telangana tourists
-
Telangana Tourism: ఆహ్లాదం వైపు అడుగులు.. పర్యాటకులకు ఇక పండగే (ఫొటోలు)
-
పర్యాటలకు తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ తీపి కబురు
సాక్షి, పెద్దవూర(నల్గొండ) : పర్యాటలకు తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ తీపి కబురు అందించింది. కృష్ణానదిలో నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం సాగర్ హిల్‌కాలనీలోని లాంచీస్టేషన్ నుంచి ఉదయం 9 గంటలకు లాంచీ ప్రారంభమవుతుందని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. మూడు నెలల క్రితం ప్రారంభం కావాల్సిన లాంచీ ప్రయాణం పర్యాటకులు ఆసక్తి కనపర్చకపోవడంతో వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం 570 అడుగులకు పైగా ఉన్నప్పుడు సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ విహార యాత్రకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జలాశయంలో పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉండటంతో పర్యాటకులు ఆసక్తి చూపిస్తే మరో నెల రోజులకు పైగా లాంచీ ప్రయాణం నిర్వహించే అవకాశం ఉంది. ప్రకృతి అందాల నడుమ ప్రయాణం చుట్టూ ప్రకృతి అందాలతో అలరారే పచ్చదనంతో కప్పేసిన ఎత్తయిన కొండల నడుమ సాగే ఈ లాంచీ ప్రయాణం పర్యాటకులను ఎంతగానో అలరించనుంది. సాగర్ నుంచి శ్రీశైలం వరకు 110 కిలో మీటర్ల దూరం లాంచీలో ఏడు గంటల పాటు ప్రయాణం ఉంటుంది. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో సాగే లాంచీ ప్రయాణం పర్యాటకులకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. ఆహ్లాదకరమైన దృశ్యాలతో పాటు ఆధ్యాత్మిక వాతావరణంలో సాగే లాంచీ ప్రయాణం హాయిగా ఉంటుంది. ఈ ప్రయాణం మరవలేని స్మృతులను అందించనుంది. పక్షుల కిలకిలరావాలతో, నీటి సవ్వడుల మధ్య సాగే ఈ జర్నీలో ఆధ్యంతం ఆసక్తిగా సాగుతూ కొండల మధ్య తిరుగుతూ ఉంటుంది. మనకు తెలియని కొత్త, వింతైన విషయాలను తెలిపేందుకు లాంచీలో గైడ్ కూడా ఉంటాడు. చదవండి: మూడేళ్లుగా ఒకేచోట.. సైబరాబాద్‌లో ఎస్హెచ్ఓల బదిలీలు? టికెట్ వివరాలు నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణానికి గాను ఒకవైపు ప్రయాణికి పెద్దలకు రూ.1500, 4 నుంచి 12 సంవత్సరాల లోపు పిల్ల లకు రూ.1200గా నిర్ణయించారు. సాగర్ నుంచి శ్రీశైలం, తిరిగి శ్రీశైలం నుంచి సాగర్‌కు రెండు పైపులా ప్రయాణానికి పెద్దలకు రూ.2500, పిల్లలకు రూ.2000 ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటలకు బస్ ప్యాకేజీతో కలిపి పెద్దలకు రూ.3999, పిల్లలకు రూ.3399 ఉంటుంది. వివరాలకు 98485 40371, 79979 51023 ఫోన్ నంబర్లను సంప్రదించాలి. ఆన్లైన్ బుకింగ్ కోసం www.tsdc.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని పర్యాటక శాఖ అధికారులు పేర్కొన్నారు. చదవండి: MLC Polls:టీఆర్ఎస్ అభ్యర్థి దండే విఠల్ కోటీశ్వరుడు.. సాగర్ జలాశయంలో లాంచీ (ఫైల్) -
అసలు ట్రాఫికే లేకుండా గమ్యాన్ని చేరుకోగలిగితే!
