కూతురి కడుపులో ఏలికపాములు పెంచింది!! | mother force fed tapeworms to daughter before beauty pegant | Sakshi
Sakshi News home page

కూతురి కడుపులో ఏలికపాములు పెంచింది!!

Published Sat, Aug 23 2014 10:39 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 PM

కూతురి కడుపులో ఏలికపాములు పెంచింది!!

కూతురి కడుపులో ఏలికపాములు పెంచింది!!

అందాలపోటీల్లో ఎలాగైనా తన కూతురు గెలవాలన్న లక్ష్యంతో.. ఆమె సన్నబడాలని ఓ తల్లి కూతురి కడుపులో ఏకంగా ఏలికపాములు పెంచింది! తట్టుకోలేని కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రిలో చేర్చగా... వైద్యులు ఆమెకు పరీక్షలు చేస్తే ఈ విషయం తేలింది. తొలుత ఆమె గర్భవతేమోనని అక్కడి నర్సులు భావించారు. కానీ, అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేస్తే గర్భవతి కాదని, పేగులు బాగా వాచి ఉన్నాయని తెలిసింది. ఆమెకు మందులు వేసి టాయిలెట్కు తీసుకెళ్తే అక్కడ మొత్తం ఏలికపాములే బయటకు వచ్చాయి. అప్పుడు ఆమె కడుపునొప్పికి అసలు కారణం తెలిసింది. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. ఆమె కడుపులో చాలా ఎక్కువ సంఖ్యలో ఏలికపాములు ఉన్నాయని యువతికి చికిత్స చేసిన నర్సు మారికర్ కాబ్రాల్ ఓసోరియో తెలిపింది. ఆమె ఈ విషయాన్ని 'అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ద ఈఆర్' అనే టీవీ కార్యక్రమంలో చెప్పింది.

ఏలికపాములు చాలా పెద్దగా ఉన్నాయని, అవి టాయిలెట్లోంచి బయటకు రావడానికి కూడా ప్రయత్నించాయని ఆ నర్సు తెలిపింది. డిస్కవరీ ఛానల్కు చెందిన 'ఫిట్ అండ్ హెల్త్' అనే కార్యక్రమంలో ఈ షో ప్రసారమైంది. ఆ తల్లి మెక్సికో నుంచి ఏలికపాముల గుడ్లు తీసుకొచ్చి, తన కూతురితో బలవంతంగా తినిపించినట్లు తేలింది. అందాలపోటీలలో పాల్గొనడానికి ముందు సన్నబడాలనే ఆమె ఇలా చేసిందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement