అత్యంత ప్రకాశమైన గెలాక్సీలు! | Most bright galaxies! | Sakshi
Sakshi News home page

అత్యంత ప్రకాశమైన గెలాక్సీలు!

Published Thu, Mar 24 2016 2:11 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

Most bright galaxies!

వాషింగ్టన్: విశ్వంలోనే అత్యంత ప్రకాశవంతమైన పాలపుంతలను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే వీటిని ప్రచండ ప్రకాశవంతమైన పాలపుంత అని అభివర్ణిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఏ పాలపుంత కూడా వెలుగులు విరజిమ్మే విషయంలో ఇప్పుడు కనుగొన్న వాటితో సరిపోలదు అని అమెరికాలోని మసాచుసెట్స్ అమ్‌హరెస్ట్ వర్సిటీ విద్యార్థి కెవిన్ హరింగ్టన్ పేర్కొన్నాడు.

నక్షత్రాల పుట్టుకను అధ్యయనం చేసే 50 మీటర్ల వ్యాసం ఉన్న టెలిస్కోప్ సాయంతో ఈ పాలపుంతను అధ్యయనం చేసినట్లు చెప్పాడు. ఈ పాలపుంతలకు వెయ్యి కోట్ల ఏళ్ల వయసుఉంటుందని, అయితే అవి మాత్రం విశ్వం ఏర్పడిన 400 కోట్ల ఏళ్ల తర్వాతే ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. ఇవి చాలా పెద్దగా, చాలా ప్రకాశవంతంగా ఉన్నాయని, ప్రొఫెసర్ యున్ చెబుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement