తల నరికి.. గుండె పెకలించి! | MS-13 gang 'beheads man and rips out his heart' | Sakshi
Sakshi News home page

తల నరికి.. గుండె పెకలించి!

Published Fri, Nov 24 2017 3:22 AM | Last Updated on Thu, Apr 4 2019 3:49 PM

MS-13 gang 'beheads man and rips out his heart' - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో అత్యంత కిరాతక ముఠాగా పేరుగాంచిన మారా సాల్వట్రూచా(ఎంఎస్‌–13) ఓ గుర్తుతెలియని వ్యక్తిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తొలుత సదరు వ్యక్తి తలను నరికేసిన దుండగులు తర్వాత అతని గుండెను శరీరం నుంచి పెకలించారు. అనంతరం దాదాపు 100 సార్లు కత్తులతో పొడిచి వాషింగ్టన్‌కు సమీపంలోని వీటన్‌ పార్క్‌లో గొయ్యి తవ్వి పాతిపెట్టినట్లు మాంటిగోమరి కౌంటీ పోలీస్‌ విభాగం బుధవారం తెలిపింది.

ఈ దాడిలో 10 మందికి పైగా ఎంఎస్‌ ముఠా సభ్యులు పాల్గొన్నట్లు వెల్లడించింది. ఈ హత్యకు రెండు వారాల ముందే దుండగులు ప్రణాళిక రచించినట్లు పేర్కొంది. ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు సెప్టెంబర్‌లో శవాన్ని పాతిపెట్టిన చోటు వివరాలను ఓ ఇన్ఫార్మర్‌ అందించాడని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి మిగుయెల్‌ ఏంజెల్‌ లోపెజ్‌(19), ఎంఎస్‌–13 ముఠాకు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అమెరికాలో ఎంఎస్‌–13 ముఠాలో దాదాపు 10,000 మంది సభ్యులున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement