పాక్ ప్రధానితో మోదీ భేటీ | narendra modi meets nawaz sharif | Sakshi
Sakshi News home page

పాక్ ప్రధానితో మోదీ భేటీ

Published Fri, Dec 25 2015 6:06 PM | Last Updated on Tue, Aug 21 2018 9:39 PM

పాక్ ప్రధానితో మోదీ భేటీ - Sakshi

పాక్ ప్రధానితో మోదీ భేటీ

లాహోర్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్తో సమావేశమయ్యారు. శుక్రవారం సాయంత్రం లాహోర్లోని షరీఫ్ నివాసంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై మోదీ, షరీఫ్ చర్చిస్తున్నారు.  

ఆప్ఘనిస్తాన్ నుంచి సాయంత్రం 4:45 గంటలకు మోదీ లాహోర్ విమానాశ్రయంలో దిగారు. లాహోర్ విమానాశ్రయంలో నవాజ్ షరీఫ్ సాదరంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి మోదీ, షరీఫ్ కలిసి ఓ ప్రత్యేక హెలికాప్టర్లో షరీఫ్ వ్యక్తిగత నివాసానికి వెళ్లారు. 1700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ ఇంట్లోనే నవాజ్ షరీఫ్ మనవరాలి పెళ్లి కూడా శుక్రవారమే జరుగుతోంది. కాగా.. అక్కడ షరీఫ్తో సమావేశం పూర్తయిన తర్వాత మోదీ భారత్కు బయల్దేరుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement