![This NASA probe got closer to the Sun than any other spacecraft - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/31/parker.jpg.webp?itok=6GAQtGfv)
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన ‘పార్కర్’ అంతరిక్ష నౌక సూర్యుడికి అతి సమీపంలోకి వెళ్లి రికార్డు సృష్టించింది. మానవుడు తయారు చేసిన ఓ వస్తువు సూర్యుడికి చాలా సమీపానికి వెళ్లడం ఇదే తొలిసారని నాసా వెల్లడించింది. అంతరిక్ష వాతావరణంపై సూర్యుడి ఉపరితల వాతావరణం చూపే ప్రభావం తదితర రహస్యాలను చేధించేందుకు ఈ ఏడాది ఆగస్టు 12న ‘పార్కర్’ను ప్రయోగించారు.
అక్టోబర్ 29 నాటికి సూర్యుడి ఉపరితలానికి ఈ పార్కర్ 4.2 కోట్ల మైళ్ల దూరంలో ఉన్నట్లు పార్కర్ సోలార్ ప్రోబ్ బృందం లెక్కించింది. 1976 ఏప్రిల్‌లో జర్మన్–అమెరికన్ హీలియోస్–2 అంతరిక్ష నౌక సూర్యుడికి సమీపంలోకి వెళ్లి రికార్డు సృష్టించింది. పార్కర్ దూసుకెళ్తున్న కొద్దీ తన రికార్డును తానే బద్దలు కొడుతుందని, చివరికి సూర్యుడికి 61.6 లక్షల కిలోమీటర్ల దూరంలో ఆగుతుందని, 2024లో ఈ అద్భుతం చోటు చేసుకునే అవకాశం ఉందని నాసా వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment