ఆకారం కాదు.. ధైర్యముండాలి
మన్రోవియా: భారీ శత్రువుతో పోరాడి గెలవాలంటే పెద్ద ఆకారం కాదు.. ధైర్యం ముఖ్యమని బుల్లి కుక్క నిరూపించిన ఘటన దృశ్యమిది. అమెరికాలోని మన్రోవియాలో ఓ తోటను చిన్న కుక్కపిల్ల కాపలాకాస్తుండగా ఆహారం కోసం రెండు ఎలుగుబంట్లు చొరబడ్డాయి.
ఒక్కోటి 45కేజీల బరువుండే ఎలుగుబంట్లను 9కేజీల కుక్కపిల్ల అరుస్తూ తరిమింది. దీని దెబ్బకు అవి పారిపోయాయి. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.