Bears
-
వనాలు వదిలి జనాల పైకి..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వన్య మృగాలు వనాలు వదిలి జనాలపైకి పడుతున్నాయి. ఆవులు, మేకలను పులి తినేసి భయపెడుతుండగా, ఏనుగులు, ఎలుగుబంట్లు ఏకంగా మనషుల్నే చంపేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో కొత్తూరు, వజ్రపుకొత్తూరు, మందస, వీరఘట్టం, సీతంపేట, పాతపట్నం, పలాస తదితర ప్రాంతాల్లో ఈ రకమైన ఘటనలు ఇప్పటికే జరిగాయి. దీంతో వన్య మృగాలు సంచరిస్తున్న వార్తలు వస్తే చాలు ఈ ప్రాంతాలు వణికిపోతున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం..శ్రీకాకుళం జిల్లాలో కొంతకాలంగా పులులు, ఎలుగుబంట్లు, ఇతర జంతువులు జనారణ్యంలో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో ఎలుగుబంట్లు దాడులు చేస్తుండగా, కొత్తూరు, పాలకొండ, భామిని తదితర ప్రాంతాల్లో ఏనుగులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇవి చాలదన్నట్టు మధ్యలో పులులు కూడా సంచరిస్తున్నాయి. గత ఏడాది నవంబర్‌లో ఇదే రకంగా పులి సంచరించగా సరిగ్గా ఏడాదికి మళ్లీ పులి జిల్లాలోకి ప్రవేశించింది. తగ్గుతున్న అటవీ విస్తీర్ణం, పెరుగుతున్న ఆక్రమణల వల్లే జంతువులు ఇలా ఊళ్లమీదకు వస్తున్నట్లు తెలుస్తోంది. పులి సంచారమిలా.. » ఒడిశా నుంచి మందస రిజర్వు ఫారెస్టు మీదుగా సాబకోట, బుడంబో తదితర గిరిజన ప్రాంతాలను దాటుకుంటూ వజ్రపుకొత్తూరు తీర ప్రాంతం మీదుగా సంత»ొమ్మాళి వైపునకు చేరుకుంది. ఈ మండలంలోని హనుమంతునాయుడుపేట పంచాయతీ కేశనాయుడుపేటలో పులి తిరిగిందన్న ప్రచారం జరిగింది. ఇదే సమయంలో భద్రాచలం శాంతమూర్తికి చెందిన ఆవు మృతి చెందింది. పులి కారణంగా చనిపోయిందా? మరే జంతువు కారణంగా చనిపోయిందో స్పష్టత లేదు. » కోటబోమ్మాళి మండలం పొడుగుపాడు సమీపంలో పెద్దపులి ఆనవాళ్లు కనిపించాయి. సారవకోట మండలం జమ చక్రం, సోమయ్యపేట, అన్నుపురం, వాబచుట్టు, బోరుభద్ర పరిసర ప్రాంతాల్లో సంచరించిన పులి పాతపట్నం మండలంలోకి ప్రవేశించింది. బోరుభద్ర, దాసుపురం, గురండి, తీమర, తామర, పెద్దసీదిలో సంచరించింది. తీమరలోని బెండి రామారావు మామిడితోటలో బైరి లక్ష్మణరావుకు చెందిన ఆవుదూడను చంపేసింది. » ఇదే సమయంలో ఉద్దానంలో గుర్తు తెలియని జంతువు కూడా తిరుగుతోంది. దాని దాడి ఎక్కువగా ఉంది. వజ్రపుకొత్తూరు, మందస, పలాస మండలాల్లోని ఒంకులూరు, మెట్టూరు, కొండపల్లి, అనకాపల్లి, బహడపల్లి, కొండలోగాం గ్రామాల్లో ఈ జంతువు సంచరించింది. పలాస మండలంలో నీలావతిలో రెండు ఆవు దూడలను చంపేసింది. ఇదే కారణమా..? ‘పులులు చాలా అరుదుగా అడవులను వదిల జనావాసాల వైపు వస్తుంటాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో మగ, ఆడ పులులు జతకట్టే సమయం కావడంతో తమ జోడు కోసం అవి సాధారణం కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. అలాంటి సందర్భాల్లో అడవిని దాటి సరిహద్దు ప్రాంతాల్లోని పంటపొలాలు, గ్రామాల్లోకి వస్తుంటాయి. ఈ సమయంలో దాడులు అధికంగా జరిగే అవకాశం ఉంది. వేసవి ఎండలతో అటవీ ప్రాంతంలో తాగునీటి వనరులు తగ్గినప్పుడు కూడా అవి జనావాసాల వైపు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. రైతులు పశువులను మేత కోసం అడవుల్లోకి తీసుకెళ్లడంతో వాటిని వేటాడేందుకు యత్నిస్తాయి. అటవీ సరిహద్దు ప్రాంతంలోని పంట పొలాల్లో పశువులు, మేకలు, గొర్రెలను మందలుగా ఉంచడంతో వాటిని కూడా వేటాడే అవకాశాలు ఉంటాయి.’ అని నిపుణులు చెబుతున్నారు. జాగ్రత్త సుమా » అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు వన్య మృగాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. » సాయంత్రం 5గంటల నుంచి ఉదయం 7గంటల వరకు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకూడదు. పులులు గ్రామాల్లోకి, పొలాల్లోకి వస్తే శివారు ప్రాంత ప్రజలు వెంటనే అప్రమత్తమై శబ్దం చేస్తూ చాకచక్యంగా తిరిగి అడవిలోకి పంపించాలి. » పులి అరుపులు, పాద ముద్రలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. » పంటల కాపలాకు రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లకుండా బృందంగా వెళ్లాలి. » పొలాల్లో మంచెలు ఏర్పాటు చేసుకుని గుంపులుగా ఉండాలి. » పశువుల కాపరులు పగలంతా మేత కోసం సంచరించి రాత్రి అటవీ ప్రాంతంలో మందను ఉంచి బస చేస్తుంటారు. » పులులు వాటిని వేటాడేందుకు వస్తుంటాయి. » రాత్రి సమయంలో అటవీ ప్రాంతంలో ఉండటం సురక్షితం కాదని అటవీశాఖ సిబ్బంది చెబుతున్నారు. ఇబ్బందికరంగానే ఉంది... మా మండలంలో పులి తిరుగుతుందని పేపర్లు, వాట్సాప్‌లలో చూస్తుంటే భయమేస్తుంది. మేము నిత్యం కొండలు, పంట పొలాలలో మేకలు, గొర్రెలతో మందలు వేసుకుని పడుకుంటున్నాం. మా ఊరికి దగ్గర్లో ఉన్న జమచక్రం, సోమయ్యపేట గ్రామాలలో పులి అడుగులు గుర్తించడంతో ఆయా గ్రామాల నుంచి మందలు తీసుకొచ్చి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాం. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో మరింత ఇబ్బంది పడుతున్నాం. – పల్ల ముఖలింగం, వడ్డినవలస, సారవకోట మండలం.భయం.. భయం.. పులి మా గ్రామ పంట పొలాల్లో తిరగడంతో మాకు భయంగా ఉంది. పశువులు మేతకు తీసుకు వెళ్లడానికి, ఉదయం పొలాలకు వెళ్లాలన్నా భయంగా ఉంది. ఇప్పటికే ఆవుదూడను తీనేసింది. పులి ఉందని అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. – మద్ది నారాయణరెడ్డి, పెద్దసీది గ్రామం,పాతపట్నం మండలంఆందోళనకరమే.. పులి సంచరిస్తున్న వార్తలతో ఆందోళనగా ఉంది. మా గ్రామం వైపు పులి వచ్చిందని మాకు తెలియదు, మంగళవారం ఉదయం ఆవుదూడపై దాడి చేయడంతో మాకు పులి వచ్చిందని తెలిసింది. దీంతో పంట పొలాలవైపు వెళ్లాలంటే భయంగా ఉంది. – బండి ఆనంద్,తీమర గ్రామం, పాతపట్నం మండలం -
ఆ ఊరు ధ్రువపు ఎలుగుబంట్లకు నిలయం!
ఒకప్పుడు సోవియట్ రష్యాలో అంతర్భాగమైన ఆ ఊరు పాతికేళ్లుగా ఖాళీగా ఉంటోంది. ప్రస్తుతం నార్వే అధీనంలోని స్వాల్బార్డ్ ద్వీపసమూహంలో ఉన్న ఈ ఊరి పేరు పిరమిడెన్. ఆర్కిటిక్ వలయానికి చేరువలో ఉన్న ఈ ద్వీప సమూహంలో ఏడాది పొడవునా హిమపాతం ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడి కొండ దిగువ ఉన్న గని నుంచి బొగ్గును వెలికి తీసేవారు. గని కార్మికులు, ఇతర ఉద్యోగుల కోసం ఇక్కడ ఈ ఊరు ఏర్పడింది. అప్పట్లో దాదాపు వెయ్యిమంది వరకు ఇక్కడ ఉండేవారు. ఈ ఊళ్లో చర్చి, గ్రంథాలయం, పాఠశాల, క్రీడా ప్రాంగణం, ఇరవై నాలుగు గంటలూ పనిచేసే క్యాంటీన్ వంటి సౌకర్యాలు ఉండేవి. పాతికేళ్ల కిందట ఇక్కడ బొగ్గు నిల్వలు అంతరించిపోవడంతో ఊరి జనాభా అంతా ఇతరేతర ప్రాంతాలకు ఉపాధి కోసం తరలిపోయారు. ఊరి వెలుపల కాపలాగా ఉండే సైనిక సిబ్బంది తప్ప ఊళ్లోకి వెళితే మనుషులెవరూ కనిపించరు. వీథుల్లో యథేచ్ఛగా సంచరిస్తున్న ధ్రువపు ఎలుగుబంట్లు మాత్రమే కనిపిస్తాయి. నిరంతర హిమపాతంతో మంచుదుప్పటి కప్పుకున్నట్లుగా కనిపించే ఈ ఊరు ఇప్పుడు ధ్రువపు ఎలుగుబంట్లకు ఆలవాలంగా మారింది. (చదవండి: ద్వీపం పుట్టడం చూశారా? కెమెరాకు చిక్కిన అరుదైన దృశ్యం!) -
పిల్లల జోలికొస్తే చంపేంత ప్రేమ.. ఎలుగుబంట్ల గురించి షాకింగ్ నిజాలు
ఆత్మకూరు రూరల్(నంద్యాల జిల్లా): ఎలుగుబంట్లు తన పిల్లలతో ఉన్నప్పుడు ఎవరైనా ఎదురైతే ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఆ సమయంలో పులినైనా ఎదిరించి దాడికి తెగబడతాయి. పిల్లలపై వాటి వాత్సల్యం అలాంటిది. కంగారుల్లాగా తన సంతానాన్ని నిత్యం కంటికిరెప్పలా చూసుకుంటూ వెంట పెట్టుకుని తిరిగే ఈ భల్లూకాలు అంతరించిపోతున్న జీవుల్లో ఉండటం విచారకరం. చదవండి: శిథిలావస్థలో ఉన్న ఇంటిని తవ్వుతుండగా...బయటపడ్డ నిధి ఎలుగు బంట్లలో పలు రకాల జాతులున్నప్పటికీ స్లాత్బేర్గా పిలువబడే తెల్లమూతి నల్ల ఎలుగు బంటి భారత ఉపఖండమంతా జీవిస్తున్న మాంసాహార క్షీరదం. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా జీవించ గలిగే ఎలుగుబంటి నల్లమల కీకారణ్యంలోనూ , అనంతపురం జిల్లాలోని బోడి కొండల్లోనూ ఉన్నాయి. అయినప్పటికీ వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటం జంతు ప్రేమికులను కలవరపెడుతోంది. తన పిల్లలపై అపారమైన ప్రేమ తన పిల్లలను రక్షించుకునేందుకు ఎదురు పడిన జీవిని చంపేంత ప్రమాదకారి ఎలుగుబంటి. ఏ వన్యప్రాణి అయినా పిల్లలతో ఉన్నప్పుడు ప్రమాదకరంగా మారుతుంది. కానీ ఎలుగుబంటికి ఆవేశపాళ్లు చాలా ఎక్కువ. ఈ రౌద్రమంతా తనకు తన పిల్లల మీద ఉండే అపారమైన ప్రేమ, జాగురూకత. దీంతో అది పిల్లలతో సంచరించేటప్పుడు జంతువైనా, మనిషి అయినా ఎదురైతే ఎలాంటి శషభిషలు లేకుండా దాడికి పూనుకుంటుంది. ఈ దాడి ప్రాణాంతకంగా ఉంటుంది. అడవుల్లో విధులు నిర్వహించే అటవీ సిబ్బంది కూడా ఎలుగుబంటి దాడి నుంచి తమను తాము కాపాడుకోవడానికి నిరంతర జాగురూకత పాటించాల్సి ఉంటుంది. నిత్యం వీపున మోస్తూ.. భల్లూకం తన పిల్లలను అత్యంత జాగ్రత్తతో పెంచుతుంది. నిత్యం తన వీపుపై మోస్తూ తిరగడం ఎలుగుబంటి ప్రత్యేక లక్షణం. ఇది ఇతర వన్యప్రాణుల్లో అంతగా కనిపించదు. కోతులు మాత్రమే పిల్ల కోతులను పొట్టకు కరిపించుకు మోస్తుంటాయి. పులినైనా ఎదిరించే ధైర్యం పిల్లలతో ఉండే ఎలుగు బంటి వాటి రక్షణ కోసం ఎంతకైనా తెగిస్తుందంటారు నల్లమల సమీప గ్రామాల ప్రజలు. చాలా సందర్భాలో అవి పెద్దపులులతో పోరాటానికి దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. పెద్దపులితో పోల్చుకుంటే వాటి బలం చాలా తక్కువ. కానీ పిల్లల కోసం శక్తికి మించి తలపడుతుంటాయి. వాటి పదునైన గోళ్ల ధాటికి పెద్దపులులు కూడా భయపడతాయని వారు చెబుతారు. మాంసాహారే కాని అల్పాహారి ఎలుగుబంటి పేరుకు కార్నివోర్స్ (మాంసాహార జంతువు )ల లిస్ట్‌లో ఉంటుంది. కానీ, అది తినే ఆహారం చూస్తే అల్పాహారమనుకోకుండా ఉండలేం. ఎలుగు బంటి పుట్టలను తవ్వి చీమలు, చెదలను తింటుంది. అలాగే వివిధ ఫలాలను కూడా ఇది భుజిస్తుంది. రేగు పళ్లను ఇష్టంగా తింటుంది. చెట్లు ఎక్కడంలో నేర్పరి భల్లూకాలు చెట్లు ఎక్కడంలో చిరుత పులులలాగే మంచి నేర్పరులు. ఇవి ఎక్కువగా పండ్లను ఆహారంగా స్వీకరిస్తాయి. వాటి కోసం చెట్లను ఎక్కుతుంటాయి. ఎత్తులో ఉండే వెలగ పండ్లను, చిటిమిటి, టుంకి పండ్లను తన నేర్పరితనంతో ఎలుగు బంట్లు సులభంగా సంపాదించుకుంటాయి. అలాగే తేనె పట్టులను కూడా ఇవి ఆహారంగా తీసుకుంటాయి. భల్లూకం నుంచి ఇలా తప్పించుకోవచ్చు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఎలుగుబంట్లు దాడికి తెగబడుతాయి.వెంట పిల్లలున్నప్పుడు, ఆహార సేకరణ సమయంలో అంతరాయం కలిగిస్తే అవి రెచ్చిపోతాయి. అడవుల్లో సంచరించే వ్యక్తులు పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు కదలాలి. పుట్టల వద్ద ఎలుగు బంట్లు కనిపిస్తే పెద్దగా అరుస్తూ కేకలు వేయడం ద్వారా వాటిని బెదర గొట్టవచ్చు. అలాగే చేతిలో తమ పొడవుకు మించిన చేతికర్రను వెంట తీసుకెళ్లాలి. ఎలుగుబంటి పరుగు వేగం కూడా తక్కువే కాబట్టి దూరంగా పరుగెత్తి ప్రాణాలు కాపాడుకునేందుకు వీలుంటుంది. ఎలుగుబంటి రక్షిత జీవి ఎలుగుబంటి రక్షిత జంతువుగా ప్రభుత్వం గుర్తించింది. ఇది అంతరించిపోయే దశలో ఉన్నందువలన దీనిని వేటాడడంగానీ, ప్రమాదం కలిగించడంకానీ చట్టబద్ధంగా నేరం. ఎలుగుబంట్లు సాధారణ పరిస్థితుల్లో ఎవరికి హాని చేయవు. కొద్దిజాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి ఇబ్బందులు ఎదురుకాకుండా తప్పించుకోవచ్చు. –శ్రీనివాసరెడ్డి, ఎఫ్డిపీటీ, ఎన్‌ఎస్‌పీఆర్ మనిషిని చూస్తే గట్టిగా అరుస్తాయి అడవిలో పులితో కూడా ప్రమాదం లేదు కానీ ఎలుగుబంటి చూస్తేనే చాలు మాకు వణుకుపుడుతుంది. మనిషిని చూస్తే అవి పెద్దగా అరుస్తూ మీదపడి తీవ్రంగా గాయపరుస్తాయి. మా గ్రామానికి చెందిన చాలా మంది వాటి దాడిలో గాయపడ్డారు. ఓ ఇద్దరు మరణించారు కూడా. వీరికి అటవీశాఖ నుంచి పరిహారం లభిస్తుండడం కొంత మేలు కలుగుతుంది. – ఎల్లయ్య, రైతు, నల్లకాల్వ -
