Opposition attack
-
పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించనున్న విపక్షాలు!
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీయే ప్రారంభిస్తే ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని యోచిస్తున్నట్లు సమాచారం. కొత్త భవనాన్ని ఈ నెల 28న లాంఛనంగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నూతన భవన ప్రారంభోత్సవానికి తాము హాజరు కావడం లేదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఈకార్యక్రమాన్ని బహిష్కరించాలని, దీనిపై అతిత్వరలో ఒక ఉమ్మడి ప్రకటన జారీ చేయాలని పలు భావసారూప్యం కలిగిన ప్రతిపక్షాలు భావిస్తున్నట్లు సమాచారం. బుధవారం తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. పార్లమెంట్ అనేది కేవలం ఒక భవనం కాదని, దేశ ప్రజాస్వామ్యానికి అది పునాది అని తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ చెప్పారు. ఇది ప్రధాని మోదీ సొంత వ్యవహారం కాదని అన్నారు. 2020 డిసెంబర్లో కొత్త పార్లమెంట్ నిర్మాణ శంకుస్థాపన పనులను ప్రతిపక్షాలు బహిష్కరించాయి. ఇది కూడా చదవండి: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం: సావర్కర్ జయంతి.. రాష్ట్రపతికి నో ఆహ్వానం.. రాజకీయ రగడ -
రాజ్యసభలో ప్రతిపక్షాల ఉడుంపట్టు
సాక్షి, న్యూఢిల్లీ : పెద్దల సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు క్లియరెన్స్‌కు తొలిరోజు అవాంతరం ఏర్పడింది. ప్రతిపక్ష పార్టీల గందరగోళంతో అధికార పక్షం బిల్లును ముందుకు తీసుకెళ్లలేకపోయింది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో రాజ్యసభను స్పీకర్ వాయిదా వేశారు. బిల్లుపై గురువారం తిరిగి చర్చ జరగనున్నట్లు తెలిపారు. ఇది వరకే లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్లు ఇప్పుడు రాజ్యసభలోకి చర్చకు వచ్చింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. పలు ప్రతిపక్ష పార్టీలు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సభలో బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాల్సిందేనని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశాయి. దీంతో సభ డిప్యూటీ చైర్మన్ కురియన్ జోక్యం చేసుకొంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను సభలో మాట్లాడనివ్వాలని కోరారు. తన మాట వినకుంటే సభను వాయిదా వేస్తానని కూడా హెచ్చరించారు. ట్రిపుల్ తలాక్ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్‌శర్మ రాజ్యసభలో మోషన్ ఇచ్చారు. అయితే, ఈ బిల్లును ఎందుకు సెలక్ట్ కమిటీకి ఇవ్వకూడదనే విషయంపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చారు. సెలక్ట్ కమిటీకి బిల్లు ఇవ్వడంతో సమయం వృధా అవుతుందని, కనీసం ఆరు నెలలు గడిపోతాయని అన్నారు. ఈ బిల్లు ప్రస్తుతం అత్యవసరంగా ఆమోదించాల్సిన బిల్లు అని, సుప్రీంకోర్టు ఆందోళన కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తుందన్నారు. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలోనే బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ బిల్లుకు ఎవరు మద్దతు ఇస్తున్నారో ఎవరూ ఇవ్వడం లేదో మొత్తం భారతదేశం చూస్తోందని చెప్పారు. కాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు గురించి సభలో న్యాయశాఖ మంత్రి చెప్పిందంతా కూడా సరికాదన్నారు. ఈ బిల్లు కచ్చితంగా సెలక్ట్ కమిటీకి పంపించాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో డిప్యూటీ చైర్మన్ సభను రేపటికి (గురువారానికి) వాయిదా వేశారు. -
ఒడిషా సీఎం రాజీనామాకు విపక్షాల పట్టు
భువనేశ్వర్: నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిన ఘటనపై ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ రాజీనామాకు విపక్షాలు పట్టుపట్టాయి. దీనిపై సోమవారుం ఒడిషా అసెంబ్లీలో తీవ్ర గందరగోళం చెలరేగింది. విపక్షాల ఆందోళనతో స్పీకర్ పలుమార్లు సభను వాయిదా వేశారు. తొలుత సభ ప్రారంభమైన వెంటనే ఈ ఘటనపై సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటన చేస్తుండగా, బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు పెద్దపెట్టున నిరసనకు దిగారు. సీఎం రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. నగరంలోని బొమికల్ ప్రాంతంలో ఆదివారం నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిన ఘటనలో ఒకరు మరణించగా, 11 మంది గాయపడ్డారు. బాధితులకు రూ 5 లక్షలు పరిహారం ప్రకటించినట్టు సీఎం పట్నాయక్ తెలిపారు.ఘటనకు సంబంధించి అయిదుగురిపై కేసు నమోదు చేయగా, సీనియర్ ఇంజనీర్ ఒకరిని అరెస్ట్ చేశారు. -
నేపాల్ పార్లమెంట్లో విపక్షాల దాడి
కఠ్మాండు: నేపాల్ రాజ్యాంగ అసెంబ్లీ (పార్లమెంట్) మంగళవారం రణరంగా న్ని తలపించింది. రాజ్యాంగ రచన ప్రక్రియపై ఆగ్రహంతో విపక్ష సభ్యులు అధికార పక్షాల సభ్యులపై దాడికి దిగారు. కుర్చీలు విసిరేసి, భౌతిక దాడులకు పాల్ప డ్డారు. దీంతో సీపీఎన్ చీఫ్ శర్మఓలి, ఉపాధ్యక్షుడు భండారీ సహా 12 మంది గాయపడ్డారు. రాజ్యాంగ రచనకు గడువు ఈ నెల 22తో ముగియనుండడంతో వివాదాస్పద అంశాలపై ఓటింగ్ కోసం ప్రశ్నావళి తయారీ కమిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను అసెంబ్లీ చైర్మన్ అనుమతించడంతో గొడవ మొదలైంది. ఈ కమిటీ రాజ్యాంగ విరుద్ధమని నేపాల్ మావోయిస్టు పార్టీ నేతృత్వంలోని విపక్ష కూటమి మండిపడింది. విపక్ష సభ్యులు కుర్చీలు విరగ్గొట్టారు. మార్షల్స్‌పైనా దాడికి దిగారు. ఓటింగ్ ద్వారా రాజ్యాంగాన్ని రచించాలన్న ప్రభుత్వ యత్నానికి నిరసనగా విపక్ష కూటమి మంగళవారం బంద్ చేపట్టడంతో జనజీవనం స్తంభించింది.