అబ్బో... మరీ ఇంత పిచ్చా | Mother, daughter undergo surgey to look like Katie Price | Sakshi
Sakshi News home page

అబ్బో... మరీ ఇంత పిచ్చా

Published Thu, Aug 27 2015 9:37 AM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM

అబ్బో... మరీ ఇంత పిచ్చా

అబ్బో... మరీ ఇంత పిచ్చా

లండన్ : బ్రిటిష్ మాజీ మోడల్, టీవీ నటి కేట్ ప్రైస్ అంటే తల్లీకూతుళ్లు జార్జీనా క్లార్కీ (38), కల్ల్యా మోర్సీ (20) అంతులేని ప్రేమ. ఆమె రూప లావణ్యంతోపాటు శరీర సౌష్టవాన్ని చూసి వారు ముగ్ధులయ్యారు. తాము కూడా మరో కేట్ ప్రైస్లు కావాలనుకున్నారు. అంతే అందుకోసం ఒకటి... రెండు కాదు... వేల సార్లు శస్త్ర చికిత్సలు చేయించుకునేందుకు సైతం వారు సిద్ధమైయ్యారు. అలా వేలాది సార్లు శస్త్ర చికిత్సలు చేయించుకుని తాము అనుకున్నది మరీ సాధించుకున్నారీ తల్లీకూతుళ్లు.

అందుకు 56 వేల పౌండ్లు ఖర్చు పెట్టారు. మా అమ్మే నాకు బెస్ట్ర్ ఫ్రెండ్... మా బంధం బలపడేందుకు ప్లాస్టిక్ సర్జరీ ఓ మార్గమైంది.... శస్త్ర చికిత్స చేయించుకునే ముందు ప్రతి సారి కేట్ ప్రైస్లా కావాలని అనుకునేదానినని కల్ల్యా మోర్సీ వెల్లడించింది. ఈ మేరకు ద సన్ న్యూస్ పేపర్ పేర్కొంది.  మోర్సీ 17 ఏళ్ల నుంచి కేట్ ప్రైస్లా కావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ఐడియాను తల్లికి చెప్పింది. అది తల్లి జార్జీనా క్లార్కీకి కూడా నచ్చింది. దాంతో ఇద్దరు కేట్ ప్రైస్లా మారాలని కలలు కని... ఆ కలను సాకారం చేసుకున్నారు. కేట్ ప్రైస్ అంటే పిచ్చి ఉండవచ్చు కానీ మరీ ఇలా కూడా ఉంటుందా అనేది ఈ తల్లీకూతుళ్లను చూస్తే తెలుస్తోంది.  

కేట్ ప్రైస్ అంటే మోజు
బ్రిటిష్ మోడల్, టీవీ నటి కేటీ ప్రైస్ అంటే జనాలకు అలా ఇలా కాదు ఓ విధమైన క్రేజ్. ముచ్చట పడి ఆమె చేసుకున్న మూడో పెళ్లి కూడా గతేడాది మేలో పెటాకులైంది. ఆ నాటికే ఆమె గర్భవతి. ఆమెకు నలుగురు పిల్లలు. పెళ్లి అంటే మొహం మొత్తిందో ఏమో కానీ ఇక జీవితంలో మళ్లీ పెళ్లి చేసుకుంటే ఒట్టు అంటు తన మీద తానే ఒట్టు పెట్టుకుందీ అమ్మడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement