‘బుకర్’ షార్ట్‌లిస్టులో యువ రచయిత్రికి చోటు
లండన్: బోస్టన్ కు చెందిన 35 ఏళ్ల రచయిత్రి ఒట్టెస్సా మొష్‌ఫెగ్ తన ఈలీన్ నవల ద్వారా మొదటిసారి బుకర్‌ప్రైజ్ షార్ట్‌లిస్టులో చోటు సంపాదించారు. ఒక మహిళ తను చేస్తున్న ఉద్యోగానికి, తాగుబోతు తండ్రికి మధ్య ఎలా నలిగిపోయిందనే కథాంశంతో ఈలీన్ నవలను రచయిత్రి రూపొందించారు. ప్రఖ్యాత బుకర్‌ప్రైజ్ కోసం ఆరుగురి పేర్లను మంగళవారం షార్ట్‌లిస్ట్ చేశారు.
కాగా నోబెల్ బహుమతి విజేత జెఎం కేత్జీ రచించిన నవల ఇందులో చోటు సంపాదించలేకపోయింది. దక్షిణాఫ్రికా రచయిత్రి డెబోరా లెవీ తాజా నవల ‘హాట్ మిల్క్’ కూడా స్థానం సంపాదించింది. తద్వారా ఆమె రెండోసారి బుకర్‌ప్రైజ్ షార్ట్‌లిస్టులో చోటు సంపాదించినట్‌లైంది. స్పానిష్‌లోని ఓ చిన్న గ్రామంలో నివసించే రోగగ్రస్తురాలైన తల్లి, ఆమె కూతురు మధ్య అనుబంధం ఆధారంగా హాట్ మిల్క్‌ను రచయిత్రి మలి చారు. అలాగే స్కాటిష్ హైల్యాండ్స్‌లో ఉన్న ఓ చిన్న కమ్యూనిటీకి సంబంధించిన పేదరికానికి వాస్తవ రూపమిస్తూ స్కాటిష్ రచయిత గ్రేమ్ మెక్ రే బర్నెట్ నవల ‘హిజ్ బ్లడీ ప్రాజెక్టు’ థ్రిల్లర్ కూడా స్థానం సంపాదించింది. వీటితో పాటు మరోమూడు నవలలు షార్ట్‌లిస్టులోకి చేరాయి.