ట్రాఫిక్ చిక్కులకు దూరంగా... సీట్లు దొరకని కిక్కిరిసే ప్రయాణాలకు భిన్నంగా... అలసట అనే మాటే వినపడకుండా... కాలుష్యమనేదే లేకుండా... ఆకాశవీధిలో విహరిస్తూ... ‘కాంక్రీట్ జంగల్’ మధ్యలోంచి నిమిషాల వ్యవధిలో గమ్యం చేరుకోగలిగితే..! కలల అలలపై తేలియాడేలా నిత్యం ఈ అనుభూతి కొనసాగితే? పర్యాటక ప్రాంతాలను గగన వీక్షణం ద్వారా తిలకించగలిగితే!! విదేశాల్లోనో లేదా పర్యాటక ప్రాధాన్యతగల రాష్ట్రాల్లోనో ఉండే ఈ సౌకర్యం మనకూ అందుబాటులోకి వస్తే ఎంతటి ‘భాగ్యం’ అనుకుంటున్నారా? సరిగ్గా ఇదే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుడుతోంది. సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరవాసులు ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడేందుకు, నగర ప్రజల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ట్రాఫిక్ నరకప్రాయంగా మారిన సిటీలో మెట్రో రైలు సౌకర్యం వచ్చాక పరిస్థితి కాస్త మెరుగుపడినా కీలక సమయాల్లో మెట్రో రైళ్లు సైతం కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు మరో రవాణా సాధనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే వివిధ దేశాల్లో విజయవంతంగా నడుస్తున్న రోప్‌వే మార్గాన్ని హైదరాబాద్‌కు పరిచయం చేసే దిశగా యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఉమ్టా) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మూడు మార్గాల్లో రోప్‌వే మార్గాన్ని ప్రవేశపెట్టే దిశగా ప్రణాళిక రూపొందిస్తోంది. హైదరాబాద్‌లో రెండు కారిడార్లతోపాటు యాదాద్రిలో మరో కారిడార్ ఏర్పాటుపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేస్తోంది. ఈ మూడు మార్గాల్లో దాదాపు 17 కిలోమీటర్ల మేర రోప్‌వే నిర్మించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. అస్సాం, గుజరాత్ గిర్నార్, తూర్పు ముంబైలోని సెవ్రీ నుంచి ఎలిఫెంటా గుహల వరకు ఉన్న రోప్‌వే మార్గాల తరçహాలోనే హైదరాబాద్‌లోనూ రోప్‌వే ఏర్పాటు చేయాలనుకుంటోంది. 50 నుంచి 150 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసే ఈ రవాణా వ్యవస్థలో ఉండే ఒక్కో క్యాబిన్లో 8 మంది ప్రయాణికులు కూర్చొనే డిజైన్‌ను పరిశీలిస్తోంది. అలాగే కేబుల్ రిలే టవర్స్‌లో 30 మంది వరకు కూర్చొనేలా కూడా ఈ ప్రాజెక్టుపై కసరత్తు చేస్తోంది. సింగపూర్‌లో రహదారులపై ఏర్పాటు చేసిన రోప్‌వే మార్గం ఎలా ఉందనే దానిపై ఇప్పటికే అధ్యయనం చేసింది. ఏయే ప్రాంతాల్లో..? హైదరాబాదీలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు.. అంటే పర్యాటకులు ఎక్కువగా వెళ్లే ప్రాంతాల మధ్య రోప్‌వే రవాణా ఏర్పాటు చేయాలని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఉమ్టా) అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మెట్రో లేని మార్గమైన ఎంజీబీఎస్ నుంచి నెహ్రూ జంతు ప్రదర్శనశాల, ఖైరతాబాద్ నుంచి సచివాలయం, ప్యారడైజ్ నుంచి సచివాలయం మార్గంలో దాదాపు 12 కిలోమీటర్ల మేర అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సెక్రటేరియట్‌కు సమీపంలోనే హుస్సేన్‌సాగర్‌తోపాటు లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్, సంజీవయ్య పార్కు ఉన్నాయి. అలాగే పర్యాటకులతోపాటు భక్తులు ఎక్కువగా వెళ్లే యాదాద్రి జిల్లాలోని రాయగిరి నుంచి యాదాద్రి గుడి వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర రోప్ వేను అందుబాటులోకి తీసుకొచ్చేలా అధ్యయనం చేస్తున్నారు. -
పాపికొండలు.. పర్యటనకు వెళ్తారా?
