మాస్కో : ఉత్తరకొరియాతో యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమరశంఖం పూరించారని, అమెరికాను వదిలే ప్రసక్తే లేదని కొరియా విదేశాంగ శాఖ మంత్రి వ్యాఖ్యానించారు. ఈ మేరకు రష్యన్ మీడియా ఓ కథనాన్ని వెలువరించింది. అమెరికా మంటల్లో కాలి బూడిదయ్యేలా చేస్తామని రి యాంగ్ హో తీవ్రంగా మాట్లాడినట్లు పేర్కొంది.
తమ దేశం చేస్తున్న అణు పరీక్షలతో ప్రపంచదేశాలకు ఎలాంటి ముప్పు వాటిల్లదని ఆయన పేర్కొన్నట్లు చెప్పింది. దీని గురించి పదే పదే చర్చించాల్సిన పని లేదని కూడా ఆయన వ్యాఖ్యానించినట్లు వివరించింది. యూఎన్‌లో ట్రంప్ వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడుతూ యుద్ధం అనే అగ్గిని రాజేసింది అగ్రరాజ్యమేనని అన్నట్లు చెప్పింది. అణు ఆయుధాల గురించి తాము ఎవరితోనూ.. ఎలాంటి చర్చలకు సిద్ధంగా లేమని హో పేర్కొన్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment