కుక్కలనుకొని రెండేళ్లుగా సాకితే... | Man raises 'puppies' for 2 years, discovers they are actually bears | Sakshi
Sakshi News home page

కుక్కలనుకొని రెండేళ్లుగా సాకితే...

Published Fri, Jul 10 2015 1:52 PM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM

కుక్కలనుకొని రెండేళ్లుగా సాకితే... - Sakshi

కుక్కలనుకొని రెండేళ్లుగా సాకితే...

బీజింగ్: చైనాకు చెందిన ఓ వ్యక్తి రెండేళ్లుగా రెండు కుక్కపిల్లల్ని అల్లారుముద్దుగా పెంచాడు. తీరా చూస్తే అవి ఎలుగుబంట్లుగా మారిపోరాయి.  ఏంటి.. ఆశ్చర్యపోయారా.. ఇలాగే బుర్ర గోక్కొని నోరు వెళ్లబెట్టాడు వాంగ్ కియూ.

వాంగ్ కియూ కి జంతువులంటే ఎనలేని ప్రేమ. అందులోనూ కుక్కలంటే మరీ  ప్రాణం. అందరు జంతు ప్రేమికుల్లాగే తను పెంపుడు జంతువులకు ఆహారం, నీళ్లు క్రమంగా అందిస్తూ, వాటి ఎదుగుదలను  రోజూ గమనిస్తూ ఉంటాడు.  ఈ క్రమంలో ఈ రెండు పప్పీల్లో ఏదో తేడా ఉన్నట్టు అర్థమైంది. దాదాపు 100  పౌండ్ల దాకా బరువు పెరిగాయి. దీనికితోడు తాను పెంచుతున్న కోళ్లు  అనూహ్యంగా మాయమవడాన్నిగమనించాడు. ఈలోగా స్థానిక అధికారులు ముద్రించిన కరపత్రాన్ని ఒకదాన్ని చదివాడు.

ఇవి టైప్ 2  ఎలుగుబంట్లనీ.,.పక్కనున్న జంతువులను  చంపి తింటూ ఉంటాయని దాని సారాంశం. దీంతో తాను గత రెండేళ్లుగా పెంచుతోంది కుక్కపిల్లల్ని కాదనీ ఏషియన్ ఎలుగుబంట్లనని తెలుసుకుని ఆశ్యర్యపోయాడు. ఇవి చాలా అరుదైన జాతికి చెందినవని తెలుసుకుని వెంటనే వాటిని స్థానిక జంతు సంరక్షణ అధికారులకు అప్పగించాడు. ఇవి  ఒకటి ఆడ, మరొకటి మగ ఎలుగులనీ రెండూ ఆరోగ్యంగా ఉన్నాయని వారు  తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement