ప్రతీకాత్మక చిత్రం
మెక్సికో సిటీ: అల్జిమర్స్ వ్యాధి వస్తే.. తప్ప ఓ వ్యక్తి తనను తాను మర్చిపోవడం అసంభవం. చిన్పప్పటి నుంచి ముసలి వారు అయ్యేవరకు వేర్వేరు వయస్సులో మనం ఎలా ఉన్నామో మనకు తెలుస్తుంది. ఎప్పుడైనా పాత ఫోటోలు కనిపిస్తే.. వాటిల్లో మనల్ని చూసుకుని.. మురిసిపోతూ.. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటాం. కానీ మెక్సికోలో మాత్రం ఓ పాత ఫోటో భర్త ప్రాణాల మీదకు తెచ్చింది. భర్త పక్కన ఉన్నది తానే అని గుర్తు పట్టలేని మహిళ.. అతడిపై కత్తితో దాడి చేసింది. వివరాలు.. లియోనోరా ఎన్, జువాన్‌లకు వివాహం అయ్యి చాలా సంవత్సరాలు అవుతోంది. పైగా ప్రేమ వివాహం. ఇదిలా ఉండగా.. ఓ సారి జువాన్ తాము ప్రేమించుకున్న సమయంలో తీసుకున్న ఫోటోలు పూర్తిగా పాడయిపోవడం గమనించాడు. దాంతో వాటిని డిజిటలైజ్ చేయించాడు. యవ్వనంలో ఉండగా తీసిన ఫోటోలు.. పైగా డిజిటలైజేషన్ చేయించడంతో అవి మరింత అందంగా ఉన్నాయి.
(చదవండి: మనుషుల్ని తిన్నారు.. పందుల్ని వదిలేశారు)
ఇక ఈ ఫోటోల్లో అతడి భార్య ఎంతో స్లిమ్‌గా.. అందంగా ఉంది. అలా ఇద్దరు కలిసి ఉన్న ఓ ఫోటోని జువాన్ తన మొబైల్ వాల్ పేపర్‌గా పెట్టుకున్నాడు. పాపం అప్పుడతడికి తెలియదు.. ఆ ఫోటో తన ప్రాణాల మీదకు తెస్తుందని. ఓ రోజు భార్య ఈ ఫోటోని చూసింది. జువాన్ పక్కన ఉన్నది తానే అని గుర్తుపట్టలేకపోయింది. దాంతో భర్త పెళ్లికి ముంద మరో స్త్రీతో రిలేషన్‌లో ఉన్నాడని అనుమానించింది. ఆ కోపంలో కత్తి తీసుకుని భర్త మీద దాడి చేసింది. ఆమె ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాని జువాన్ ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బయటకు పరుగు తీశాడు. ఎలాగో అలా పోలీసులకు కాల్ చేయడంతో వారు వచ్చి జువాన్ భార్యని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె తన కోపానికి కారణం చెప్పడంతో షాక్ అయిన జువాన్.. ఆ ఫోటో తమదేనని.. డేటింగ్ చేసే రోజుల నాటి ఫోటోని తాను డిజిటలైజ్ చేయించానని చెప్పాడు. పాపం తనను గుర్తుపట్టలేకపోయినా లియానారో కాస్త ఆలస్యం అయ్యుంటే భర్తను చంపేసేది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెకి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు.
Comments
Please login to add a commentAdd a comment