గంజాయి వ్యాపారంలోకి మైక్రోసాఫ్ట్
మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్ రూపకల్పనకు ప్రణాళిక
న్యూయార్క్: అమెరికా ప్రభుత్వం గంజాయి వాడకాన్ని అక్రమంగా పరిగణిస్తున్నా.. పలు రాష్ట్రాలు మాత్రం గంజాయి పెంపకాన్ని చట్టబద్ధం చేశాయి. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. గంజాయి వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్లు గురువారం ప్రకటించింది. గంజాయి మార్కెటింగ్ కోసం అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అందించేందుకు ముందుకొచ్చింది.
‘మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్’ అనే సాఫ్ట్‌వేర్ ద్వారా అమెరికాలో గంజాయిని చట్టబద్ధం చేసిన రాష్ట్రాలు వీటిని ఆన్‌లైన్లో అమ్ముకోవచ్చు. ఇప్పటివరకు గంజాయిని (వైద్య సంబంధ, వినోదం కోసం) పండిస్తున్న ఆ రాష్ట్రాలు ప్రధాన కంపెనీలను ఆకర్షించటంలో విఫలమయ్యాయి.