
హూస్టన్: అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా పంపిన జునో వ్యోమనౌక గురుగ్రహం పై అద్భుతమైన ఫొటోలను తీసింది. సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహమైన గురుడు కక్ష్యలోకి చేరినప్పటి నుంచి అక్కడి విశేషాలను జునో అందిస్తూనే ఉన్నది. దీని సాయంతో గత ఏడాది నుంచి గురు గ్రహానికి సంబంధించి సరికొత్త విషయాలు తెలుస్తున్నాయి.
తాజాగా గురు గ్రహ వాతావరణానికి చెందిన ఓ కళ్లు చెదిరే ఫొటోను జునో తీసింది. దీనిని నాసా ఇప్పుడు బయటపెట్టింది. ఈ ఫొటో తీసిన సమయంలో జూపిటర్‌కు చాలా దగ్గరగా జునో ఉంది. గురు గ్రహానికి ఉత్తర దిక్కుగా 13,345 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఆ గ్రహంపై ఉన్న మేఘాలను చిత్రీకరించింది. డిసెంబర్ 16న ఈ ఫొటో తీసినట్లు నాసా తాజాగా వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment