హబుల్ స్పేస్ టెలిస్కోప్
వాషింగ్టన్ : విశ్వ పరిణామక్రమాన్ని తెలుసుకునే దిశగా నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ కొత్త తలుపులు తెరిచింది. ఈ టెలిస్కోప్ విశ్వంలో సుదూరంలో ఉన్న 15 వేల గెలాక్సీల్లో ఉన్న 12 వేల నక్షత్రాల ఆవిర్భావానికి సంబంధించి సంపూర్ణ ఛాయా చిత్రాలను తీసి పంపింది. నక్షత్రాల పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకునేందుకు ఇవి సహాయపడతాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బిగ్‌బ్యాంగ్ విస్ఫోటనం తర్వాత 300 కోట్ల ఏళ్ల కింద, అంటే ఇప్పటికి 11 వందల కోట్ల ఏళ్ల కిందట నక్షత్రాలు ఆవిర్భవించిన తీరును ఈ చిత్రాల ద్వారా తెలుసుకోవచ్చట! హబుల్ స్పేస్ టెలిస్కోప్‌లో వాడుతున్న అతినీలలోహిత కిరణాల సహాయంతో విశ్వం గుట్టు విప్పడం సాధ్యం కాకపోవడంతో పరారుణ, గోచర కిరణాల పరిజ్ఞానం కలిగిన ఇతర టెలిస్కోప్‌ల సాంకేతికతను దానికి జోడించారు. అనంతరం ఈ కిరణాలను విశ్వంతరాల్లోకి పంపి నక్షత్రాల సంపూర్ణ ఛాయా చిత్రాలను తీశారు.
Comments
Please login to add a commentAdd a comment