
అఫ్ఘాన్‌లో ఒబామా రహస్య పర్యటన
బగ్రాం ఎయిర్ ఫీల్డ్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అఫ్ఘానిస్థాన్‌లో ఆదివారం రహస్యంగా పర్యటించారు. వాషింగ్టన్ నుంచి ఎయిర్ ఫోర్స్-1లో బయల్దేరిన ఆయన అఫ్ఘాన్‌లోని బగ్రాం ఎయిర్ ఫీల్డ్‌లో దిగి అమెరికా బలగాలకు చెందిన ప్రధాన స్థావరానికి చేరుకున్నారు. రాత్రి వేళ అక్కడికి చేరుకున్న ఒబామా కొన్ని గంటలు అక్కడే గడిపి వెనుదిరిగారు.