బావిలో ఎలుగుబంట్లు | bears in well | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 4 2016 8:38 AM | Last Updated on Thu, Mar 21 2024 9:51 AM

శ్రీరాములపేట గ్రామంలో కురిమిండ్ల కనకయ్య అనే రైతుకు చెందిన వ్యవసాయబావిలో మూడు ఎలుగుబంట్లు పడటం కలకలం రేపాయి. గ్రామశివారులో ఉన్న తన వ్యవసాయ పొలం వద్దకు కనుకయ్య సోమవారం ఉదయం వెళ్లాడు. కరెంటు మోటార్‌ ఆన్‌ చేయడానికి యత్నించగా బావిలో తల్లి, రెండు పిల్ల ఎలుగుబంట్లు కనిపించాయి. వెంటనే అధికారులకు సమాచారం అందించాడు. అటవీశాఖ అధికారి భరణి ఆధ్వర్యంలో ఎలుగుబంట్లను బావిలో నుంచి సురక్షితంగా బయటకు తీశారు. వాటిని అడవిలో వదిలిపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement