ఇస్లామాబాద్: భారత్‌తో చర్చలు కావాలో లేక వేర్పాటువాద కాశ్మీరీ నాయకులు కావాలో పాకిస్థాన్ తేల్చుకోవాలని భారత రక్షణమంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై గురువారం పాక్ తీవ్రంగా స్పందించింది. చర్చల ప్రక్రియలో ఎలాంటి షరతులు తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టంచేసింది. కాశ్మీరులో ఉంటున్న వారు భారతీయ వేర్పాటు వాదులు కాదని, వివాదస్పద భూభాగంలో నానావస్థలు పడుతూ తమ హక్కు కోసం ఉద్యమిస్తున్న ప్రజలని పాక్ పేర్కొంది.
వేర్పాటువాదులతో మంతనాలా? భారత ప్రభుత్వంతో చర్చలు జరపాలో పాకిస్థాన్ ముందుగా తేల్చుకోవాలని కేంద్ర రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రెండు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయిలో చర్చలకు మార్గం సుగమం అయిన కొన్ని గంటలముందే న్యూఢిల్లీలోని పాక్ హైకమిషనర్ కాశ్మీర్ వేర్పాటువాదులతో మంతనాలు జరపటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఇలాంటి వాతారణం చర్చలకు సరైంది కాదని తెలిపారు. మనదేశంతో మంచి సంబంధాలు నెల కొల్పుకునే అంశం పాకిస్థాన్‌నే తేల్చుకోవాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు.
చర్చలకు షరతులు ఒప్పుకోం: పాక్
Published Fri, Nov 7 2014 5:05 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM
Advertisement