రికార్డు స్థాయిలో పెరిగిన ఓజోన్ రంధ్రం
వాషింగ్టన్: అంటార్కిటికాపై ఉన్న ఓజోన్ పొరలోని రంధ్రం పరిమాణం రికార్డు స్థాయిలో పెరిగింది. స్ట్రాటో ఆవరణంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వల్ల ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు ఎక్కువగా భూమిని చేరే అవకాశముందని నాసా పేర్కొంది.
ఇటీవల ఏర్పడిన ఈ రంధ్రం విస్తీర్ణం ప్రస్తుతం 2.82 కోట్ల చదరపు కి.మీ.కి చేరింది. ఉత్తర అమెరికాపై ఉన్న రంధ్రం కన్నా ఇది పెద్దది. స్ట్రాటో ఆవరణంలో క్లోరిన్, బ్రోమిన్ రసాయనాల వల్ల ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఇది పెరిగిందని అంచనా వేస్తున్నారు. మానవులు తయారుచేసే రసాయనాల వల్ల ఈ క్లోరిన్, బ్రోమిన్ స్థాయి పెరుగుతోంది.