Kieran Hayler
-
‘మాది 100% లవ్.. విడిపోం’
లండన్: తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని హాలీవుడ్ ప్రముఖ నటి, టీవీ స్టార్ కాతీ ప్రైస్ చెప్పింది. తాను తన భర్త కైరన్ హేలర్ గాఢమైన ప్రేమలో ఉన్నామని తెలిపింది. తమ వివాహానికి సంబంధించి ఎలాంటి సమస్యలు రాలేదని స్పష్టం చేసింది. ’మేం 100శాతం ఒకరికొకరం. మాది గాఢమైన ప్రేమ. మేం విడిపోతున్నామంటూ వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే’ అని స్పష్టం చేసింది. కాతీకి తెలియకుండా ఆమె స్నేహితురాళ్లతో కైరన్ సంబంధం నెరిపాడని ఈ విషయం తెలిసిన ఆమె విడిపోవాలనుకుంటుందని వార్తలు హల్ చల్ చేశాయి. అయితే, తాను ఒక టీవీ కార్యక్రమం ఉండటం వల్లే ఈ మధ్య కైరన్ కు కాస్త దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది తప్ప తాము విడిపోయినట్లు కాదని చెప్పింది. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కైరన్ ఆమెకు మూడో భర్త. 2013 జనవరిలో వివాహం చేసుకున్నారు. -
'నా ఫ్రెండ్‌తో మా ఆయన చేసిన రాసలీలలన్నీ చెప్తా'
లాస్ ఎంజెల్స్: ఎంతో ప్రేమను ఒలకబోస్తూనే దారుణంగా తనను మోసం చేసిన భర్త కీరన్ హేలర్పై ప్రముఖ టీవీ స్టార్ కాతీ ప్రైస్ త్వరలో పుస్తకాన్ని విడుదల చేయనుంది. తనకున్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్‌తో రాసలీలు ఎలా కొనసాగించారో అనే విషయాన్ని ఆమె ఆ పుస్తకంలో బట్టబయలు చేయనుంది. తన కళ్లు గప్పి భర్త, తన స్నేహితురాలు దారుణంగా మోసం చేశారని వాపోయిన ఆమె ఆ వివరాలన్నింటిని పూసగుచ్చినట్లుగా ఆ పుస్తకంలో చేరుస్తుంది. ఈ పుస్తకానికి గాను ఆమె పెట్టిన పేరు 'రివెంజ్'(ప్రతీకారం). మరో నాలుగు నెలల్లో ఈ పుస్తకాన్ని విడుదల చేసి తీరుతానని ఆమె ప్రకటించింది. 'నిజం బయటకు వస్తుంది. నాకు జేన్ తెలుసు. ఆమె కిరేన్తో జతకట్టిన విషయం తెలుసు. త్వరలోనే ఈ విషయంపై అన్ని నిజాలు చెప్తాను' అని ఆమె ఓ మేగజిన్తో చెప్పింది. -
పది కోట్లకు శరీరాన్ని అమ్మేస్తా: కేటీ ప్రైస్
లండన్: ‘నా శరీరాన్ని పది కోట్ల రూపాయలకు అమ్మేస్తాను’ అని ఇటీవలనే మూడవ భర్తగా కీరాన్ హేలర్‌ను పెళ్లి చేసుకున్న బ్రిటన్‌కు చెందిన 37 ఏళ్ల గ్లామరస్ మోడల్, ప్రముఖ టీవీ పర్సనాలిటీ కేటీ ప్రైస్ ప్రకటించారు. ‘లూజ్ విమెన్’ అనే టీవీ కార్యక్రమంలో వ్యభిచారంపై జరిగిన ఓ చర్చలో పాల్గొంటూ ఈ ఆఫర్ ఇచ్చారు. ఇలా ప్రకటన చేసినంత మాత్రాన తనను వ్యభిచారిగా భావించరాదని, కానీ పది కోట్ల రూపాయల మొత్తంలో ఆఫర్ వస్తే కచ్చితంగా తన బాడీని అమ్మేందుకు సిద్ధమేనని చెప్పారు. అయితే ఈ విషయంలో తన మూడవ భర్త అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని, అంత మొత్తంలో డబ్బొస్తుందంటే ఆయన మాత్రం ఎందుకు కాదంటారని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆన్లైన్లో ఆమె ఆఫర్ చర్చనీయాంశం అయింది. -
'నా మాజీ భర్తను ఎప్పటికీ క్షమించను'
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ మోడల్ కాతీ ప్రైస్ కోపంతో ఊగిపోతోంది. తన మాజీ భర్త చేసిన తప్పును పదేపదే ఊహించుకుంటూ రగిలిపోతోంది. ఆయన చేసిన ద్రోహం ఎప్పటికి క్షమించరానిదంటూ ఆగ్రహంతో మండిపోతోంది. 2014 మే నెలలో తనను తన భర్త కైరాన్ హేలర్ దారుణంగా మోసం చేశాడని, తన స్నేహితురాలు జేన్ పౌట్నీతో గడుపుతూ తనకు ప్రత్యక్షంగా దొరికిపోయాడని ఆ విషయం తాను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది. అనంతరం ఆమె అతడితో విడిపోయింది. 'నేను ఎప్పటికీ క్షమించను. నేను ఎప్పటికీ మర్చిపోను. ఆ విషయం మీకు త్వరలోనే తెలుస్తుంది' అంటూ కాతీ చెప్పుకొచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ క్రిస్టమస్ కు అతడిని కలుస్తున్నానని, ఈ సందర్భంగా తనకు ఓ బహుమతి కూడా ఇస్తున్నానని, అది తనకు రెండేళ్ల కిందట చేసిన ద్రోహాన్ని గుర్తుచేసేలా ఉంటుందని చెప్పింది. అయితే, ఆ బహుమతి ఏమిటనే విషయం మాత్రం ఇప్పుడే చెప్పనని, అతడికి తెలుస్తుందని చెప్పుకొచ్చింది కాతీ.