ప్రతీకాత్మక చిత్రం
బీజింగ్ : బాత్‌రూంలో మొబైల్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీరు తప్పక తెలుసుకోవాల్సిందే. పొరుగు దేశం చైనాలో ఓ కుర్రాడు బాత్‌రూంలో వీడియోగేమ్స్ ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. గంటల కొద్దీ బాత్‌రూంలో గేమ్ ఆడుతూ ఉండటంతో అతని మలద్వారం తీవ్రంగా గాయపడింది. ఎంతలా అంటే రెక్టమ్ (పెద్ద పేగు చివరి భాగం) కిందికి వేలాడటమే కాకుండా అతని మలద్వారం నుంచి ఓ రక్తం ముద్ద కిందికి జారిపోయింది. వైద్య పరీక్షల్లో అతని రెక్టమ్ శరీరంతో విడిపోయినట్లు వైద్యులు గుర్తించారు.
చివరకు శస్త్ర చికిత్స చేసి ప్రాణాలను రక్షించారు. గంటలకొద్ది కూర్చోని ఉండటంతో అతని పురుషనాళ కండరాలు దెబ్బతిన్నాయని డాక్టర్లు పేర్కొన్నారు. అయితే ఆ కుర్రాడు చిన్నప్పటి నుంచే మలబద్దకం సమస్యతో బాధపడుతున్నాడని, ఇంతవరకు చికిత్స చేసుకోకపోవడంతో పరిస్థితి తీవ్రమై ప్రాణాల మీదకు వచ్చిందన్నారు. అలానే వీడియో గేమ్స్ ఆడుతూ బాత్‌రూంలో ఎక్కువ సమయం గడపడంతో వ్యాధి తీవ్రమైందన్నారు. ఆ కుర్రాడు మాత్రం 30 నిమిషాలు మొబైల్‌లో గేమ్ ఆడుతూ బాత్‌రూంలో కూర్చున్నానని డాక్టర్లకు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment