
సాక్షి, న్యూఢిల్లీ : అది మే 23వ తేదీ. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కబీర్ కత్రి కుమారులు ఆస్పత్రులకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. 69 ఏళ్ల కబీర్ కత్రి డయాబెటిక్. వారం రోజుల క్రితం ఆయనకు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గాల్ బ్లాడర్‌కు సర్జరీ చేయాల్సి ఉండింది. అయితే కబీర్ కత్రికి కరోనా మహమ్మారి లక్షణాలు కనిపించడంతో సర్జరీని వాయిదా వేశారు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఆస్పత్రుల్లో చేర్చుకుంటామంటూ ముంబై ప్రభుత్వం ఆస్పత్రులు మార్గదర్శకాలు విడుదల చేయడంతో కత్రిని ఆయన కుమారులు ఇంటికి తీసుకొచ్చి ఇంటి వద్దనే చికిత్స చేయిస్తున్నారు. (‘నవంబర్, డిసెంబర్లోనే భారత్లో కరోనా?’)
ప్రతిరోజు ఆయన ఆక్సిజన్ లెవల్‌ను పర్యవేక్షిస్తున్నారు. మే 23వ తేదీన ఆక్సిజన్ లెవల్స్ 50 శాతం పడి పోవడంతో కరోనా ఎమర్జెన్సీ నెంబర్లకు ఉదయం నుంచి ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఏ ఆస్పత్రికి ఫోన్ చేసినా ఒకటే సమాధానం ‘బెడ్లు లేవు’ అంటూ. ఆ రోజు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో చెంబూరులోని ఓ ప్రైవేటు అస్పత్రి కత్రీని చేర్చుకునేందుకు అంగీకరించింది. ఆ రోజు రాత్రి 8 గంటల వరకు అంబులెన్స్ కోసం కత్రి ఇద్దరు కొడుకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. 108కు ఫోన్ చేస్తే బిజీ బీజీ అని రావడం, ఫోన్ కలసినప్పుడు అంబులెన్స్ అందుబాటులో లేదనే సమాధానం. (ఐసోలేషన్ ఆవరణలో వైద్యుల చిందులు)
చివరకు విసిగిపోయిన కత్రి కుమారులు ఆయన్ని సొంత కారులో తీసుకొని ఆస్పత్రికి బయల్దేరారు. అప్పటికే ఆయన ప్రాణాలు గాలిలో కలసి పోయాయి. ఇలా ఆస్పత్రిలో బెడ్లు దొరక్క, సకాలంలో అంబులెన్స్ రాక నగరంలో ఎంతో మంది మరణిస్తున్నారు. ఇప్పటి వరకు ముంబై నగరంలో బుధవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 41,986కు చేరుకోగా, మృతుల సంఖ్య1,368కు చేరాయి. (అన్లాక్ 1 : ఇక వారు ఇండియాకు రావొచ్చు)
Comments
Please login to add a commentAdd a comment