మంచి నాన్నను చంపేశారు | 'Lovely family man' stabbed to death in broad daylight while out washing his car | Sakshi
Sakshi News home page

మంచి నాన్నను చంపేశారు

Published Sun, May 29 2016 3:44 PM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM

మంచి నాన్నను చంపేశారు

మంచి నాన్నను చంపేశారు

లండన్: అతడు ఓ డ్రైవర్. తనపని తాను శ్రద్దగా చేసుకుంటూ వెళ్లడం తప్ప ఇంకేం తెలియదు. నలుగురితో భలే మంచివాడని అనే పేరు సంపాధించుకున్నాడు. పొద్దంతా బస్సు నడపడం, సెలవుల్లో తన పిల్లలతో గడపడం ఇదే అతడి సరదా. భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే.. మంచి నాన్న, మంచి భర్త, నలుగురికి మంచి మనషి. అలాంటి వ్యక్తిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా పొడిచి చంపేశారు. సెలవు రోజు ఇంట్లో తన కారును తుడుచుకుంటున్న వ్యక్తిని అకారణంగా హత్య చేసి వెళ్లిపోయారు.

అయితే, ఆ హత్య చేసింది దోపిడి దొంగలని పోలీసులు ప్రాథమిక సమాచారం ద్వారా అనుమానిస్తున్నారు. స్టేజ్ కోచ్ సంస్థలో జాన్ కిల్తీ అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడు పార్క్ రోడ్డులోని తన నివాసం వద్ద కారును తుడుచుకుంటుండగా కొందరు వ్యక్తులు ఆ కారుపై దాడి చేసేందుకు వచ్చారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో అతడ్ని దారుణంగా పొడిచి చంపేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ నేరస్తుల కోసం గాలింపులు చేపట్టారు. చనిపోయన జాన్కు ముగ్గురు కుమారులు.. ఒక కుమార్తె ఉంది. జాన్ చాలా మంచివాడని అక్కడ చుట్టుపక్కలవారు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement