
యాత్రలో చిక్కుకున్న తెలంగాణవాసులు
న్యూఢిల్లీ: నేపాల్ లో కొండచరియలు విరిగిపడటంతో కైలాస మానససరోవర యాత్రకు అంతరాయం ఏర్పడింది. దాంతో తెలంగాణ నుంచి యాత్రకు నేపాల్ వెళ్లిన 8 మంది ముక్తినాథ్ లో చిక్కుకుపోయారు. దీనిపై స్పందించిన తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ నేరుగా నేపాల్ అధికారులతో మాట్లాడారు. నేపాల్ లో చిక్కుకుపోయిన తెలంగాణ వాసులను ముక్తినాథ్ నుంచి వారణాసికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
యాత్రకు వెళ్లి చిక్కుకుపోయిన వారి వివరాలు:
లక్ష్మీ సుజాత
జయమ్మ
విజయలక్ష్మి
బుజ్జమ్మ
నర్మద
జయలక్ష్మి
నరసమ్మ
సమతమ్మ