పారిస్లో భారీ పేలుడు | Major explosion in central Paris | Sakshi
Sakshi News home page

పారిస్లో భారీ పేలుడు

Published Fri, Apr 1 2016 4:28 PM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM

పారిస్లో భారీ పేలుడు

పారిస్లో భారీ పేలుడు

పారిస్: ఉగ్రదాడి ఘటన నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పారిస్ మరోసారి భారీ పేలుడుతో ఉలిక్కిపడింది. సెంట్రల్ పారిస్లోని నివాస ప్రాంతాల్లో ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. అయితే  గ్యాస్ లీక్ వల్లే ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువు గాయపడినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకొని.. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పారిస్‌ లోని స్టాక్ ఎక్స్చేంజ్‌కి, ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయానికి సమీపంలోని నివాస సముదాయంలో ఈ ఘటన జరుగడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ ఘటనతో ఉగ్రవాదులకు ఎలాంటి సబంధం లేనట్టు కనిపిస్తున్నదని, గ్యాస్ లీక్ వల్ల ఘటన జరిగి ఉండవచ్చునని పారిస్ పోలీసు అధికారి ఒకరు 'డెయిలీ మెయిల్‌'కు తెలిపారు.

 

కాగా గత ఏడాది నవంబర్లో పారిస్‌ నగరంలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో సుమారు 170మంది ప్రాణాలు కోల్పోగా, వందలాదిమంది గాయపడ్డారు. ఐఎస్ఐఎస్ సృష్టించిన ఈ మారణహోమం పారిస్ లో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement