సియోల్ : అమెరికా.. కుట్రపూరితంగానే ఆరోపణలు చేస్తోందని ఉత్తర కొరియా మండిపడింది. అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టేలా అమెరికా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాన్ని భయపెట్టిన వాన్నాక్రై అనే ర్యాన్సమ్‌వేర్‌ను ఉత్తర కొరియా ప్రయోగించిందని అమెరికా పేర్కొన్న సంగతి తెలిసిందే. అమెరికా చేసిన ఈ ఆరోపణలపై ఉత్తర కొరియా తీవ్రంగా ప్రతిస్పందించింది. అమెరికా ఇటువంటి చర్యలకు దిగితే.. ప్రతీకార చర్యలకు దిగేందుకు వెనుకాడమని హెచ్చరించింది.
ఉత్తర కొరియా ఎటువంటి ర్యాన్స్‌మ్‌వేర్లను ప్రయోగించలేదని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. అమెరికా ఇప్పటికైనా ఇటువంటి నిరాధారమైన అరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. మరోసారి ఇటువంటివి ఉత్పన్నయితే తాము తీసుకునే చర్యలకు అమెరికానే బాధ్యత వహించాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment