విమానం కోసం కొనసాగుతున్న వేట | Missing jet: Search effort continues after new discovery | Sakshi
Sakshi News home page

విమానం కోసం కొనసాగుతున్న వేట

Published Sun, Apr 6 2014 11:54 AM | Last Updated on Tue, Mar 19 2019 9:23 PM

విమానం కోసం కొనసాగుతున్న వేట - Sakshi

విమానం కోసం కొనసాగుతున్న వేట

పెర్త్: నెలరోజుల నుంచి మిస్టరీగా మారిన మలేసియా విమానం ఆచూకీ కనిపెట్టేందుకు నిరంతరాయంగా అన్వేషణ కొనసాగుతోంది. దక్షిణ హిందూ మహాసముద్రంలో విమానం బ్లాక్ బాక్స్ నుంచి ఎలెక్ట్రానిక్ పల్స్ సిగ్నల్స్  చైనా ఓడకు రావడంతో ఆ దిశగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

పది యుద్ధ విమానాలు, రెండు జెట్లు, 13 ఓడలతో విమానం జాడ కనిపెట్టేందుకు  ప్రయత్నిస్తున్నారు. వాతావరణం కూడా అనుకూలిస్తుండటంతో గాలింపు చర్యల్ని ముమ్మరం చేసినట్టు చైనాకు చెందిన ఓ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. పెర్త్ (ఆస్ట్రేలియా)కు వాయువ్య దిశగా రెండు వేల కిలో మీటర్ల దూరంలో వెతుకుతున్నారు. 239 ప్రయాణికులతో కూడిన మలేసియా ఎయిర్లైన్స్ ఎమ్హెచ్ 370 విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇందులో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement