్ హ్యాండెడ్‌గా కాతికి దొరికిపోయాడు. ఈ విషయం బయటకు తెలిసి నానా రకాలుగా విమర్శలు వచ్చాయి. అయితే, ఆ విమర్శలను పక్కకు పెడితే తన భర్తను వెనకేసుకొచ్చింది కాతీ. 'అందరూ కైరాన్ తప్పుచేశాడని, మోసగాడని, అబద్ధాల కోరని అంటున్నారు. కానీ నేను మాత్రం ఓ కరడుగట్టిన న్యాయమూర్తిలాంటిదాన్ని. అలాంటి విషయాలు పట్టించుకోను. అతడు ఏం మారిపోయాడో నాకే తెలుసు. అతడిని నేను వందశాతం నమ్ముతా' అంటూ కాతీ పేర్కొందని ఓ మ్యాగజైన్ తెలిపింది. తనను తాను తెలుసుకున్న కైరాన్ ప్రస్తుతం బుద్ధిగా ఉంటున్నాడని, తనకు తాను తన పిల్లలు తప్ప మరే లోకం లేదని ఆమె చెప్పినట్లు వివరించింది. -
అబ్బో... మరీ ఇంత పిచ్చా
లండన్ : బ్రిటిష్ మాజీ మోడల్, టీవీ నటి కేట్ ప్రైస్ అంటే తల్లీకూతుళ్లు జార్జీనా క్లార్కీ (38), కల్ల్యా మోర్సీ (20) అంతులేని ప్రేమ. ఆమె రూప లావణ్యంతోపాటు శరీర సౌష్టవాన్ని చూసి వారు ముగ్ధులయ్యారు. తాము కూడా మరో కేట్ ప్రైస్‌లు కావాలనుకున్నారు. అంతే అందుకోసం ఒకటి... రెండు కాదు... వేల సార్లు శస్త్ర చికిత్సలు చేయించుకునేందుకు సైతం వారు సిద్ధమైయ్యారు. అలా వేలాది సార్లు శస్త్ర చికిత్సలు చేయించుకుని తాము అనుకున్నది మరీ సాధించుకున్నారీ తల్లీకూతుళ్లు. అందుకు 56 వేల పౌండ్లు ఖర్చు పెట్టారు. మా అమ్మే నాకు బెస్ట్ర్ ఫ్రెండ్... మా బంధం బలపడేందుకు ప్లాస్టిక్ సర్జరీ ఓ మార్గమైంది.... శస్త్ర చికిత్స చేయించుకునే ముందు ప్రతి సారి కేట్ ప్రైస్లా కావాలని అనుకునేదానినని కల్ల్యా మోర్సీ వెల్లడించింది. ఈ మేరకు ద సన్ న్యూస్ పేపర్ పేర్కొంది. మోర్సీ 17 ఏళ్ల నుంచి కేట్ ప్రైస్లా కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐడియాను తల్లికి చెప్పింది. అది తల్లి జార్జీనా క్లార్కీకి కూడా నచ్చింది. దాంతో ఇద్దరు కేట్ ప్రైస్లా మారాలని కలలు కని... ఆ కలను సాకారం చేసుకున్నారు. కేట్ ప్రైస్ అంటే పిచ్చి ఉండవచ్చు కానీ మరీ ఇలా కూడా ఉంటుందా అనేది ఈ తల్లీకూతుళ్లను చూస్తే తెలుస్తోంది. కేట్ ప్రైస్ అంటే మోజు బ్రిటిష్ మోడల్, టీవీ నటి కేటీ ప్రైస్ అంటే జనాలకు అలా ఇలా కాదు ఓ విధమైన క్రేజ్. ముచ్చట పడి ఆమె చేసుకున్న మూడో పెళ్లి కూడా గతేడాది మేలో పెటాకులైంది. ఆ నాటికే ఆమె గర్భవతి. ఆమెకు నలుగురు పిల్లలు. పెళ్లి అంటే మొహం మొత్తిందో ఏమో కానీ ఇక జీవితంలో మళ్లీ పెళ్లి చేసుకుంటే ఒట్టు అంటు తన మీద తానే ఒట్టు పెట్టుకుందీ అమ్మడు. -
'ఇక జీవితంలో పెళ్లి చేసుకుంటే ఒట్టు'
వరుసగా మూడో పెళ్లి కూడా పెటాకులు కావడంతో బ్రిటిష్ మోడల్, టీవీ నటి కేటీ ప్రైస్‌కు తత్వం బాగా బోధపడింది. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఆమె, ఇక జన్మలో పెళ్లంటూ చేసుకునేది లేదని కుండ బద్దలుకొట్టి మరీ చెబుతోంది. కైరన్ హేలర్కు, కేటీ ప్రైస్‌కు ఇంతకుముందు పెళ్లయింది. వాళ్లిద్దరూ గత నెలలో విడిపోయారు. ఇప్పటికి చాలాసార్లు తాను పెళ్లికూతురు అయ్యానని, ఏం జరిగిందో తెలుస్తోందని, ఇప్పుడు ఎటూ తాము విడిపోయి నెల రోజులు అవుతున్నా కూడా సంతోషంగా ఉన్నామని ప్రైస్ చెబుతోంది. ఇక తాను పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదని, అసలు మరోసారి పెళ్లి అవుతుందని కూడా అనుకోవట్లేదని తెలిపింది. ఇంతకుముందు ఆస్ట్రేలియన్ పాప్ స్టార్ పీటర్ ఆండ్రీ, కేజ్ఫైటర్ అలెక్స్ రీడ్లను ఆమె పెళ్లాడింది. కేట్కు జూనియర్, ప్రిన్సెస్ టియామీ, హార్వీ అనే ముగ్గురు పిల్లలున్నారు. ఇప్పుడు మరోసారి గర్భవతి. ఈసారి పుట్టబోయే వాళ్లకోసం ఆమె ఆతృతగా ఎదురుచూస్తోంది.