సాక్షి, హైదరాబాద్: పర్యాటక సందడి తిరిగి మొదలైంది. కోవిడ్ కారణంగా చాలా కాలంగా ఇళ్లకే పరిమితమైన నగరవాసులు కాలక్షేపం కోసం పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ పర్యాటకుల అభిరుచికి అనుగుణమైన ప్యాకేజీలను రూపొందించింది. నగరంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో హైదరాబాద్‌ను సందర్శించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రకృతి ఒడిలో.. పాపికొండల యాత్ర: ఇది ప్రతి శుక్రవారం ఉంటుంది. రాత్రి 8.30 గంటలకు బయలుదేరుతారు. శనివారం ఉదయం భద్రాద్రికి చేరుకుంటారు. శ్రీరాముడి దర్శనం అనంతరం పర్ణశాలకు వెళ్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం పాపికొండలకు వెళ్తారు. రాత్రికి కొల్లూరులోని బ్యాంబూ హట్స్‌లో బస ఉంటుంది. మరుసటి రోజు బయలుదేరి తిరిగి నగరానికి చేరుకుంటారు. పెద్దవారికి చార్జీ రూ.4,594 ఉంటుంది. పిల్లలకు ఇందులో 80 శాతం వరకు చార్జీ ఉంటుంది. ఆధ్యాత్మికం.. రమణీయం.. అనంతగిరిహిల్స్: వికారాబాద్ సమీపంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతం అనంతగిరి విహారం కోసం నగరం నుంచి ఉదయం 9 గంటలకు బయల్దేరి రాత్రి 8 గంటలకు తిరిగి చేరుకుంటారు. అనంతగిరి కొండల్లో రమణీయమైన ప్రకృతిని ఆస్వాదించడంతో పాటు, పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు. ఈ టూర్ కోసం పెద్దవారికి రూ.900, పిల్లలకు రూ.720 చొప్పున చార్జీ ఉంటుంది. సిటీ టూరు.. బోటు షికారు.. సిటీ టూర్లో భాగంగా బిర్లా టెంపుల్, నిజామ్ మ్యూజియం, చౌమొహల్లా ప్యాలెస్, చార్మినార్ (బయట నుంచి మాత్రమే), జూపార్కు, తారామతి బారాదరి, గోల్కొండ తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు.ఈ పర్యటన కోసం ఏసీ వాహనాల్లో రూ.350, నాన్ ఏసీ వాహనాల్లో రూ.250 వరకు చార్జీ ఉంటుంది. పర్యటనలో భాగంగా టిఫిన్, భోజనం, వివిధ ప్రాంతాల్లో సందర్శన టికెట్ల రుసుము పర్యాటకులే చెల్లించాల్సి ఉంటుంది. రవాణా సదుపాయాన్ని మాత్రమే పర్యాటక అభివృద్ధి సంస్థ కల్పిస్తుంది. హుస్సేన్‌సాగర్‌లో బోటు షికారు కూడా అందుబాటులోకి తెచ్చారు. కాకతీయ రీజియన్ యాత్ర: ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరుతుంది. 2వ రోజు రాత్రి 9 గంటలకు తిరిగి చేరుకుంటారు. కాళేశ్వరం, రామప్ప, వేయిస్తంభాల గుడి, యాదాద్రి, కీసర తదితర పుణ్యక్షేత్రాల సందర్శన ఉంటుంది. పెద్దవారికి రూ.1,550, పిల్లలకు రూ.1,320 చొప్పున చార్జీ ఉంటుంది. శైవ క్షేత్రాల సందర్శన.. శాతవాహన యాత్ర: ఈ పర్యటన కోసం నగరం నుంచి ప్రతి సోమవారం ఉదయం 7 గంటలకు బయలుదేరి తిరిగి రాత్రి 10 గంటలకు చేరుకుంటారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి తదితర ఆలయాల సందర్శన ఉంటుంది. బస్సు చార్జీ పెద్దవారికి రూ.1300, పిల్లలకు రూ.1040 చొప్పున ఉంటుంది. ఆలయ ప్రవేశ రుసుము, భోజనం వంటివి పర్యాటకులే ఏర్పాటు చేసుకోవాలి. పంచారామాలకు: ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామాలకు కూడా హైదరాబాద్ నుంచి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇది 3 రోజుల పాటు ఉంటుంది. ఉదయం 9 గంటలకు బయల్దేరి 3వ రోజు ఉదయం 7 గంటలకు తిరిగి నగరానికి చేరుకుంటారు. అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట క్షేత్రాలను సందర్శించవచ్చు. పెద్దవారికి రూ.3,500, పిల్లలకు రూ.2,800 చొప్పున చార్జీలు ఉంటాయి. బుకింగ్ ఇలా.. ఈ పర్యటనల కోసం తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఆన్లైన్లోనే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 040– 29801040, 98485 40371 -
కేరళ చలో...రీచార్జ్ కరో..
