surgey
-
అప్పటికే ఆయన ప్రాణాలు గాలిలో..
సాక్షి, న్యూఢిల్లీ : అది మే 23వ తేదీ. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కబీర్ కత్రి కుమారులు ఆస్పత్రులకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. 69 ఏళ్ల కబీర్ కత్రి డయాబెటిక్. వారం రోజుల క్రితం ఆయనకు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గాల్ బ్లాడర్‌కు సర్జరీ చేయాల్సి ఉండింది. అయితే కబీర్ కత్రికి కరోనా మహమ్మారి లక్షణాలు కనిపించడంతో సర్జరీని వాయిదా వేశారు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఆస్పత్రుల్లో చేర్చుకుంటామంటూ ముంబై ప్రభుత్వం ఆస్పత్రులు మార్గదర్శకాలు విడుదల చేయడంతో కత్రిని ఆయన కుమారులు ఇంటికి తీసుకొచ్చి ఇంటి వద్దనే చికిత్స చేయిస్తున్నారు. (‘నవంబర్, డిసెంబర్లోనే భారత్‌లో కరోనా?’) ప్రతిరోజు ఆయన ఆక్సిజన్ లెవల్‌ను పర్యవేక్షిస్తున్నారు. మే 23వ తేదీన ఆక్సిజన్ లెవల్స్ 50 శాతం పడి పోవడంతో కరోనా ఎమర్జెన్సీ నెంబర్లకు ఉదయం నుంచి ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఏ ఆస్పత్రికి ఫోన్ చేసినా ఒకటే సమాధానం ‘బెడ్లు లేవు’ అంటూ. ఆ రోజు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో చెంబూరులోని ఓ ప్రైవేటు అస్పత్రి కత్రీని చేర్చుకునేందుకు అంగీకరించింది. ఆ రోజు రాత్రి 8 గంటల వరకు అంబులెన్స్ కోసం కత్రి ఇద్దరు కొడుకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. 108కు ఫోన్ చేస్తే బిజీ బీజీ అని రావడం, ఫోన్ కలసినప్పుడు అంబులెన్స్ అందుబాటులో లేదనే సమాధానం. (ఐసోలేషన్ ఆవరణలో వైద్యుల చిందులు) చివరకు విసిగిపోయిన కత్రి కుమారులు ఆయన్ని సొంత కారులో తీసుకొని ఆస్పత్రికి బయల్దేరారు. అప్పటికే ఆయన ప్రాణాలు గాలిలో కలసి పోయాయి. ఇలా ఆస్పత్రిలో బెడ్లు దొరక్క, సకాలంలో అంబులెన్స్ రాక నగరంలో ఎంతో మంది మరణిస్తున్నారు. ఇప్పటి వరకు ముంబై నగరంలో బుధవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 41,986కు చేరుకోగా, మృతుల సంఖ్య1,368కు చేరాయి. (అన్‌లాక్ 1 : ఇక వారు ఇండియాకు రావొచ్చు) -
అబ్బో... మరీ ఇంత పిచ్చా
లండన్ : బ్రిటిష్ మాజీ మోడల్, టీవీ నటి కేట్ ప్రైస్ అంటే తల్లీకూతుళ్లు జార్జీనా క్లార్కీ (38), కల్ల్యా మోర్సీ (20) అంతులేని ప్రేమ. ఆమె రూప లావణ్యంతోపాటు శరీర సౌష్టవాన్ని చూసి వారు ముగ్ధులయ్యారు. తాము కూడా మరో కేట్ ప్రైస్‌లు కావాలనుకున్నారు. అంతే అందుకోసం ఒకటి... రెండు కాదు... వేల సార్లు శస్త్ర చికిత్సలు చేయించుకునేందుకు సైతం వారు సిద్ధమైయ్యారు. అలా వేలాది సార్లు శస్త్ర చికిత్సలు చేయించుకుని తాము అనుకున్నది మరీ సాధించుకున్నారీ తల్లీకూతుళ్లు. అందుకు 56 వేల పౌండ్లు ఖర్చు పెట్టారు. మా అమ్మే నాకు బెస్ట్ర్ ఫ్రెండ్... మా బంధం బలపడేందుకు ప్లాస్టిక్ సర్జరీ ఓ మార్గమైంది.... శస్త్ర చికిత్స చేయించుకునే ముందు ప్రతి సారి కేట్ ప్రైస్లా కావాలని అనుకునేదానినని కల్ల్యా మోర్సీ వెల్లడించింది. ఈ మేరకు ద సన్ న్యూస్ పేపర్ పేర్కొంది. మోర్సీ 17 ఏళ్ల నుంచి కేట్ ప్రైస్లా కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐడియాను తల్లికి చెప్పింది. అది తల్లి జార్జీనా క్లార్కీకి కూడా నచ్చింది. దాంతో ఇద్దరు కేట్ ప్రైస్లా మారాలని కలలు కని... ఆ కలను సాకారం చేసుకున్నారు. కేట్ ప్రైస్ అంటే పిచ్చి ఉండవచ్చు కానీ మరీ ఇలా కూడా ఉంటుందా అనేది ఈ తల్లీకూతుళ్లను చూస్తే తెలుస్తోంది. కేట్ ప్రైస్ అంటే మోజు బ్రిటిష్ మోడల్, టీవీ నటి కేటీ ప్రైస్ అంటే జనాలకు అలా ఇలా కాదు ఓ విధమైన క్రేజ్. ముచ్చట పడి ఆమె చేసుకున్న మూడో పెళ్లి కూడా గతేడాది మేలో పెటాకులైంది. ఆ నాటికే ఆమె గర్భవతి. ఆమెకు నలుగురు పిల్లలు. పెళ్లి అంటే మొహం మొత్తిందో ఏమో కానీ ఇక జీవితంలో మళ్లీ పెళ్లి చేసుకుంటే ఒట్టు అంటు తన మీద తానే ఒట్టు పెట్టుకుందీ అమ్మడు.