malaysian plane
-
ఆ విమానం ఆచూకీ ఎప్పటికీ మిస్టరీయే
కౌలాలంపూర్: మూడేళ్ల క్రితం అదృశ్యమైన మలేషియా విమానం ఎంహెచ్ 370 ఆచూకీ ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోనుంది. ఈ విమానం ఆచూకీ కోసం హిందూ మహాసముద్రంలో చేపట్టిన గాలింపు చర్యలను నిలిపి వేయాలని నిర్ణయించారు. దీంతో ఎంహెచ్ 370 జాడ గుర్తించకుండానే ఆపరేషన్ ముగిసింది. అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతికను ఉపయోగించుకుని, నిపుణులు సలహాలు తీసుకుని సముద్రంలో విస్తృతంగా గాలించామని, అయితే విమానం ఆచూకీ తెలుసుకోలేకపోయామని ఆస్ట్రేలియాలోని జాయింట్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ ప్రకటించింది. 2014 మార్చి 8వ తేదీన కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో చైనా రాజధాని బీజింగ్ బయలుదేరిన మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్370 అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఇందులో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. బయల్దేరిన కొద్ది సేపటికే ఆ విమానం సముద్రంలో కూలినట్లు అప్పట్లో మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ ప్రకటించారు. ఈ విమానం ఆచూకీ కోసం 26 దేశాలకు చెందిన వైమానిక, నౌకా దళాలు గాలించాయి. భారత్‌కు చెందిన సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అయినా ఫలితం లేకపోయింది. గతంలో కనబడకుండా పోయిన విమానాలు, ఓడల్లాగా ఇది కూడా ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది. -
విమానం కోసం కొనసాగుతున్న వేట
పెర్త్: నెలరోజుల నుంచి మిస్టరీగా మారిన మలేసియా విమానం ఆచూకీ కనిపెట్టేందుకు నిరంతరాయంగా అన్వేషణ కొనసాగుతోంది. దక్షిణ హిందూ మహాసముద్రంలో విమానం బ్లాక్ బాక్స్ నుంచి ఎలెక్ట్రానిక్ పల్స్ సిగ్నల్స్ చైనా ఓడకు రావడంతో ఆ దిశగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. పది యుద్ధ విమానాలు, రెండు జెట్లు, 13 ఓడలతో విమానం జాడ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వాతావరణం కూడా అనుకూలిస్తుండటంతో గాలింపు చర్యల్ని ముమ్మరం చేసినట్టు చైనాకు చెందిన ఓ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. పెర్త్ (ఆస్ట్రేలియా)కు వాయువ్య దిశగా రెండు వేల కిలో మీటర్ల దూరంలో వెతుకుతున్నారు. 239 ప్రయాణికులతో కూడిన మలేసియా ఎయిర్‌లైన్స్ ఎమ్హెచ్ 370 విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇందులో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. -
వీడిన మలేషియా విమానం మిస్టరీ
-
వీడిన మలేషియా విమానం మిస్టరీ
కౌలాలంపూర్ : గత కొన్నిరోజులుగా ఉత్కంఠం రేపిన మలేషియన్ విమానం అదృశ్యం మిస్టరీ వీడింది. గాల్లో ప్రయాణించిన కొద్ది సేపటికే ఆ విమానం కూలినట్లు తాజాగా మలేషియన్ ప్రధాని నజీబ్ రజాక్ ప్రకటించారు. హిందూ మహా సముద్రానికి నైరుతి దిశగా 2500 కిలోమీటర్లు దూరంలో శకలాలు లభించడంతో విమానం కూలినట్లు నిర్దారించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన నజీబ్.. విమాన ఘటనకు సంబంధించిన వివరాలను రేపు ప్రకటిస్తామన్నారు. అత్యధునిక సాంకేతిక పరిజ్ఞానం కల్గిన బ్రిటన్ ఉపగ్రహం అందజేసిన ఛాయాచిత్రాల ఆధారంగా చర్యలు చేపట్టిన ఆస్ట్రేలియా ఆ విమాన శకలాలను కనుగొంది. దక్షిణ హిందూ మహాసముద్రంలో తాము ఓ చెక్క కార్గో ప్యాలెట్‌ను గుర్తించిన అనంతరం విమాన ఘటనపై తుది నిర్దారణకు వచ్చారు. ఉపగ్రహం గుర్తించిన శిథిలాల వద్దకు ఆస్ట్రేలియన్ షిప్ వెళ్లడంతో ఈ విషాదాంత ఉదంతానికి తెరపడింది. ఇప్పటి వరకూ మలేషియా విమానం అదృశ్యంపై రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తూనే ఉన్నాయి. 16 రోజుల క్రితం కౌలాంపూర్ నుంచి బీజింగ్ కు 239 మంది ప్రయాణికులతో బయలుదేరిన మలేషియన్ విమానం దక్షిణ చైనా సముద్రం మీదుగా మలుపు తీసుకుందని సైనిక రాడార్ సిగ్నళ్ల ద్వారా తెలిసింది. అదృశ్యం అయిపోవడానికి ముందు సముద్ర మట్టానికి కేవలం 12వేల అడుగుల ఎత్తున మాత్రమే అది పయనించిందని, విమానం ఆ మలుపు తీసుకోడానికి సుమారు రెండు నిమిషాల సమయం పట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. అప్పుడే ప్రమాదం సంభవించి, పైలట్ లేదా కో పైలట్ ప్రమాద సంకేతాలు పంపి ఉండొచ్చని అంటున్నారు. ఈ క్రమంలోనే విమానం కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. -
మలేషియన్ పైలట్ భార్యను ప్రశ్నించనున్న ఎఫ్‌బీఐ
ఈనెల 8వ తేదీ నుంచి అదృశ్యమైపోయిన మలేషియన్ విమానం కేసులో.. ఆ విమాన పైలట్ భార్యను అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ప్రశ్నించబోతోంది. కెప్టెన్ జహారీ అహ్మద్ షా బహుశా ఈ విమానాన్ని హైజాక్ చేసి ఉండొచ్చన్న కథనాలు కూడా వస్తున్న నేపథ్యంలో ఆమెను ప్రశ్నించాలని ఎఫ్‌బీఐ నిర్ణయించింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఫైజా ఖాన్ త్వరలోనే ఎఫ్‌బీఐ దర్యాప్తు ఎదుర్కొంటారని డైలీ మిర్రర్ తన కథనంలో పేర్కొంది. కెప్టెన్ జహారీ అహ్మద్ షాతో పాటు కో పైలట్ ఫరీక్ అబ్దుల్ హమీద్ ఇద్దరి నేపథ్యం గురించి తెలుసుకోడానికి మలేషియన్ పోలీసులు, అమెరికన్ నిఘా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. (హిందూ మహాసముద్రంలో విమాన శకలాలు) కెప్టెన్ షా వ్యక్తిగత జీవితం చాలా సంక్లిష్టంగా ఉంటుందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అతడికి తన భార్యతో సంబంధాలేవీ లేవని, కేవలం పిల్లలతో కలిసి ఒకే ఇంట్లో జీవిస్తున్నారంతేనని ఆయన కుటుంబ మిత్రులు చెబుతున్నారు. ఇటీవల జైలుపాలైన ఓ విపక్ష నాయకుడికి కూడా ఈ పైలట్ గట్టి మద్దతుదారని అంటున్నారు. (మలుపు తర్వాతే పడిపోయిన మలేషియా విమానం) ఓ మహిళ తప్పుడు గుర్తింపు కార్డులతో ఓ మొబైల్ నెంబరు తీసుకుని, దాంతో విమానం బయల్దేరడానికి ముందు కెప్టెన్ షాతో రెండు నిమిషాల పాటు మాట్లాడిందని చెబుతున్న పోలీసులు.. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కెప్టెన్ జహారీ ఇంట్లో దొరికిన ఫ్లైట్ సిమ్యులేటర్ గురించి కూడా తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అందులోని వివరాలన్నింటినీ ఫిబ్రవరి 3వ తేదీనే డిలీట్ చేసేశారు. అందులో ఫ్లైట్ సిమ్యులేటర్కు సంబంధించిన గేమ్స్‌ను అతడు ఆడాడు. (మలేషియా విమానం మిస్టరీగా మిగలనుందా?) -
హిందూ మహాసముద్రంలో విమాన శకలాలు?
