కాబూల్: ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్ వర్క్కు చెందిన కీలక కమాండర్ హతమయ్యాడు. అఫ్ఘనిస్తాన్లోని పక్తికా ప్రావిన్స్లో డ్రోన్ జరిపిన దాడుల్లో అతడు మృతి చెందినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. సర్వాజా జిల్లాలోని ఓ కీలక స్థావరంపై జరిగిన బాంబు దాడుల్లో హక్కానీ కమాండర్ సిరాజుద్దీన్ ఖడేమి ప్రాణాలుకోల్పోయాడు.
ఇతడు దాడులకు పాల్పడే వారికి కీలక వ్యూహకర్తగా ఉండటంతోపాటు వారికి ముఖ్యమైన పేలుడు పదార్థాలు అందిస్తుండేవాడు. ఈ దాడిలో భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు కూడా ధ్వంసం అయ్యాయి. తాలిబన్ సంస్థకు అనుబంధంగా హక్కానీ నెట్ వర్క్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. అఫ్ఘనిస్తాన్లోనే ఉంటూ ఈ సంస్థ తన కార్యకలాపాలు నిర్వర్తిస్తుండగా అప్ఘన్ సైన్యం వారిని అణిచివేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
హక్కానీ నెట్ వర్క్ కీలక కమాండర్ హతం
Published Thu, Jun 9 2016 12:12 PM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM
Advertisement