'ఇక జీవితంలో పెళ్లి చేసుకుంటే ఒట్టు' | No more marriages, says Katie Price | Sakshi
Sakshi News home page

'ఇక జీవితంలో పెళ్లి చేసుకుంటే ఒట్టు'

Published Fri, Jun 6 2014 2:54 PM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM

'ఇక జీవితంలో పెళ్లి చేసుకుంటే ఒట్టు'

'ఇక జీవితంలో పెళ్లి చేసుకుంటే ఒట్టు'

వరుసగా మూడో పెళ్లి కూడా పెటాకులు కావడంతో బ్రిటిష్ మోడల్, టీవీ నటి కేటీ ప్రైస్కు తత్వం బాగా బోధపడింది. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఆమె, ఇక జన్మలో పెళ్లంటూ చేసుకునేది లేదని కుండ బద్దలుకొట్టి మరీ చెబుతోంది. కైరన్ హేలర్కు, కేటీ ప్రైస్కు ఇంతకుముందు పెళ్లయింది. వాళ్లిద్దరూ గత నెలలో విడిపోయారు.

ఇప్పటికి చాలాసార్లు తాను పెళ్లికూతురు అయ్యానని, ఏం జరిగిందో తెలుస్తోందని, ఇప్పుడు ఎటూ తాము విడిపోయి నెల రోజులు అవుతున్నా కూడా సంతోషంగా ఉన్నామని ప్రైస్ చెబుతోంది. ఇక తాను పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదని, అసలు మరోసారి పెళ్లి అవుతుందని కూడా అనుకోవట్లేదని తెలిపింది. ఇంతకుముందు ఆస్ట్రేలియన్ పాప్ స్టార్ పీటర్ ఆండ్రీ, కేజ్ఫైటర్ అలెక్స్ రీడ్లను ఆమె పెళ్లాడింది. కేట్కు జూనియర్, ప్రిన్సెస్ టియామీ, హార్వీ అనే ముగ్గురు పిల్లలున్నారు. ఇప్పుడు మరోసారి గర్భవతి. ఈసారి పుట్టబోయే వాళ్లకోసం ఆమె ఆతృతగా ఎదురుచూస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement