నేపాల్ పార్లమెంట్‌లో విపక్షాల దాడి | Opposition turns violent inside Nepal parliament, on streets | Sakshi
Sakshi News home page

నేపాల్ పార్లమెంట్‌లో విపక్షాల దాడి

Published Wed, Jan 21 2015 3:16 AM | Last Updated on Sat, Oct 20 2018 6:40 PM

నేపాల్ పార్లమెంట్‌లో విపక్షాల దాడి - Sakshi

నేపాల్ పార్లమెంట్‌లో విపక్షాల దాడి

కఠ్మాండు: నేపాల్ రాజ్యాంగ అసెంబ్లీ (పార్లమెంట్) మంగళవారం రణరంగా న్ని తలపించింది. రాజ్యాంగ రచన ప్రక్రియపై ఆగ్రహంతో విపక్ష సభ్యులు అధికార పక్షాల సభ్యులపై దాడికి దిగారు. కుర్చీలు విసిరేసి, భౌతిక దాడులకు పాల్ప డ్డారు. దీంతో సీపీఎన్ చీఫ్ శర్మఓలి,    ఉపాధ్యక్షుడు భండారీ సహా 12 మంది గాయపడ్డారు. రాజ్యాంగ రచనకు గడువు ఈ నెల 22తో ముగియనుండడంతో వివాదాస్పద అంశాలపై ఓటింగ్ కోసం ప్రశ్నావళి తయారీ కమిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను అసెంబ్లీ చైర్మన్ అనుమతించడంతో గొడవ మొదలైంది. ఈ కమిటీ రాజ్యాంగ విరుద్ధమని నేపాల్ మావోయిస్టు పార్టీ నేతృత్వంలోని విపక్ష కూటమి మండిపడింది.  విపక్ష సభ్యులు కుర్చీలు విరగ్గొట్టారు. మార్షల్స్‌పైనా దాడికి దిగారు. ఓటింగ్ ద్వారా రాజ్యాంగాన్ని రచించాలన్న ప్రభుత్వ యత్నానికి నిరసనగా విపక్ష కూటమి మంగళవారం బంద్ చేపట్టడంతో జనజీవనం స్తంభించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement