
ఆహార పదార్థాల చిత్రాన్ని చూసి చెప్పేస్తుంది
ఈ నూతన విధానంతో వంటకాల గురించి తెలుసుకోవడం తోపాటు వేరొకరి ఆహార విధానాన్ని అర్థం చేసుకోవచ్చని వెల్లడించారు. ఆహారాన్ని అంచనా వేసేందుకు సరైన డేటాబేస్‌ను రూపొందించలేక పోయామని ప్రొఫెసర్ యూసఫ్ పేర్కొన్నారు. అయితే తాము ఆల్ రెసిపీస్, ఫుడ్.కామ్ అనే 2 వెబ్‌సైట్స్ సహాయంతో దాదాపు 10 లక్షల రెసిపీల సమాచారంతో కూడిన డేటాబేస్‌ను రూపొందించామని అన్నారు. తమ అప్లికేషన్ ముందు ఏదైనా రెసిపీ చిత్రాన్ని ఉంచినప్పుడు అది డేటాబేస్‌లోని రెసిపీలతో సరిపోల్చి వాడిన దినుసుల గురించి వివరిస్తుందని తెలిపారు.