
భారత్‌కు అమెరికా డ్రోన్లు!
వాషింగ్టన్: తీరప్రాంత నిఘాకు.. ముఖ్యంగా హిందూ మహా సముద్ర ప్రాంత రక్షణ కోసం 22 ప్రిడేటర్ గార్డియన్ డ్రోన్లు అందజేయాలని భారత్ చేసిన విజ్ఞప్తికి అమెరికా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల భారత్‌ను కీలక రక్షణ భాగస్వామిగా అమెరికా ప్రకటించిన నేపథ్యంలో ఈ దిశగా వేగంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.
ఒబామా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయేలోపు ప్రక్రియ పూర్తవుతుందని సమాచారం. భారత నేవీ ఫిబ్రవరిలో ప్రిడేటర్ గార్డియన్ డ్రోన్ల కొనుగోలు కోసం రక్షణ శాఖకు లేఖ రాసింది. దీనిపై అమెరికా ఇ నిర్ణయం తీసుకోనప్పటికీ సబంధిత అంతర్గత ప్రక్రియ మొదలైనట్లు సమాచారం. రక్షణ మంత్రి పరీకర్ పరీకర్ ఆగస్టు 29న అమెరికా రక్షణ మంత్రి కార్టర్‌తో ఈ డ్రోన్ల విషయంపై చర్చలు జరిపినట్లు ఉన్నతాధికారులు ధ్రువీకరించారు.