అత్యంత ప్రకాశమైన గెలాక్సీలు!
వాషింగ్టన్: విశ్వంలోనే అత్యంత ప్రకాశవంతమైన పాలపుంతలను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే వీటిని ప్రచండ ప్రకాశవంతమైన పాలపుంత అని అభివర్ణిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఏ పాలపుంత కూడా వెలుగులు విరజిమ్మే విషయంలో ఇప్పుడు కనుగొన్న వాటితో సరిపోలదు అని అమెరికాలోని మసాచుసెట్స్ అమ్హరెస్ట్ వర్సిటీ విద్యార్థి కెవిన్ హరింగ్టన్ పేర్కొన్నాడు.
నక్షత్రాల పుట్టుకను అధ్యయనం చేసే 50 మీటర్ల వ్యాసం ఉన్న టెలిస్కోప్ సాయంతో ఈ పాలపుంతను అధ్యయనం చేసినట్లు చెప్పాడు. ఈ పాలపుంతలకు వెయ్యి కోట్ల ఏళ్ల వయసుఉంటుందని, అయితే అవి మాత్రం విశ్వం ఏర్పడిన 400 కోట్ల ఏళ్ల తర్వాతే ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. ఇవి చాలా పెద్దగా, చాలా ప్రకాశవంతంగా ఉన్నాయని, ప్రొఫెసర్ యున్ చెబుతున్నాడు.