మ్యూనిచ్: యుద్ధం, దాని ప్రభావం వల్ల ఏటా లక్ష మంది పిల్లలు మృతి చెందుతున్నట్లు సేవ్ ద చిల్డ్రన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. యుద్ధం, దాని వల్ల కలిగే ఆహార కొరత, ఆస్పత్రులు నాశనమవడం, పారిశుధ్యలేమీ వంటి కార ణాల వల్ల 2013–17 మధ్య 10 దేశాల్లో సుమారు ఐదున్నర లక్షల మంది పిల్ల లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఇలాంటి వాటిల్లో పిల్లలే అధికంగా బాధితులుగా మారుతున్నారని పేర్కొంది. చంపబడటం, అపహరణకు గురికావడం, లైంగిక బానిసలుగా మారడం వంటివి పిల్లలు ఎదుర్కొంటున్నారని తెలిపింది.
గత రెండు దశాబ్దాల్లో ప్రతీ ఐదుగురు పిల్లల్లో ఒకరు యు ద్ధ ప్రభా వం గల ప్రాంతాల్లోనే జీవిస్తున్నారని సంస్థ సీఈవో హెల్లీ తోర్నింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించిన వివరాల ప్రకారం 2017లో యుద్ధ ప్రభావం గల ప్రాంతాల్లో సుమారు 42 కోట్ల మంది పిల్లలు జీవిస్తున్నట్లు తేలిందని పేర్కొన్నారు. ఇలాంటి దేశాల్లో అఫ్గానిస్తాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇరాక్, మాలి, నైజీరియా, సొమాలియా, సౌత్ సూడాన్, సిరియా, యెమెన్‌లు ఉన్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన నివేదికను మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో శుక్రవారం విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment