Astronomy scientists
-
ఎవరీ ప్రియంవదా నటరాజన్? ఏకంగా టైమ్ మ్యాగజైన్లో..!
ఈ ఏడాది టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారతీయ మహిళ ఖగోళ శాస్త్రవేత్త ప్రియంవదా నటరాజన్ కూడా ఉన్నారు. టైమ్ మ్యాగజైన్ ఈసారి, నాయకులు, స్పూర్తిదాయమైనవాళ్లు, ఆయా రంగాల్లో ప్రఖ్యాతి గాంచిన వారుగా వర్గీకరించి మరీ వందమంది ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ఈసారి ఆ జాబితాలో చాలామంది ప్రతిభావంతులైన భారతీయలకు స్థానం లభించడం విశేషం. ఈ జాబితాలో భారత సంతతి మహిళ శాస్త్రవేత్తకు ఎలా చోటు దక్కిందంటే.. ఆమెకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు.. భారత సంతతి అమెరికన్ అయిన ప్రియంవద నటరాజన్ యేల్ యూనివర్సిటీలో భారతీయ ప్రొఫెసర్. ఆమె అక్కడ ఖగోళ శాస్త్ర విభాగానికి అధ్యక్షురాలు, మహిళా ఫ్యాకల్టీ ఫోరమ్ చైర్పర్సన్ కూడా. ఆమె ప్రాథమిక విద్య ఢిల్లీ పబ్లిక స్కకూల్‌లో పూర్తి చేశారు. ఆ తర్వాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసింది. తదనంతరం నటరాజన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీలో పీహెచ్డీ పూర్తి చేసింది. ఆ టైంలోనే ఆమె ప్రతిష్టాత్మకమైన ఐజాక్ న్యూటన్ విద్యార్థిని, ట్రినిటీ కళాశాలలో సహచరురాలు కూడా. ఆమె ఎక్కువగా మాసివ్ బ్లాక్‌హోల్స్‌పై విస్తృతంగా పరిశోధనలు చేసింది. 2022లో లిబర్టీ సైన్స్ సెంటర్ జీనియస్ అవార్డుని గెలుచుకుంది. అంతేగాదు మెరికన్ ఫిజికల్ సొసైటీ (ఏపీఎస్), అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ (ఏఏఏఎస్), గుగ్గెన్‌హీమ్ ఫౌండేషన్ మరియు రాడ్‌క్లిఫ్ ఇన్స్టిట్యూట్ వంటి అనేక సంస్థల నుంచి ఫెలోషిప్‌లు అందుకుంది. అలాగే 2016లో వచ్చిన 'మ్యాపింగ్ ది హెవెన్స్: ది రాడికల్ సైంటిఫిక్ ఐడియాస్ దట్ రివీల్ ది కాస్మోస్'రాసింది కూడా ప్రియంవదానే. (చదవండి: టైమ్ మ్యాగజైన్లో ఇద్దరు బారతీయ అమెరికన్లకు చోటు..!) -
ఖగోళ రహస్యాలను చేధించిన ఎడ్విన్ హబుల్.. టెలిస్కోప్‌తో ఎన్నో ఆవిష్కరణలు
ఖగోళ వింతలను తెలుసుకోవాలన్న ఆసక్తి ఎవరికి మాత్రం ఉండదు? టెలిస్కోప్ ఆవిష్కణలతో ఆకాశ వింతల్ని దగ్గరన్నుంచి చూసి విశ్వం రసహ్యాలను తెలుసుకోవచన్న సంగతి తెలిసిందే. ఇలా ఇప్పటికే చాలా టెలిస్కోప్‌లు ఉన్నాయి. కానీ చరిత్రలో కొన్ని టెలిస్కోపులకు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. అందులో ఒకటి హబుల్ టెలిస్కోప్. విశ్వ రహస్యాలను మన కళ్లముందు ఉంచడంతో పాటు అంతరిక్షంలో బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సంకేతాలను కూడా పట్టుకోగలదు. . ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్ గౌరవార్థం హబుల్ స్పేస్ టెలిస్కోప్‌కు ఆ పేరు పెట్టారు. ఇవాళ(సోమవారం)ఆయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ. అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త అయిన ఎడ్విన్ హబుల్ నవంబర్ 20, 1889లో మిస్సౌరీలోని మార్ష్‌ఫీల్డ్‌లో జన్మించాడు. 