భూతల స్వర్గం, ప్రకృతి అందాల నిలయం అని కేరళను పర్యాటకులు కీర్తిస్తుంటారు. అక్కడి పచ్చని ప్రకృతిని.. జాలువారే జలపాతాలను.. హౌస్బోట్లను ఆస్వాదించని సిటీ టూరిస్ట్‌లు అరుదే. అయితే ఒకసారి కేరళను సందర్శిస్తే చాలని భావించే సిటీ టూరిస్ట్‌లు ఇప్పుడు తరచుగా కేరళ చలో అంటున్నారు. అవును మరి... ఇప్పుడు కేరళ సిటిజనుల రీచార్జ్ సెంటర్. ఐటీ ఉద్యోగులు, సంపన్నులు, గ్లామర్ రంగ ప్రముఖులకు రెగ్యులర్ విజిట్. కనీసం మూణ్నెళ్లకు ఒకసారైనా కేరళ వెళ్లడం పరిపాటిగా మారింది. దీనికి కారణం ఆ రాష్ట్రంలోని ఆయుర్వేద చికిత్సలే.– సాక్షి, సిటీబ్యూరో సర్జరీ సమస్య తప్పింది మోకాలి కీళ్ల సమస్యతో బాధపడేదాన్ని. నేల మీద కూర్చోలేనని తేల్చి చెప్పారు. మెట్లు ఎక్కలేనని చెప్పిన ఇక్కడి వైద్యులు నాకు కీహోల్ సర్జరీ సూచించారు. ఇద్దరు పిల్లల తల్లిగా ఇంట్లో నా పనులు చేసుకోకుండా ఉండలేను. చివరకు స్నేహితుల సూచన మేరకు కేరళలోని అస్టాముడిలో ఉన్న ఓ ఆయుర్వేదిక్ సెంటర్లో 21 రోజుల పాటు చికిత్స తీసుకున్నాను. సంపూర్ణంగా కోలుకున్నాను. నా పనులన్నీ చేసుకోగలుగుతున్నా జిమ్‌కు కూడా వెళుతున్నా. – కవిత, గృహిణి విభిన్న రకాల మారథాన్లలో పాల్గొన్న అనుభవం ఉంది కానీ మారథాన్‌ని అడ్వెంచరస్‌గా అనుభూతించింది మాత్రం ఒకే ఒక్కసారి. గత వింటర్ సీజన్లో పుణెలోని ఈస్ట్రన్ ఘాట్స్ దగ్గర దీనిని ఒక సంస్థ నిర్వహించింది. మారథాన్ రేస్ మొత్తం హిల్స్ మీదే కావడం దీనిలోని విశేషం. మై అడ్వెంచర్హిల్స్లోరేస్ పుణె రైల్వే స్టేషన్ నుంచి 50కి.మీ దూరం ఈస్ట్రన్ ఘాట్స్‌కు వెళ్లాం కొండ కింద అందరికీ అవసరమైనవి అన్నీ అందించాక రేస్ ప్రారంభమైంది. ఫోన్ సిగ్నల్స్ లేవు. కనుచూపు మేరలో మనుషుల్లేరు. నాది 25 కిలోమీటర్ల విభాగంలో రేస్. కొన్ని కిలోమీటర్లు నడిచాక పాలు పెరుగు అమ్ముకునే మరాఠా మహిళలు.. కొండల్లో వారిని చూస్తే వనకన్యల్లా ఎంత చక్కగా ఉన్నారో. చుట్టు పక్కల ఊర్ల నుంచి వచ్చి మా లాంటి ట్రెక్కర్స్ కోసం వీళ్లు అవి విక్రయిస్తుంటారు. కొండ ఎక్కేటప్పుడు పలు మార్లు జారిపడ్డా, దెబ్బలు తగిలాయి. హమ్మయ్య ఎక్కడం పూర్తయింది అనుకుంటే.. ఎక్కడం కన్నా దిగడం చాలా కష్టమని దిగేటప్పుడు అర్థమైంది. ట్రాక్ చిరిగిపోయి చేతులకి దెబ్బలు కాళ్లకి దెబ్బలతో ఎలాగో పూర్తి చేశా. నిర్ణీత వ్యవధి 7గంటల్లో పూర్తి చేసి మెడల్ అందుకున్నా. అప్పుడు బాగా కష్టంగా అనిపించింది. కానీ ఇప్పటికీ తలచుకుంటే ఆ అనుభవం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. జీవితంలో తొలి క్లిష్టమైన అడ్వెంచర్ అదే. మళ్లీ అలాంటివి చేయాలనిపించేంత మంచి జ్ఞాపకాన్ని అందించింది. – భార్గవి, రేడియో జాకీ, యాంకర్ ట్రీట్...