దక్షిణ హిందూ మహాసముద్రంలో మలేషియన్ విమానానికి సంబంధించిన శకలాల్లాంటి వస్తువులను చైనా విమానాలు గుర్తించాయి. దాంతో ఒక్కసారిగా మళ్లీ దాని గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి. తెల్లగా, నలుచదరంగా ఉన్న కొన్ని శకలాలను చైనాకు చెందిన ఇల్యుషిన్-76 గాలింపు విమానం గుర్తించింది. ఇవి బహుశా మలేషియా విమానం ఎంహెచ్ 370కి చెందినవేనని భావిస్తున్నారు. 95.1113 డిగ్రీల తూర్పు, 42.5453 దక్షిణంగా ఈ విమాన శకలాలు ఉన్నట్లు చైనాకు చెందిన ఐస్ బ్రేకర్ జుయెలాంగ్ నుంచి సమాచారం అందినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ సిన్హువా తెలిపింది. ఎంహెచ్ 370 విమానం గాలింపు చర్యల్లో పది విమానాలు ఉన్నట్లు ఆస్ట్రేలియన్ మారిటైం సేఫ్టీ అథారిటీ తెలిపింది. (విమానం ఆచూకీపై మరిన్ని ఆధారాలు) ఉదయం 8.45, 9.20 గంటల సమయంలో రెండు చైనా సైనిక విమానాలు బయల్దేరాయి. విమాన శకలాలు ఇవేనంటూ ఫ్రాన్సు కొత్తగా ఉపగ్రహ ఛాయాచిత్రాలు అందించడంతో ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేశారు. దక్షిణ హిందూ మహాసముద్రంలో తాము ఓ చెక్క కార్గో ప్యాలెట్‌ను గుర్తించినట్లు ఆస్ట్రేలియా చెప్పింది. (మలుపు తర్వాతే పడిపోయిన మలేషియా విమానం) దీంతో ఫ్రెంచి ఉపగ్రహం ఇచ్చినది ఈ విమానానికి సంబంధించిన సమాచారం కాదని స్పష్టమైంది. ప్రస్తుతం విమానం కోసం గాలిస్తున్న ప్రదేశానికి అది 850 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆస్ట్రేలియా ఉప ప్రధాని వారెన్ ట్రస్ చెప్పారు. ఏ చిన్న సమాచారం దొరికినా వెంటనే అందులో నిజానిజాలను పూర్తిగా నిర్ధారించుకుంటున్నామని, దానివల్ల తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తామని ఆయన అన్నారు. -
మలుపు తర్వాతే పడిపోయిన మలేషియా విమానం
మలేషియా విమానం అదృశ్యంపై రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. దక్షిణ చైనా సముద్రం మీదుగా ఆ విమానం మలుపు తీసుకుందని, సరిగ్గా ఆ తర్వాతే అది బాగా కిందకు పడిపోయిందని సైనిక రాడార్ సిగ్నళ్ల ద్వారా కొత్తగా తెలిసింది. రాడార్ పరిధి నుంచి అదృశ్యం అయిపోవడానికి ముందు సముద్ర మట్టానికి కేవలం 12వేల అడుగుల ఎత్తున మాత్రమే అది పయనించింది. విమానం ఆ మలుపు తీసుకోడానికి సుమారు రెండు నిమిషాల సమయం పట్టి ఉండొచ్చని, అప్పుడే ప్రమాదం సంభవించి, పైలట్ లేదా కో పైలట్ ప్రమాద సంకేతాలు పంపి ఉండొచ్చని అంటున్నారు. విమానం నుంచి ఎలాంటి ప్రమాద సంకేతాలు రాలేదని అధికారులు అంటున్నా.. అప్పటికే కమ్యూనికేషన్ వ్యవస్థ విఫలం కావడంతో ఆ సంకేతాలు అందకపోయి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. విమానం మలుపు తీసుకున్న ప్రాంతంలో విమాన ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంటుందని, బహుశా అక్కడ ట్రాఫిక్ కారణంగానే విమానం తక్కువ ఎత్తులో ప్రయాణించి ఉండొచ్చని కూడా నిపుణులు చెబుతున్నారు. చిట్టచివరిగా విమానం నుంచి సంకేతం అందేసరికి అది బీజింగ్ వైపు వెళ్తున్నట్లు మలేషియన్ అధికారులు చెప్పారు. అంటే అది హైజాక్ అవ్వడం లేదా దారి మళ్లడం లాంటిది ఏమీ లేదని అర్థమవుతోంది. కొత్తగా వచ్చిన వివరాల వల్ల విమానంలో ఏం జరిగి ఉండొచ్చని కొంత అంచనా అయితే వస్తోంది గానీ, విమానం ఎలా తప్పిపోయిందో మాత్రం ఇంకా తెలియట్లేదు. విమానం తప్పిపోయిన రోజున దాన్ని మిలటరీ రాడార్ తెల్లవారుజామున 1.19 నుంచి 2.40 గంటల మధ్య ట్రాక్ చేస్తూనే ఉందని, అయితే 12వేల అడుగుల కంటే తక్కువ ఎత్తుకు ఎప్పుడు పడిపోయిందో మాత్రం తెలియలేదని చెబుతున్నారు. -
సిములేటర్ ఫైళ్లు మాయం!
గల్లంతైన మలేసియా విమాన పైలట్ పరికరంలో డేటా తొలగింపు సిములేటర్‌లో భారత విమానాశ్రయాల రన్వేలు కౌలాలంపూర్/బీజింగ్/న్యూఢిల్లీ: మలేసియా బోయింగ్ విమానం ఎంహెచ్370 అదృశ్యంపై చిక్కుముడి వీడడం లేదు. బుధవారం 12వ రోజూ దాని ఆచూకీ లభించలేదు. మలేసియా అధికారులు మిస్టరీ ఛేదించడానికి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బోయింగ్‌ను నడిపిన పైలట్ జహరీ అహ్మద్‌షా(53) ఇంట్లోంచి స్వాధీనం చేసుకున్న విమాన నేవిగేషన్ సిములేటర్(మార్గనిర్దేశక అనుకరణ పరికరం)లోని కొన్ని ఫైళ్లను తొలగించినట్లు వారు కనుగొన్నారు. మిస్టరీ ఛేదించడానికి ఈ ఫైళ్ల సమాచారం కీలకం కానుందని భావిస్తున్నారు. సిములేటర్లోని కొంత సమాచారాన్ని గత నెల 3న తొలగించారని, దాన్ని పునరుద్ధరించేందుకు సైబర్, ఫోరెన్సిక్ నిపుణులు ప్రయత్నిస్తున్నారని మలేసియా రక్షణ, రవాణా మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ బుధవారం తెలిపారు. జహరీ, విమానంలోని ప్రయాణికులు దోషులుగా తేలేవరకు నిర్దోషులేనన్నారు. రష్యా, ఉక్రెయిన్ సహా ఇతర దేశాల ప్రయాణికుల నేపథ్యాన్ని పరిశీలించామని, అయితే అనుమానించాల్సిందేమీ బయటపడలేదని అన్నారు. సిములేటర్ డేటా తొలంగింపుపై పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఖాలిద్ బకర్ మరిన్ని వివరాలు తెలిపారు. జహారీ తన ఇంట్లోనే చేత్తో తయారు చేసిన ఈ సిములేటర్లోని అన్ని గేమ్ లాగ్స్(గేమ్స్ వినియోగ సమాచారం)ను ఫిబ్రవరి 3న తొలగించారన్నారు. సిములేటర్‌లో ఫ్లైట్ సిములేటర్ ఎక్స్, 9, ఎక్స్ ఫ్లైట్ సిములేటర్ అనే మూడు గేమ్స్ ఉండేవని తెలిపారు. ఏఎస్యూఎస్ డెరైక్ట్ సీయూఐఐ, ర్యాంపేజ్ 4 ఎక్స్ట్రీమ్ మదర్‌బోర్డు, ఆరు ఫ్లాట్ స్క్రీన్ మానిటర్లు వంటి అసెంబుల్డ్ కంప్యూటర్ హార్డ్‌వేర్‌తో ఈ సిములేటర్‌ను తయారు చేసినట్లు వెల్లడించారు. సిములేటర్‌లో ఐదు రన్వేలు: జహరీ సిములేటర్‌లో ఐదు విమానాశ్రయాలకు చెందిన వెయ్యి మీటర్లకుపైగా దూరమున్న రన్‌వేల చిత్రాలను అప్లోడ్ చేసినట్లు అధికారులు గుర్తించారని వార్తలు వచ్చాయి. ఈ విమానాశ్రయాల్లో మూడు భారత్, శ్రీలంకల్లోనివి. మిగతావి మాల్దీవుల రాజధాని మాలి, హిందూ మహాసముద్రంలోని అమెరికాకు చెందిన డీ గో గార్షియా దీవిలోనివి. తక్కువ ఎత్తులో ఎగిరిన విమానం.. ఎంహెచ్ 370 అదృశ్యమైన ఈ నెల 8న ఉదయం 6.15 గంటలకు తమ ప్రాంతంలో తక్కువ ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని చూశామని మాల్దీవుల్లోని మారుమూల ద్వీపమైన కుడా హుబధూ వాసులు చెప్పారు. మలేసియా ఎయిర్‌లైన్స్ విమానాల మాదిరే ఇదీ తెల్లరంగులో, ఎరుపు చారలతో ఉందని, ఉత్తరం నుంచి ఈశాన్యదిశగా మాల్దీవుల్లోని అద్దూ ద్వీపంవైపు భీకర శబ్దం చేసుకుంటూ వెళ్లిందన్నారు. అయితే మలేసియా మంత్రి హుస్సేన్ దీన్ని తోసిపుచ్చారు. గల్లంతైన విమానానికి సంబంధించి మొదటి విడత బీమాను చెల్లించామని జర్మనీకి చెందిన అలియంజ్ బీమా కంపెనీ తెలిపింది. అండమాన్ దీవులపై..: హైదరాబాద్ ఐటీ నిపుణుడు మలేసియా విమానం గల్లంతైన ఈ నెల 8న అండమాన్ దీవుల మీదుగా పెద్ద విమానం వెళ్లినట్లు శాటిలైట్ చిత్రంలో కనిపించిందని హైదరాబాద్‌కు చెందిన అనూప్ మాధవ్ యెగ్గిన (29) అనే ఐటీ నిపుణుడు చెప్పారు. తక్కువ ఎత్తులో వె ళ్లిన ఈ విమానం అదృశ్యమైన మలేసియా విమానమేనని భావిస్తున్నానన్నారు. -
ఆల్ రైట్.. గుడ్‌నైట్!
-
9/11 తరహా దాడి కోసమే మలేసియా విమానం హైజాక్?
-
టార్గెట్ భారత్!
9/11 తరహా దాడి కోసమే మలేసియా విమానం హైజాక్? వాషింగ్టన్/కౌలాలంపూర్/న్యూఢిల్లీ: మలేసియా విమానం గల్లంతు.. తొమ్మిది రోజులుగా అంతుచిక్కకుండా అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్న ఉదంతం..! విమానాన్ని హైజాక్ చేశారని, కాదు.. అది ఎక్కడో కూలిపోయిందని.. ఇలా ఎన్నో అనుమానాలు, వాదనలు.. విశ్లేషణలు! వీటికి తాజాగా ‘అల్ కాయిదా దాడి’ కోణం తోడవడం తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. విమానాన్ని ఉగ్రవాదులు భారత్‌పై ’9/11’ తరహా దాడి కోసం హైజాక్ చే శారని నిపుణులు అనుమానిస్తున్నారు. విమానం ప్రయాణించిన దిశ, దాని ఇంధన సామర్థ్యం, ప్రయాణ దూరం, విమాన ఆచూకీ కోసం గాలింపు జరుపుతున్న ప్రాంతాలు మొదలైనవన్నీ దీనికి బలం చేకూరుస్తున్నాయంటున్నారు. హిందూ మహాసముద్రం దిశగా.. మలేసియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం ఎంహెచ్ 370 ఐదుగురు భారతీయులు సహా 239 మందితో ఈ నెల 8న మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు వెళ్తూ బయల్దేరిన గంటకే అదృశ్యమవడం తెలిసిందే. ఇది మలక్కా జలసంధి ప్రాంతంపై చివరిసారిగా రాడార్‌పై కనిపించింది. బోయింగ్‌లోని కమ్యూ నికేషన్ వ్యవస్థ, రేడియో సిగ్నళ్ల ట్రాన్స్‌పాండర్‌ను ఎవరో ఉద్దేశపూర్వకంగా స్విచాఫ్ చేసి విమానాన్ని దారి మళ్లించినట్లు మలేసియా సైనిక రాడార్ విశ్లేషణలో తేలింది. విమానాన్ని నిర్దేశిత దిశకు భిన్నంగా పశ్చిమానికి, అంటే హిందూ మహాసముద్ర దిశకు మళ్లించడం, ట్రాన్స్‌పాండర్‌ను స్విచాఫ్ చేసిన వ్యక్తులు విమాన ప్రయాణ వివరాలను తెలిపే బ్లాక్ బాక్స్‌నూ నాశనం చేసే అవకాశముండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ సమాచారాన్ని విశ్లేషిస్తే.. అల్ ఖాయిదా ఉగ్రవాదులు అమెరికాలో చేసిన 9/11 తరహా దాడిని భారత్‌లో జరిపేందుకు హైజాక్ చేసి ఉంటారనే అనుమానం కలుగుతోందని అమెరికా విదేశాంగ శాఖ మాజీ డిప్యూటీ సెక్రటరీ, విదేశీ విధాన నిపుణుడు స్ట్రోబ్ టాల్బట్ పేర్కొన్నారు. ‘విమాన గమన దిశ, ఇంధనం, ప్రయాణ పరిధిని గమనిస్తే హైజాకర్లు ఏదో ఒక భారత నగరంపై దాడికి పథకం వేశారనే అనుమానానికి తావిస్తోంది’ అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. బోయింగ్‌ను ఉద్దేశపూర్వకంగానే దారి మళ్లించి ఉంటే మరో ‘9/11’ దిశగా అనుమానానించాలని ఇండోనేసియాకు చెందిన స్వతంత్ర విమానయాన విశ్లేషకుడు జెర్రీ సోయెజాట్నాన్ అన్నారు. భారత్ తీరంలోనూ గాలింపు.. విమానం భారత్ సమీప బంగాళాఖాతంలో కూలిపోయి ఉంటుందన్న అమెరికా వైమానిక నిపుణుల వాదన భారత్‌పై ‘ఉగ్రదాడి’ కుట్రకు బలమిస్తోంది. గాలింపు పరిధిని చెన్నైకి 300 కి.మీ దూరంలోని ప్రాంతానికీ విస్తరించడం, అన్వేషణలో భారత్ చురుగ్గా పొల్గొనడంఒ చూస్తే హైజాకర్లు విమానాన్ని భారత్ దిశగా తీసుకెళ్తేందుకు ప్రయత్నించారన్న అనుమానం కలుగుతోంది. ‘ఉగ్ర’కోణం బయటపడిన నేపథ్యంలో భారత్ ఆదివారం గాలింపు చర్యను నిలిపేసి ఆ దిశగా దర్యాప్తునకు సిద్ధమవుతోంది. పైలట్ ప్రతీకారమా? విమానం గల్లంతు వెనుక ఉగ్రకోణంతోపాటు పైలట్ పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమానం హైజాక్ అయిందనడానికి దాన్ని నడిపిన పైలట్ జహరీ అహ్మద్‌షా(53) నేపథ్యం బలమిస్తోందని నిపుణులు అంటున్నారు. 18 వేల గంటలపాటు విమానాలను నడిపిన అనుభవమున్న జహరీ మలేసియా విపక్షనేత అన్వర్ ఇబ్రహీమ్‌కు గట్టి మద్దతుదారుడు, బలమైన రాజకీయ విశ్వాసాలున్న సామాజిక కార్యకర్త. ఇబ్రహీమ్‌కు ఓ కేసులో ఈ నెల 7న మలేసియా కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించినప్పుడు జహరీ కోర్టు విచారణకు హాజరయ్యాడని సమాచారం. తన అభిమాన నేతకు శిక్ష పడడంతో అతడు ఆవేశానికి లోనై, రాజకీయ ప్రతీకారం కోసం హైజాక్‌కు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్వర్‌కు శిక్షపడిన కొన్ని గంటలకే జహరీ విమానమెక్కడం గమనార్హం! అతని ఇంట్లో సోదా చేసిన పోలీసులకు విమాన నేవిగేషన్‌కు చెందిన సిములేటర్(చేతితో చేసిన అనుకరణ పరికరం)తోపాటు రెండు ల్యాప్‌టాప్‌లు దొరికాయి. సాధారణంగా ట్రైనీ పైలట్ల వద్ద ఉంటే సిములేటర్ సుదీర్ఘ అనుభవ మున్న జహరీ వద్ద ఎందుకుందనేది అంతుబట్టడం లేదు. జహరీ, అతని కోపైలట్ ఫరీక్ హమీద్‌లు తామిద్దరం కలిసి విమానం నడుపుతామని కోరలేదని మలేసియన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఫరీక్ ఇంట్లోనూ సోదాలు చేశామని, అయితే అక్కడేమీ దొరకలేదని పోలీసులు చెప్పారు. కొత్త విషయాలు తెలుస్తుండడంతో విమానంలోని ప్రయాణికుల వ్యక్తిగత వివరాలను వారి బంధువులనుంచి సేకరిస్తున్నామని, ఇంతవరకు ఎలాంటి అనుమానాస్పద అంశాలూ వెలుగుచూడలేదని అన్నారు. విమానంలో ప్రయాణించిన ఐదుగురు భారతీయులకు నేరచరిత్ర లేదని భారత నిఘా వర్గాలు చెప్పాయి. మన్మోహన్‌కు మలేసియా ప్రధాని ఫోన్ విమానం గాలింపునకు సాంకేతిక సాయం అందించాలని మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ ఆదివారం భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఫోన్ చేశారు. అన్ని రకాల సాయం చేస్తామని మన్మోహన్ హామీ ఇచ్చారు. సాయం కోసం రజాక్ బంగ్లాదేశ్, కజకిస్థాన్, తుర్క్మెనిస్థాన్ తదితర దేశాల నేతలకు కూడా ఫోన్ చేశారు. గాలింపులో పాల్గొంటున్న దేశాల సంఖ్య ఆదివారానికి 25కు చేరింది. 9/11 అనుమానాన్ని తోసిపుచ్చిన భారత్ మలేసియా విమానాన్ని భారత్‌పై 9/11 తరహా దాడికి హైజాక్ చేసి ఉండొచ్చన్న అనుమానాన్ని భారత వాయుసేనతోపాటు వైమానిక నిపుణులు కూడా తోసిపుచ్చారు. ఆ విమానం భారత గగనతలంలోకి ప్రవేశించి ఉంటే తమ శక్తిమంతమైన రాడార్లు దాన్ని కచ్చితంగా పసిగట్టగలిగి ఉండేవన్నారు. 9/11 తరహా దాడి అనుమానాన్ని మలేసియా అధికారులు కూడా తోసిపుచ్చారు.