1910లో అతను చికాగో విశ్వవిద్యాలయం నుంచి చదువు పూర్తిచేశాడు.ఖగోళ శాస్త్రంలో అనేక అధ్యయనాలు చేసి విశేష గుర్తింపు పొందాడు. గెలాక్సీలను అధ్యయనం చేయడంలో హబుల్ ఆవిష్కరణలు ఎంతో ఉపయోగపడ్డాయి. 1923లో నెబ్యులాలో సెఫీడ్ వేరియబుల్స్ అని పిలువబడే ఒక రకమైన నక్షత్రాన్ని కనుగొన్నాడు, నెబ్యులా అనేక వందల వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని (పాలపుంత గెలాక్సీ వెలుపల) ఇది మరొక గెలాక్సీ అని హబుల్ నిర్ధారించాడు. విశ్వంలో అనేక గెలాక్సీలు ఉన్నాయని తన పరిశోధనల ద్వారా కనుగొన్నాడు. గెలాక్సీల రెడ్‌షిఫ్ట్, దూరం మధ్య స్థిరమైన సంబంధాన్ని కనుగొనడం ద్వారా విశ్వం విస్తరిస్తోంది అని నిరూపించాడు. ఇక హబుల్ పేరుమీద హబుల్ స్పేస్ టెలిస్కోప్ అని పేరు పెట్టారు. ఇది హబుల్ స్పేస్ టెలిస్కోప్..ఇది అంతరిక్షంలోకి పంపిన మొట్టమొదటి ప్రధాన ఆప్టికల్ టెలిస్కోప్. 1990లో దీన్ని ప్రయోగించారు. ఎడ్విన్ హబుల్ గౌరవార్థం టెలిస్కోప్‌కు ఆ పేరు పెట్టారు. విశ్వం పరిమాణమెంతో అంచనా కట్టేందుకు మొదలుకొని,నక్షత్రాలు, గ్రహాల పుట్టుక వంటివెన్నో విషయాలను అంచనా వేయడానికి హబుల్ టెలిస్కోపు పరిశోధనలు కీలకపాత్ర వహించాయి. సౌరకుటుంబం అవతల ఉన్న గ్రహాల రూపురేఖలు, వాటిల్లో ఉండే రసాయనాల వివరాలు తెలిసింది కూడా హబుల్ తీసిన ఫొటోల ఆధారంగానే. కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరం వరకూ చూడగల సామర్థ్యమున్న హబుల్ టెలిస్కోపు నక్షత్రాలు ఎంత వేగంగా కదులుతున్నాయో కూడా ఫోటోలు తీసి పంపించింది. వీటి ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ విశ్వం వయసు 1300 నుంచి 1400 కోట్ల సంవత్సరాల వరకూ ఉంటుందని అంచనా కట్టగలిగారు.ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న గ్రహాన్ని తొలిసారి నేరుగా ఫొటో తీయగలిగింది కూడా ఈ టెలిస్కోప్ ద్వారానే. -
అత్యంత ప్రకాశమైన గెలాక్సీలు!
వాషింగ్టన్: విశ్వంలోనే అత్యంత ప్రకాశవంతమైన పాలపుంతలను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే వీటిని ప్రచండ ప్రకాశవంతమైన పాలపుంత అని అభివర్ణిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఏ పాలపుంత కూడా వెలుగులు విరజిమ్మే విషయంలో ఇప్పుడు కనుగొన్న వాటితో సరిపోలదు అని అమెరికాలోని మసాచుసెట్స్ అమ్హరెస్ట్ వర్సిటీ విద్యార్థి కెవిన్ హరింగ్టన్ పేర్కొన్నాడు. నక్షత్రాల పుట్టుకను అధ్యయనం చేసే 50 మీటర్ల వ్యాసం ఉన్న టెలిస్కోప్ సాయంతో ఈ పాలపుంతను అధ్యయనం చేసినట్లు చెప్పాడు. ఈ పాలపుంతలకు వెయ్యి కోట్ల ఏళ్ల వయసుఉంటుందని, అయితే అవి మాత్రం విశ్వం ఏర్పడిన 400 కోట్ల ఏళ్ల తర్వాతే ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. ఇవి చాలా పెద్దగా, చాలా ప్రకాశవంతంగా ఉన్నాయని, ప్రొఫెసర్ యున్ చెబుతున్నాడు.