ఒబామా అలా ఎందుకు చెప్పలేదు?
వాషింగ్టన్: ఆర్లెండో నెట్ క్లబ్ లో దాడిని గట్టిగా ఖండించలేకపోయిన అమెరికా అధ్యక్షుడు ఒబామా రాజీనామా చేయాలని రిపబ్లిక్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. ఆర్లెండో నరమేధానికి 'రాడికల్ ఇస్లాం' కారణమని ఒబామా చెప్పలేకపోయారని అన్నారు. ఆర్లెండోలో జరిగిన ఘటన విద్వేషపూరిత, ఉగ్రవాద ఘాతుకమని బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు.
'మన నాయకులు బలహీనులు కావడం వల్లే ఈ దాడి జరిగింది. ఇలాంటివి జరుగుతాయని నేను ముందే చెప్పాను. భవిష్యత్ లో ఉగ్రవాద దాడులు జరగకుండా నిలువరించి, ప్రజలను కాపాడానికి ప్రయత్నిస్తా'నని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ఆర్లెండో దాడి గురించి ప్రస్తావించనున్నారని ఆయన ప్రచారం బృందం తెలిపింది.