మార్కెట్‌కు ‘ఫెడ్’ పోటు
ముంబై: కీలక వడ్డీరేట్ల పెంపు మార్చిలో ఉంటుందనే అమెరికా ఫెడ్ రిజర్వ్ సంకేతాలతో గురువారం ఈక్విటీ మార్కెట్లు బేర్మన్నాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణత, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగడం దేశీయ మార్కెట్‌పై మరింత ఒత్తిడిని పెంచాయి. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలతో సప్లై అవాంతరాలు నెలకొని ఎనిమిదేళ్ల తర్వాత బ్యారెల్ క్రూడాయిల్ ధర 90 డాలర్లను తాకింది. డాలర్ విలువ ఐదు వారాల గరిష్టానికి చేరింది. ఈ అంశాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 581 పాయింట్లు నష్టపోయి 57,277 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 168 పాయింట్లను కోల్పోయి 17,110 వద్ద నిలిచింది. ఐటీ, ఫార్మా షేర్లలో భారీ ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది. ద్వితీయార్థంలో బ్యాంకింగ్ షేర్లు భారీగా రాణించాయి. ఆటో, మీడియా షేర్లలో చెప్పుకోదగిన కొనుగోళ్లు కనిపించాయి. సెన్సెక్స్ సూచీలో తొమ్మిది షేర్లు మాత్రమే లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.6,267 కోట్ల షేర్లను అమ్మేయగా.., డీఐఐలు రూ.2,881 కోట్ల షేర్లను కొన్నారు. సూచీలు ఒకశాతం నష్టపోవడంతో ఇన్వెస్టర్లు ఒకరోజులో రూ.2.81 లక్షల కోట్ల సంపదను కోల్పోయాయి. తద్వారా బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.2,59 లక్షల కోట్లకు దిగివచ్చింది. నష్టాలను పరిమితం చేసిన బ్యాంకింగ్ సూచీలు భారీ నష్టంతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 541 పాయింట్ల నష్టంతో 57,317 వద్ద, నిఫ్టీ 216 పాయింట్లు పతనమై 17,062 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఒక దశలో సెన్సెక్స్ 1419 పాయింట్లు కోల్పోయి 56,439 వద్ద, నిఫ్టీ 411 పాయింట్లు నష్టపోయి 16,867 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అయితే మిడ్ సెషన్ నుంచి బ్యాంకింగ్ షేర్లకు అనూహ్య కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కోలుకున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ నష్టాలు (–)1,419 పాయింట్ల నుంచి (–)581కు, నిఫ్టీ (–) నష్టాలు 411 పాయింట్ల నుంచి (–)167 పరిమితయ్యాయి. కాగా డాలర్ మారకంలో రూపాయి విలువ 31 పైసలు బలహీనపడి 75.09 వద్ద ముగిసింది. ఐపీవో బాటలో బోట్ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్ మాతృ సంస్థ ఇమేజిన్ మార్కెటింగ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. తద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. -
ఫుట్‌బాల్‌తో ఆడుకున్న ఎలుగుబంట్లు
-
బాబోయ్ భల్లూకం: ఎలుగుబంట్ల హల్చల్
వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్దానం, తీర ప్రాంతాల్లో గత కొద్ది కాలంగా ఎలుగు బంట్లు (భల్లూకాలు) హల్చల్ చేస్తుండంతో ప్రజలు భయందోళన చెందుతున్నారు. ప్రధానంగా మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లోని పలు గ్రామాల్లో ఉన్న జీడి తోటలు, సముద్ర తీరాల్లో సంచరిస్తున్నాయి. ప్రస్తుతం జీడి పిక్కలను ఎరేందుకు రైతులు తోటల్లోనే ఎక్కువ సమయం ఉంటున్నారు. దీంతో ఏ సమయంతో ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. అనేక మందికి గాయాలు.. ►ఇప్పటికే అనేక మందిపై ఎలుగులు దాడిచేసి గాయపరిచాయి. చికిత్స పొందుతూ క్షతగాత్రులు పదుల సంఖ్యలో మృతి చెందారు. ►మూడేళ్ల క్రితం తాడివాడ వద్ద రైతులు పంట రక్ష ణకు ఏర్పాటు చేసుకున్న కంచెలో ఎలుగు చిక్కింద ►రెండేళ్ల క్రితం చినవంక గ్రామ దేవత ఆలయంలో ఎలుగు చొరబడింది. ►అక్కుపల్లిలో కిరాణా దుకాణంపై దాడిచేశాయి. ► రాజాంలో అంగన్వాడీ కేంద్రంలో ఎలుగులు చొరబడి నూనె, పప్పు, ఇతర నిత్యావసర సరుకుల ను ధ్వంసం