భారత్ చేరుకున్న ప్రచండ
కాట్మండు: నేపాల్ ప్రధాని ప్రచండ నాలుగు రోజుల పర్యటన కోసం గురువారం భారత్ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆయనకు స్వాగతం పలికారు. ప్రధానిగా రెండో పర్యాయం ఎన్నికయ్యాక ఆయన చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే. శుక్రవారం ప్రధాని మోదీతో ప్రచండ భేటీ కానున్నారు. రాష్ట్రపతి ప్రణబ్, కేంద్ర మంత్రులతోనూ సమావేశమవుతారు. ఆదివారం స్వదేశానికి బయల్దేరుతారు. నేపాల్ రాజ్యాంగ రూపకల్పన ప్రక్రియలో ఎలాంటి సూచనలు చేయలేదని భారత్ తెలిపింది. మధేసీలు, తారులు, జంజాటీలను విశ్వాసంలోకి తీసుకోనంత వరకు నూతన రాజ్యాంగాన్ని అమలు చేసే వాతావర ణం కల్పించడం సాధ్యం కాదని ప్రచండ అన్నారు.