వాషింగ్టన్: భారత్ ప్రధాని నరేంద్రమోదీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి ఒకే వేదికపైకి రానున్నారు. ఈ నెల 30న ఐక్యరాజ్యసమితి నిర్వహించనున్న 11వ ప్రపంచ వాతావరణ శిఖరాగ్ర సదస్సు మోదీ, ఒబామా భేటీకి వేదికగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కూడా పాల్గొంటారు. మొత్తం 140 దేశాల ప్రతినిథులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
పారిస్ లో నిర్వహించనున్న ఈ కార్యక్రమం ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలాండే చేతుల మీదుగా జరగనుంది. ఆ రోజు ప్రారంభంకానున్న ఈ సమావేశంలో ఒబామా భారత ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమై మరోసారి ద్వైపాక్షిక సంబంధాలను చర్చిస్తారు. ఇప్పటికే రెండుసార్లు మోదీతో ఒబామా భేటీ అయిన విషయం తెలిసిందే. మోదీతో భేటీకన్నా ముందే చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో ఒబామా భేటీ కానున్నారు.
త్వరలో మోదీతో ఒబామా భేటీ
Published Wed, Nov 25 2015 11:53 AM | Last Updated on Fri, Aug 24 2018 8:06 PM
Advertisement