లాహోర్: ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, హఫీజ్ సయీద్‌ను వేధించవద్దంటూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని లాహోర్ హైకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఆయన తన సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగించడానికి వీలు కల్పించాలని సూచించింది. ఇదే కోర్టు గత నవంబర్‌లో హఫీజ్ సయీద్‌కు గృహ నిర్బంధం నుంచి విముక్తి కల్పించింది. తన సామాజిక సేవా సంస్థలు జమాత్–ఉద్–దవాహ్ (జేయూడీ), ఫలాహ్–ఐ–ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్‌ఐఎఫ్)లను పాక్ ప్రభుత్వం నిషేధించడాన్ని సవాలు చేస్తూ లాహోర్ హైకోర్టులో సయీద్ పిటిషన్ వేశారు.
Comments
Please login to add a commentAdd a comment