క్లీన్ ‘‘ ఏ సమస్య ఉన్నా లేకున్నా నిర్ణీత వ్యవధిలో కారు సర్వీసింగ్‌కి పంపుతాం కదా. అలాగే శరీరాన్ని కూడా కేరళకు పంపాలి’’ అంటూ అభిప్రాయపడ్డారు నగరానికి చెందిన వ్యాపార వేత్త కిరణ్. ఆ ఏడాదిలో తలెత్తిన ఏవైనా ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి మాత్రమే కాక టాక్సిన్స్‌ను తొలగించుకోవడానికి, శరీరంలో పేరుకుపోయిన అన్ని రకాల చెత్తను శుభ్రపరచుకోవడానికి సిటిజనులు ఈ మళయాళీ రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ‘‘మన వాళ్లింకా తక్కువని చెప్పాలి. ప్రతీ ఏడాదీ అక్కడకు వెళ్లినప్పుడల్లా భారతీయుల కన్నా పెద్ద సంఖ్యలో పాశ్చాత్యులు నాకు కనిపిస్తుంటారు. అంతేకాదు వారికి ఆయుర్వేద, నేచురోపతి చికిత్సలపై మంచి అవగాహన కూడా ఉంది’’ అని చెప్పారు ఐటి ఉద్యోగిని శ్రీకళ. ఓ వైపు వ్యయ భరితం కావడం మరోవైపు పూర్తి ప్రశాంతతను కోరుకోవడం వల్ల ఇలాంటి చికిత్సలకు ఒంటరిగా లేదంటే బాగా సన్నిహితులతో మాత్రమే వెళుతున్నారు. శరీరం మొత్తం తిరిగి పునరుత్తేజం పొందేలా తిరిగొస్తున్నారు. చర్మ సంబంధ సమస్యల తీవ్రమైన ఒళ్లు నొప్పుల వంటి శారీరక సమస్యల నుంచి డిప్రెషన్, నిద్రలేమి వంటి సైకలాజికల్ సమస్యల దాకా కేరళ పేరు జపిస్తున్నారు. ఏదైనా సమస్య వస్తే వెళ్లడం దగ్గర మొదలై ఏ సమస్య లేకపోయినా ఇప్పుడు ఏడాదికి ఆర్నెళ్లకు ఒకసారి తప్పక వెళ్లివచ్చేదాకా వచ్చేసింది. ఈజీ ప్యాకేజీలూ... విభిన్న ఆయుర్వేద కేంద్రాలు విభిన్న రకాల ప్యాకేజ్‌లు అందిస్తున్నాయిు. సిటీ నుంచి కేరళకు పెరిగిన టూరిస్టుల రద్దీతో అన్నీ కలగలిపిన ప్యాకేజ్‌లు కూడా టూర్ ఆపరేటర్లు ఆఫర్ చేస్తున్నారు. రానుపోను చార్జీలు కాకుండా 3 పూటలా భోజనం, రోజుకు 3గంటల చికిత్స, యోగా, మందుల వినియోగం ఖర్చులు, రిసార్ట్స్‌లో బస వెరసి ఖరీదు రోజుకు రూ.5వేల నుంచి రూ.10వేల మధ్యలో ఉంటుంది. చికిత్స సందర్భంగా అక్కడ అందించే ఆహారం తక్కువ నూనెలతో తక్కువ స్పైసీగా ఉన్నా, రుచిగా ఉంటుందని అక్కడికి వెళ్లొచ్చినవారు చెబుతున్నారు. విరివిగా వినియోగించే గ్రీన్ చిల్లీస్, కొబ్బరి రుచిని పెంచుతాయని చెప్పారు. రోజుకి 8వేలైనా ఎక్కువనిపించలేదు... ఏటేటా కేరళ వెళ్లి కొట్టాయంలోని ఓ ఆయుర్వేదిక్ సెంటర్లో పంచకర్మ చికిత్స చేయించుకుంటుంటా. దీనికి గాను రోజుకి 8వేలు చెల్లిస్తా. ఇదిæ వ్యయభరితంగా అనిపిస్తుంది. అయితే మన మానసిక ప్రశాంతత, ఆరోగ్యంతో పోలిస్తే ఇది అంత పెద్ద మొత్తం కాదు. పైగా ఇందులో బస, ఆహారం, వైద్య చికిత్స తదితర అన్ని ఖర్చులూ కలిపి ఉంటాయి.– ఎం.శ్రీరామ్నాథ్, ఐటి ఉద్యోగి సీనియర్స్‌కు విల్లాలో ఉచిత బస తరచుగా టూర్లు వెళ్లి రావడం, ఇష్టమైన చోటుకి పర్యటనలు చేయడం అనేది సిటిజనుల్లో అంతకంతకూ పెరుగుతున్న అభిరుచి. దీనిని దృష్టిలో ఉంచుకుని విభిన్న రకాల ప్యాకేజీలతో టూర్ ఆపరేటర్లు ఆకర్షిస్తున్నారు. వీరితో పోటీగా ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్‌ల కోసం నిర్వాహకులు కూడా మరిన్ని హంగులతో, ఆకర్షణీయ పధకాలతో ముందుకు వస్తున్నారు. అదే తరహాలో ప్రముఖ సంస్థ విస్టా రూమ్స్ వినూత్న ఆఫర్‌తో ముందుకొచ్చింది. పెద్దలను హాలిడే వెకేషన్‌కి తీసుకెళితే వారికి ఉచితంగా తమ విల్లాలో బస అందిస్తామని అంటోంది విస్టా రూమ్స్. దక్షిణాసియా వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో బస ఏర్పాట్లలో పేరొందిన విస్టా రూమ్స్ 60ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్ల కోసం ఒక ఆకర్షణీయమైన ఆఫర్‌ని అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా పలు పర్యాటక ప్రాంతాల్లో తమకున్న 300కు పైగా వసతి భవనాల్లో సీనియర్స్ కోసం ఉచిత బస కల్పిస్తోంది. ఈ నెల 15 న ప్రారంభమైన ఈ ఆఫర్ కేవలం నెల రోజులు అది కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. బిజీ లైఫ్‌లో పేరెంట్స్ సరదాలను తీర్చలేకపోతున్న పిల్లల్ని ప్రోత్సహించేందుకు దీన్ని అందిస్తున్నామని, వృద్ధులు ఎవరైనా సరే దీనిని ఉపయోగించుకోవచ్చునని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అదనపు వివరాల కోసం www.vistarooms.com లాగిన్ కావచ్చు. గో.. గోవా... పార్టీ ప్రియులు ఇష్టపడే ప్లేస్ గోవా అక్కడి షిప్స్ మీద విహరించే సిటిజనుల కోసం గోవాలోని డెల్టిన్ కాసినోస్ తాజాగా సరికొత్త డెల్టిన్ మ్యూజికల్ స్టార్స్‌తో ఆహ్వానిస్తోందని సంస్థ సిటీ ప్రతినిధులు తెలిపారు. ప్రతి వారాంతంలో డెల్టిన్ రాయల్, డెల్టిన్ జేఎక్యుకె...షిప్లలోఇండియన్ ఐడల్, సరిగమప, ది వాయిస్, రా తదితర రియాలిటీ షోస్‌లో పాల్గొన్న సింగర్స్‌తో షోస్ మ్యూజికల్ స్టార్ పేరుతో ఈవెంట్స్ ఉర్రూతలూగిస్తాయన్నారు. -
యాత్రలో చిక్కుకుపోయిన తెలంగాణవాసులు
-
యాత్రలో చిక్కుకున్న తెలంగాణవాసులు
న్యూఢిల్లీ: నేపాల్ లో కొండచరియలు విరిగిపడటంతో కైలాస మానససరోవర యాత్రకు అంతరాయం ఏర్పడింది. దాంతో తెలంగాణ నుంచి యాత్రకు నేపాల్ వెళ్లిన 8 మంది ముక్తినాథ్ లో చిక్కుకుపోయారు. దీనిపై స్పందించిన తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ నేరుగా నేపాల్ అధికారులతో మాట్లాడారు. నేపాల్ లో చిక్కుకుపోయిన తెలంగాణ వాసులను ముక్తినాథ్ నుంచి వారణాసికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. యాత్రకు వెళ్లి చిక్కుకుపోయిన వారి వివరాలు: లక్ష్మీ సుజాత జయమ్మ విజయలక్ష్మి బుజ్జమ్మ నర్మద జయలక్ష్మి నరసమ్మ సమతమ్మ