మాజీ అధ్యక్షుడికి వారెంట్
మాలే: అధికారంలో ఉండగా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశాడన్న కేసులో మాల్దీవులు మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్‌కు అరెస్టు వారెంట్ జారీ అయింది. ప్రజాస్వామ్య దేశంగా మాల్దీవులు అవతరించిన తర్వాత ఎన్నికైన మొదటి అధ్యక్షుడు నషీద్. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు రుజువవడంతో గతేడాది మార్చిలో నషీద్‌కు జైలు శిక్ష విధించారు.
అయితే ఈ శిక్షను అంతర్జాతీయ స్థాయిలో పలువురు ఖండించారు. అనంతరం అనారోగ్య కారణాలతో నషీద్ ఏడాది కాలంపాటు ఇంగ్లండ్‌లో చికిత్స పొందాడు. ఇటీవలే మాల్దీవులు వచ్చిన నషీద్‌కు తాజాగా నిధుల దుర్వినియోగం కేసులో క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.