
కాన్‌బెర్రా : అందరూ తమదైన శైలిలో ఇంటిని నిర్మించుకోవడంతో పాటు ప్రతి గదిని ప్రత్యేకంగా కట్టుకోడానికి ప్రయత్నిస్తారు. కానీ ఓ వ్యక్తికి ఇదంతా పాత పద్దతిగా అనిపించిందేమో.. అందుకే గోడలు లేకుండా బాత్రూమ్‌ను నిర్మించుకున్నాడు. ఈ వింత నిర్మాణం ఆస్ట్రేలియాలో జరిగింది. ఓ ఇంటి యజమాని బెడ్‌రూమ్‌లోని బాత్‌రూమ్‌ను గోడలు లేకుండా వింతగా నిర్మించుకున్నాడు. కనీసం అడ్డుగా గ్లాస్‌లను సైతం అమర్చలేదు. డెబ్రా బెల్లా అనే రిపోర్టర్ ఈ దృశ్యాన్ని తన ట్విటర్‌లో పంచుకున్నారు.
‘ఈ ఇంటి దంపతులు తమ బాత్రూమ్‌ను ఇలాగే ఉండాలని కోరుకున్నారు. దీని గురించి మీరేం అనుకుంటున్నారు’ అంటూ.. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేశారు డెబ్రా బెల్లా. జూన్ 14న పోస్ట్ చేసిన ఈ ఫోటో చూసిన నెటిజన్లు బాత్‌రూమ్ ఎవరికైనా వ్యక్తిగత ప్రదేశమని, అయితే ఇదేం బాత్‌రూమ్ అంటూ మండిపడుతున్నారు. ట్విటర్‌లో ఈ స్పందన చూసి ఆశ్చర్యపోయిన ఇంటి యజమాని ట్రాయ్ విలియమ్సన్.. భార్య భర్తలు కలిసి తయారు కావడానికి ఇది చాలా అందంగా ఉంటుందని, అంతేగాక ఇదేమి కొత్త కాదని, వారి ఇళ్లల్లో ఇలాంటి నిర్మాణాలు చేసుకున్నవారు చాలా మంది ఉన్నారని తెలిపాడు.
Ensuites without walls. The owner of this Wynnum house knocked them down and he says it's what couples want. What do you think? #housesforsale pic.twitter.com/2EylnZKHzp
— Debra (@Debrabela81) June 14, 2019