చేశాయి. ►డెప్పూరులో రాత్రి సమయంలో గ్రామ వీధుల్లో సంచరించి ప్రజలకు ప్రాణభయం కలిగించాయి. ►కిడిసింగిలో నిర్మాణం జరుగుతున్న ఇంటిలో రెండు ఎలుగులు కనిపించడంతో భవన నిర్మాణ కార్మికులు బయటకు పరుగులు తీశారు. ►గత మూడు రోజుల నుంచి డోకులపాడు సము ద్ర తీరంలో రెండు ఎలుగులు సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అధికారు లు స్పందించి ఎలుగుల సంచారాన్ని నియంత్రించా లని ఉద్దాన, తీర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. తీరంలో ఎలుగుబంట్లు.. వజ్రపుకొత్తూరు: మండలంలోని ఉద్దాన తీరప్రాంత గ్రామాల్లో ఎలుగుబంట్లు భయాందోళన కు గురిచేస్తున్నాయి. బుధ, గురువారాల్లో డోకు లపాడు తీర ప్రాంతంలో రెండు ఎలుగుబంట్లు సంచరించడంతో జీడి రైతులు ఆందోళనకు గురయ్యారు. ఒంటరిగా తిరగొద్దు ప్రస్తుత సీజన్లో పనస, జీడి పండ్లు తీనేందుకు ఎలుగులు తోటల్లో సంచరిస్తా యి. తోటలకు వెళ్లేటప్పు డు, రాత్రి సమయంతో ఆరు బయటకు వచ్చేటప్పుడు ఒంటరిగా రావొ ద్దు. ఎలుగులను కవ్వించకూడదు. వాటి సంచారాన్ని గమనిస్తూ పలు జాగ్రత్తలు పాటించాలి. ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పించాం. – రాజనీకాంతరావు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, కాశీబుగ్గ రేంజ్ చదవండి: సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు: పావు గంటలో.. పని కానిచ్చేశారు! కొడుకును బావిలో పడేసి...ఆపై తండ్రీ ఆత్మహత్య -
ప్రజల్ని భయపెడుతున్న ఎలుగుబంట్ల గుంపు
భువనేశ్వర్ : నవరంగపూర్ జిల్లాలో ఎలుగుబంట్లు స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నవరంగపూర్–నందాహండి మార్గంలో నాలుగు ఎలుగుబంట్లను ఆ ప్రాంత ప్రజలు చూశారు. అవి రహదారిపై తిరుగుతూ ఉండడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎలుగుబంట్లు తమపై ఎక్కడ దాడికి పాల్పడతాయోనన్న భయంతో పలువురు పరుగులు తీసినట్లు సమాచారం. గత ఏడాది ఇదే సమయంలో ఈ మార్గంలోని సిందిగుడ ప్రాంతంలో ఒక వృద్ధునిపై ఎలుగుబంటి దాడిచేసి చంపిన ఉదంతాన్ని నేటికీ ప్రజలు మరువలేదు. ఇప్పుడు ఒకేసారి నాలుగు ఎలుగుబంట్లు రావడంతో భయాందోళన చెందిన ప్రజలు వెంటనే అటవీ విభాగ అధికారులు ఎలుగుబంట్లను అడవిలోకి తరలించాలని కోరుతున్నారు. -
1,200 డాలర్ల దిగువకు పసిడి?
పసిడికి మరింత దిగువస్థాయి ఖాయమన్న అంచనాలు అధికమయ్యాయి. పతన వేగం కొంత తగ్గినప్పటికీ అంతర్జాతీయ నైమెక్స్ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్స్ (31.1గ్రా) ధర 1,180 డాలర్ల స్థాయిని తాకుతుందని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 4 శాతంపైన అమెరికా ఆర్థిక వృద్ధి నేపథ్యంలో అమెరికా డాలర్ బలోపేతం, ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులకు ఇన్వెస్టర్ మొగ్గుచూపడం వంటి అంశాలు దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆగస్టు 3వ తేదీతో ముగిసిన వారంలో పసిడి డిసెంబర్ ఫ్యూచర్స్ ధర ఏడాది కనిష్ట స్థాయిని చూసింది. వారంలో 0.67 శాతం పడిపోయి, 1,221 డాలర్ల వద్ద ముగిసింది. అయితే ఈ స్థాయిలో పసిడి ఫ్యూచర్స్ షార్ట్ చేయడంలో కొంత ఆచితూచి వ్యవహరించాలని కూడా పలువురు సూచిస్తున్నారు. గడచిన ఎనిమిది వారాల్లో ఏడు వారాలు పసిడి దిగువస్థాయిలవైపే పయనించడం గమనార్హం. కాగా ఇదే సమయంలో డాలర్ ఇండెక్స్ 94–95 శ్రేణిలో తిరిగి వారం చివరకు 95.03 స్థాయి వద్ద ముగియడం మరో విశేషం. దేశీయంగానూ నష్టాలే.. ఇక ముంబై ప్రధాన మార్కెట్లో వారంలో పసిడి 99.9, 99.5 స్వచ్ఛత ధరలు రూ.270 చొప్పున తగ్గి రూ. 29,605, రూ. 29,455 వద్ద ముగిశాయి. వెండి కేజీ ధర రూ. రూ. 60 తగ్గి రూ. 37,760 వద్ద ముగిసింది. ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో శుక్రవారం ధర 29,650 వద్ద ముగిసింది. డాలర్ మారకంలో రూపాయి విలువ 68.60 వద్ద ముగిసింది. -
ఇది ఎలుగుల సృష్టి...!
ఈ ఫొటోల్లోని భారీ సొరంగాలను చూడండి చాలా అందంగా.. మనిషి నడవడానికి సరిపడినంత విశాలంగా ఉన్నాయి కదా. ఇలాంటి సొరంగాలు దక్షిణ అమెరికాలోని ఉత్తర ప్రాంతంలో అనేకచోట్ల ఉన్నాయి. వీటి నిర్మాణం చూసి బాగా చేయితిరిగిన ఇంజనీర్ ఇలా ఏర్పాటు చేసి ఉంటాడని అనుకుంటున్నారా.. అయితే మీరు పొరపాటు పడ్డట్లే. ఎందుకంటే ఈ సొరంగాలను మనిషి తవ్వలేదు..అలాగని ప్రకృతి మార్పుల వల్ల కూడా ఏర్పడ లేదు. సొరంగాలను ఎలుగుబంట్లు తవ్వాయట.. నమ్మడం లేదా అయితే సొరంగంలోని గోడలపై ఎలుగుబంట్లు తవ్వినట్లు నిరూపించే వాటి కాలు, చేతుల గోళ్ల ముద్రలు ఉన్నాయి ఓసారి చూడండి. ‘పాలియోబుర్రో’ అనే పిలిచే ఈ సొరంగాలను 10 వేల ఏళ్ల క్రితం దక్షిణ అమెరికాలో ప్రాంతంలో నివసించిన భల్లూకాలు తమ అవసరాల కోసం తవ్వి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. అప్పట్లో వాటి ఆకారం ఇప్పుడున్న ఏనుగుల సైజులో ఉండేవని, అందుకే ఇలాంటి సొరంగాలను తవ్వడం సాధ్యపడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బ్రెజిల్‌లోని ఫెడరల్ యూనివర్సిటీకి చెందిన హెన్రిచ్ ఫ్రాంక్ అనే ప్రొఫెసర్ 2000 సంవత్సరంలో రియో గ్రాండ్ డాసుల్ ప్రాంతంలో మొదటి సొరంగాన్ని కనుగొన్నాడు. ఇప్పటివరకు ఫ్రాంక్, అతని బృందం కలిపి ఇలాంటి సొరంగాలనే 1,500లకు పైగా కనుగొన్నారు. వీటిలో కొన్ని సొరంగాలు వందల అడుగులకు పైగా పొడవు ఉండడంతోపాటు లోపల అనేక చిన్న చిన్న సొరంగ మార్గాలు ఉన్నాయని ఫ్రాంక్ తెలిపారు. 2000 అడుగుల పొడవు, ఆరడుగుల ఎత్తు, ఐదడుగుల వెడల్పున్న సొరంగాన్ని తాజాగా కనుగొన్నారు. ఇంకా ఈ సొరంగాలకు సంబంధించి అంతుచిక్కని అనేక ప్రశ్నలు శాస్త్రవేత్తలను వేదిస్తున్నాయి. -
రెండు ఎలుగుబంట్లు మృతి
వ్యవసాయ బావిలో పడ్డ మూడు ఎలుగుబంట్లు రెండు మృతి, కనిపించని మరో పిల్ల ఎలుగుబంటి వీణవంక : గుట్టలు, అడవుల్లో ఉండాల్సిన ఎలుగుబంట్లు మంచినీటి కోసమో లేక ఆహారం కోసమో కానీ దారితప్పాయి. ఓ తల్లి ఎలుగుబంటితోపాటు రెండు పిల్ల ఎలుగులు వ్యవసాయ బావిలో పడ్డాయి. ఎవరో ఒకరు కాపాడకబోతారా అని 24 గంటలకు పైగా బావిలో ఎదురుచూశాయి. కానీ ఏ ఒక్క అధికారి పట్టించుకోకపోవడంతో చివరికి తల్లి, పిల్ల ఎలుగుబంటి బావిలోనే వృతి చెందగా, మరో పిల్ల ఎలుగుబంటి జాడ కనిపించడంలేదు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని శ్రీరాములపేట గ్రామానికి చెందిన కురిమిండ్ల కనకయ్య అనే రైతు చెందిన వ్యవసాయ బావిలో ఆదివారం రాత్రి తల్లి, రెండు పిల్ల ఎలుగుబంట్లు ప్రమాదవశాత్తు బావిలో పడ్డాయి. గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, సోమవారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో బావి వద్దకు చేరుకొని బావిలో నిచ్చెన వేశారు. బావిలో నీళ్లు ఎక్కవగా ఉండటంతో వాటిని బావిలోనే వదిలేసివెళ్లారు. మంగళవారం ఉదయం రైతు కనకయ్య వెళ్లి చూసేసరికి తల్లి, పిల్ల ఎలుగుబంటి మతి చెంది నీటిలో తేలాయి. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సెక్షన్ అధికారి భరణి, బీట్ అధికారి వేణు సంఘటన స్థలానికి చేరుకొని మతి చెందిన ఎలుగుబంట్లను బయటకి తీశారు. మరో ఎలుగుబంటి కోసం బావిలో గాలించినా జాడ తెలియలేదు. నిచ్చెన సహాయంతో బయటికి వెళ్లిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు. పశువైద్యుడు రవీందర్‌రెడ్డి బావి దగ్గరే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వాటిని ఖననం చేయడానికి అటవీశాఖ అధికారులు తీసుకెళ్లారు. అధికారులు సకాలంలో స్పందించి ఉంటే భల్లూకాలు బతికి ఉండేవని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. సామాజికి కార్యకర్త నలబాలు వేణుగోపాల్ సంఘటన స్థలంలో అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. మనుషులకు ప్రమాదాల జరిగితే 108, 100కు డయిల్ చేస్తాం.. అలాగే జంతువులు ప్రమాదంలో చిక్కినప్పుడు సమాచారం అందించడానికి టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించి అంతరించి పోతున్న వన్యప్రాణులను కాపాడాలని కోరారు. -
బావిలో పడి ఎలుగుబంట్లు మృతి
కరీంనగర్ : ప్రమాదవశాత్తు మూడు ఎలుగు బంట్లు వ్యవసాయ బావిలో పడి మరణించాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం శ్రీరాములపేటలో సోమవారం చోటు చేసుకుంది. ఆ విషయాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. దీంతో గ్రామస్తులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని... ఎలుగు బంట్లను బావిలో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
బావిలో ఎలుగుబంట్లు
-
బావిలో ఎలుగుబంట్లు
వీణవంక : శ్రీరాములపేట గ్రామంలో కురిమిండ్ల కనకయ్య అనే రైతుకు చెందిన వ్యవసాయబావిలో మూడు ఎలుగుబంట్లు పడటం కలకలం రేపాయి. గ్రామశివారులో ఉన్న తన వ్యవసాయ పొలం వద్దకు కనుకయ్య సోమవారం ఉదయం వెళ్లాడు. కరెంటు మోటార్ ఆన్ చేయడానికి యత్నించగా బావిలో తల్లి, రెండు పిల్ల ఎలుగుబంట్లు కనిపించాయి. వెంటనే అధికారులకు సమాచారం అందించాడు. అటవీశాఖ అధికారి భరణి ఆధ్వర్యంలో ఎలుగుబంట్లను బావిలో నుంచి సురక్షితంగా బయటకు తీశారు. వాటిని అడవిలో వదిలిపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. -
భల్లూకాన్ని బంధించారు!
మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఎలుగుబంట్ల హల్చల్ మత్తుమందు ఇచ్చి పట్టుకున్న సిటీ హంటర్ నవాబ్ నెల రోజుల్లో మూడు ఆపరేషన్లు సిటీబ్యూరో: సిటీ హంటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్ ఉత్తరాదిలో నెల రోజుల వ్యవధిలో మూడు ఆపరేషన్లు పూర్తి చేశారు. బిహార్‌లోని గయ ఫారెస్ట్ డివిజన్‌ను గడగడలాడించిన గజరాజును గత నెల ఆఖరి వారంలో మట్టుపెట్టాడు. ఆ తరువాత అదే ప్రాంతంలో విరుచుకుపడిన 16 ఏనుగుల్లో 15 గజాలను తరి మేసి... మరోదాన్ని బంధించారు. తాజాగా మహారాష్ట్రలోని చంద్రాపూర్ పరిధిలో జనావాసాల్లోకి చొచ్చుకు వచ్చి బీభత్సం సృష్టిస్తున్న ఎలుగుబంట్లలో ఒక దానిని గురువారం బంధించారు. చంద్రాపూర్ సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సంజయ్ థాక్రే ఆహ్వానం మేరకు మంగళవారం హుటాహుటిన అక్కడకు వెళ్లి భల్లూకాల పనిపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలను షఫత్ అలీ ఖాన్ శుక్రవారం ఫోన్లో ‘సాక్షి’కి వివరించారు. పవర్ ప్రాజెక్ట్ ఏరియాలోకి ప్రవేశించి... చంద్రాపూర్ సమీపంలోని థర్మల్ పవర్ ప్రాజెక్టు అడవికి దగ్గరగా ఉంటుంది. సువిశాలమైన ఈ ప్రాజెక్టు ప్రాంగణంలో సిబ్బంది క్వార్టర్స్, జనావాసాలు, పాఠశాల ఉన్నాయి. గత వారం అటవినుంచి దారి తప్పి వచ్చిన రెండు భల్లూకాలు ప్రాజెక్టు ఏరియాలో ప్రవేశించి ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో రంగంలోకి దిగిన చంద్రాపూర్ ఫారెస్ట్ అధికారులు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సంజయ్ థాక్రే మంగళవారం షఫత్ అలీ ఖాన్ సహాయం కోరుతూ ఫోన్ చేయడంతో తక్షణం స్పందించిన ఆయన హుటాహుటిన చంద్రాపూర్ చేరుకున్నారు. బుధవారం అటవీ శాఖ అధికారులు, పశువైద్యులు, స్థానికులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎలుగుబంట్లు సంచరిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించి ట్రాంక్వలైజింగ్కు అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. గురువారం ఉదయం ప్రాజెక్టు ప్రాంగణంలోని పాత క్వార్టర్స్‌లో ఎలుగుబంట్లు సేదతీరుతున్నట్లు గుర్తించిన ఆయన ఆ ప్రాంతంలోనే ట్రాంక్వలైజ్ చేయాలని నిర్ణయించుకుని అందుకు అవసరమైన పరికరా లు, పశువైద్యుడితో అక్కడకు చేరుకున్నారు. పాత క్వార్టర్స్‌లో ‘దొరికింది’... గురువారం మధ్యాహ్నం ఓ ఎలుగును గుర్తించి, మత్తుమందు ఇచ్చి బంధించారు. దీనిపై అలీ ఖాన్ మాట్లాడుతూ... ‘ఇటు ప్రజలకు, అటు ఎలుగుబంటికీ ఎలాంటి హాని లేకుండా ఆపరేషన్ పూర్తి చేయాలనే లక్ష్యంతో రంగంలోకి దిగాం. భల్లూకానికి పూర్తి అనువైన ప్రాంతంలో ట్రాంక్వలైజ్ చేయడం కాస్త కష్టమే అయ్యింది. ట్రాంక్వలైజ్ చేసిన తర్వాత... దానికి మత్తు ఎక్కడానికి కొంత సమయం ఉంటుంది. అప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా దాడి చేసి చంపేస్తుంది. ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉన్న ఆ ఎలుగుబంటి పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు గుర్తించాం. మత్తు ప్రభావం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెడతాం. మరో ఎలుగుబంటి కోసం సెర్చ్ నడుస్తోంది’ అని వివరించారు. -
ఆకారం కాదు.. ధైర్యముండాలి
మన్రోవియా: భారీ శత్రువుతో పోరాడి గెలవాలంటే పెద్ద ఆకారం కాదు.. ధైర్యం ముఖ్యమని బుల్లి కుక్క నిరూపించిన ఘటన దృశ్యమిది. అమెరికాలోని మన్రోవియాలో ఓ తోటను చిన్న కుక్కపిల్ల కాపలాకాస్తుండగా ఆహారం కోసం రెండు ఎలుగుబంట్లు చొరబడ్డాయి. ఒక్కోటి 45కేజీల బరువుండే ఎలుగుబంట్లను 9కేజీల కుక్కపిల్ల అరుస్తూ తరిమింది. దీని దెబ్బకు అవి పారిపోయాయి. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. -
కుక్కలనుకొని రెండేళ్లుగా సాకితే...
బీజింగ్: చైనాకు చెందిన ఓ వ్యక్తి రెండేళ్లుగా రెండు కుక్కపిల్లల్ని అల్లారుముద్దుగా పెంచాడు. తీరా చూస్తే అవి ఎలుగుబంట్లుగా మారిపోరాయి. ఏంటి.. ఆశ్చర్యపోయారా.. ఇలాగే బుర్ర గోక్కొని నోరు వెళ్లబెట్టాడు వాంగ్ కియూ. వాంగ్ కియూ కి జంతువులంటే ఎనలేని ప్రేమ. అందులోనూ కుక్కలంటే మరీ ప్రాణం. అందరు జంతు ప్రేమికుల్లాగే తను పెంపుడు జంతువులకు ఆహారం, నీళ్లు క్రమంగా అందిస్తూ, వాటి ఎదుగుదలను రోజూ గమనిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఈ రెండు పప్పీల్లో ఏదో తేడా ఉన్నట్టు అర్థమైంది. దాదాపు 100 పౌండ్ల దాకా బరువు పెరిగాయి. దీనికితోడు తాను పెంచుతున్న కోళ్లు అనూహ్యంగా మాయమవడాన్నిగమనించాడు. ఈలోగా స్థానిక అధికారులు ముద్రించిన కరపత్రాన్ని ఒకదాన్ని చదివాడు. ఇవి టైప్ 2 ఎలుగుబంట్లనీ.,.పక్కనున్న జంతువులను చంపి తింటూ ఉంటాయని దాని సారాంశం. దీంతో తాను గత రెండేళ్లుగా పెంచుతోంది కుక్కపిల్లల్ని కాదనీ ఏషియన్ ఎలుగుబంట్లనని తెలుసుకుని ఆశ్యర్యపోయాడు. ఇవి చాలా అరుదైన జాతికి చెందినవని తెలుసుకుని వెంటనే వాటిని స్థానిక జంతు సంరక్షణ అధికారులకు అప్పగించాడు. ఇవి ఒకటి ఆడ, మరొకటి మగ ఎలుగులనీ రెండూ ఆరోగ్యంగా ఉన్నాయని వారు తెలిపారు. -
ఎలుగుబంట్ల హల్చల్
-
అరణ్యం: ఎలుగుబంట్లు ఎలా నడుస్తాయి?
బ్లాక్ బేర్, బ్రౌన్ బేర్, పోలార్ బేర్ అంటూ పలు రకాలు ఉన్నాయి. ఎక్కువ ఉన్నది మాత్రం బ్రౌన్ బేర్. నివసించే పరిసరాలను బట్టి ఎలుగుల ప్రవర్తనలో తేడా ఉంటుంది తప్ప, వాటి లక్షణాలు దాదాపుగా ఒకలానే ఉంటాయి! ఆడ ఎలుగును ‘సౌ’ అంటారు. మగ ఎలుగును ‘బోర్’ అంటారు. ఎలుగుల గుంపును ‘స్లాత్’ అంటారు! ఎలుగుబంట్ల వయసును వాటి పళ్లను బట్టి లెక్కిస్తారు! అన్ని ఎలుగులూ శాకాహారంతో పాటు మాంసాహారాన్ని కూడా తింటాయి. కానీ ధ్రువప్రాంత ఎలుగుబంట్లు మాత్రం కేవలం మాంసాహారాన్నే భుజిస్తాయి! వీటికి నలభై రెండు పళ్లు ఉంటాయి. విచిత్రమేమిటంటే... శాకాహారాన్ని, మాంసాహారాన్ని కూడా నమిలేందుకు వీలుగా... వీటి పళ్లు రెండు రకాలుగా ఉంటాయి! దౌడు తీసే గుర్రాన్ని పట్టుకోవడం ఎంత కష్టమో తెలుసు కదా! ఎలుగులు మాత్రం వాటిని చేజ్ చేసి పట్టుకోగలవు. అంత వేగంగా పరుగెడతాయి మరి! మనిషి కంటే వంద రెట్లు వేగంగా ఇవి వాసనను పసిగట్టగలవు. ఇరవై మైళ్ల దూరంలో ఉండగానే వీటికి వాసన తెలిసిపోతుంది. మంచులో మూడు అడుగుల లోతున ఉన్న చే పలను కూడా ఇవి గుర్తించేస్తాయి! పాండాలు తప్ప మిగిలిన అన్ని ఎలుగుబంట్లూ మనిషిలాగా రెండు కాళ్ల మీద నడుస్తాయి. ఇలా నడవడాన్ని ‘ప్లాంటిగ్రేడ్’ అంటారు! ఇవి తమ కుటుంబాన్ని చాలా ప్రేమిస్తాయి. శత్రువు నుంచి తమ వారిని కాపాడటానికి ఒక్కోసారి ప్రాణాలను కూడా అడ్డేస్తాయట. పిల్లలయితే తల్లికి అస్సలు దూరంగా ఉండలేవు. పొరపాటున తల్లి చనిపోతే, కొన్ని వారాల వరకూ ఇవి ఏడుస్తూనే ఉంటాయట! సినిమాల కంటే అవే ఇష్టం! తెలుగు వాళ్లకు లియొనార్డో డికాప్రియో అంత బాగా మరే హాలీవుడ్ హీరో తెలియడేమో. ఎందుకంటే అతడు హీరోగా నటించిన టైటానిక్ సినిమాని భారతీయులు కూడా ఎంతో ఇష్టంగా చూశారు. జాక్, రోజ్ల ప్రేమ సఫలమవ్వాలని ఉత్కంఠను అనుభవించారు. చివరకు హీరోయిన్ని కాపాడి హీరో చచ్చిపోతే కలతచెంది కన్నీళ్లు పెట్టారు. అందుకే ఆ సినిమాని, అందులో ప్రాణత్యాగం చేసిన గొప్ప ప్రేమికుడు లియొనార్డోని ఎప్పటికీ మర్చిపోరు. సినిమాలో హీరోయిన్ మీద అపారమైన ప్రేమ చూపించిన లియొనార్డో, నిజ జీవితంలో జంతువుల మీద చెప్పలేనంత ప్రేమను చూపిస్తాడు. మనకు ఏ చెడూ చేయని జంతువులకి మనం ఎంతో కీడు చేస్తున్నాం అంటూ బాధపడుతుంటాడు లియొనార్డో. అందుకే అతడు వీలైనన్ని ఎక్కువ జంతువులను పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. లియొనార్డో ఇంట్లో బోలెడన్ని జీవులు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ఒకటి అతడికెంతో ప్రియమైన కుక్క. రెండోది, అతడు ఎంతో ఇష్టపడి తెచ్చుకున్న తాబేలు. దాన్ని మన హీరో బేబీ అని పిలుస్తాడు. మూడోది... బల్లి. దాని పేరు బ్లిజార్డ్. ఈ మూడింటితో ఆడుతూనే ఉంటాడు. అవి ఇచ్చినంత సంతోషాన్ని తనకు సినిమాలు కూడా ఇవ్వవంటాడీ యంగ్ స్టార్!